వన్ ప్లస్ టర్బో 6ఎక్స్, టర్బో 6ఎక్స్ ప్రో పేర్లతో రెండు సరికొత్త మోడళ్లను జూన్ మూడో వారంలో లాంచ్ చేయబోతోంది.
Photo Credit: X/@yabhishekhd
OnePlus Turbo 6X Pro सीरीज का खास फोन होगा जिसमें 8000mAh की विशाल बैटरी होगी।
OnePlus : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ త్వరలోనే మార్కెట్లోకి సరికొత్త పవర్‌ఫుల్ మొబైల్స్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. వన్ ప్లస్ టర్బో 6ఎక్స్, టర్బో 6ఎక్స్ ప్రో పేర్లతో రెండు సరికొత్త మోడళ్లను జూన్ మూడో వారంలో లాంచ్ చేయబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన అఫీషియల్ లాంచ్ కంటే ముందే వాటిలోని ప్రొసెసర్, డిస్‌ప్లే, బ్యాటరీ సామర్థ్యానికి సంబంధించిన కీలక వివరాలు బయటకు వచ్చాయి. ఈ ఫోన్లలో ఏకంగా 8000mAh భారీ బ్యాటరీని ఇస్తున్నట్లు తెలుస్తోంది.
జూన్ 18న గ్రాండ్ లాంచ్.. ప్రీ-ఆర్డర్స్ షురూ
తాజా సమాచారం ప్రకారం వన్ ప్లస్ టర్బో 6ఎక్స్ సిరీస్ వచ్చే వారం (జూన్ 18న) చైనాలో అధికారికంగా విడుదల కానుంది. లాంచ్‌కు ముందే ఈ ఫోన్ల కోసం ప్రీ-ఆర్డర్ రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. చైనా వన్ ప్లస్ ప్రెసిడెంట్ లూయిస్ లీ జీ ఈ స్మార్ట్‌ఫోన్ల ముఖ్యమైన ఫీచర్లను హింట్ ఇచ్చారు. అదే సమయంలో ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఎక్స్ వేదికగా ఈ సిరీస్ పూర్తి స్పెసిఫికేషన్లను లీక్ చేసి టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించారు.
వన్ ప్లస్ టర్బో 6ఎక్స్ ప్రో అదిరిపోయే ఫీచర్లు
ఈ సిరీస్‌లో టాప్ మోడల్ అయిన వన్ ప్లస్ టర్బో 6ఎక్స్ ప్రో స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78 ఇంచుల 1.5K శామ్‌సంగ్ అమోలెడ్ డిస్‌ప్లేను ఇస్తున్నారు. ఇది కళ్లకు హాని చేయని ప్రత్యేకమైన ఐ-కేర్ ప్యానెల్ కావడం విశేషం. ఈ ఫోన్‌లో సరికొత్త మీడియాటెక్ డైమెన్సిటీ 7400 సూపర్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
OnePlus Community Sale 2026: వన్ ప్లస్ లవర్స్‌కు పండగే.. భారీ ఆఫర్లతో కమ్యూనిటీ సేల్ 2026 షురూ
ప్రో మోడల్ కెమెరా, సేఫ్టీ, స్టోరేజ్
ఫోటోగ్రఫీ కోసం టర్బో 6ఎక్స్ ప్రో వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు వైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను ఇచ్చారు. సెక్యూరిటీ కోసం ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఇక ఈ ఫోన్‌కు నీరు, దుమ్ము నుంచి అత్యంత బలమైన రక్షణ కల్పించే IP66, IP68, IP69, IP69K రేటింగ్స్ ఇచ్చారు. ఈ మొబైల్ బ్లాక్, ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో.. 8GB+128GB, 8GB+256GB, 12GB+256GB వేరియంట్లలో లభించనుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇందులో 8000mAh మెగా బ్యాటరీ ఉండబోతోంది.
స్టాండర్డ్ మోడల్ వన్ ప్లస్ టర్బో 6ఎక్స్ డీటెయిల్స్
ఇక బేస్ మోడల్ అయిన వన్ ప్లస్ టర్బో 6ఎక్స్ కూడా పవర్‌ఫుల్ ఫీచర్లతో వస్తోంది. ఇందులో 7000mAh బ్యాటరీని అమర్చారు. ఈ ఫోన్ 6.72 ఇంచుల ఎల్‌సీడీ (LCD) ఐ-కేర్ డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్ కింద పడినా పాడవకుండా ఉండేందుకు దీనికి మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ కల్పించారు. ఈ స్మార్ట్‌ఫోన్ డైమెన్సిటీ 7360 సూపర్ ప్రొసెసర్‌తో పనిచేస్తుంది. ఇది కూడా ఆండ్రాయిడ్ 16 బేస్డ్ కలర్ ఓఎస్ 16 తోనే మార్కెట్లోకి రానుంది. కంపెనీ దీనిని బ్లాక్, వైట్, గ్రీన్ కలర్స్‌లో రిలీజ్ చేయనుంది.
టర్బో 6ఎక్స్ కెమెరా, వేరియంట్లు
ఈ స్టాండర్డ్ మోడల్ కెమెరా విషయానికి వస్తే.. దీని వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంటుంది. స్టోరేజ్ పరంగా ఈ ఫోన్ కూడా 8GB+128GB, 8GB+256GB, 12GB+256GB అనే మూడు వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. భారీ బ్యాటరీతో పాటు తక్కువ బడ్జెట్‌లో మంచి పర్ఫార్మెన్స్ ఫోన్ కావాలనుకునే వారికి ఈ సిరీస్ బెస్ట్ ఆప్షన్ కానుంది.
ప్రకటన
ప్రకటన
Asus Dawn 7 Pro Series Launched With Up to 16-Inch 144Hz Display, AMD Ryzen AI 7 445 Chip: Price, Features