వివో వి70 లైట్ స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. దీని బేస్ వేరియంట్ అయిన 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధరను AED 1,099 (భారత కరెన్సీలో సుమారు రూ.28,500)గా నిర్ణయించారు.
Photo Credit: Vivo
Vivo V70 Lite में 6.77 इंच का फुलएचडी प्लस डिस्प्ले मिलता है।
Vivo V70 Lite : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో తన లేటెస్ట్ వి-సిరీస్‌లో సరికొత్త మొబైల్‌ను గ్లోబల్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎలాంటి హడావిడి లేదా ప్రత్యేక ఈవెంట్స్ లేకుండా గుట్టుచప్పుడు కాకుండా వివో వి70 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ 6500mAh భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ మీడియాటెక్ ప్రొసెసర్, సోనీ కెమెరా సెన్సార్ వంటి అద్భుతమైన ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
వివో వి70 లైట్ ధర, వేరియంట్ల వివరాలు
ధర విషయానికి వస్తే.. వివో వి70 లైట్ స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. దీని బేస్ వేరియంట్ అయిన 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధరను AED 1,099 (భారత కరెన్సీలో సుమారు రూ.28,500)గా నిర్ణయించారు. అదేవిధంగా, దీని టాప్-ఎండ్ మోడల్ అయిన 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర AED 1,299 (సుమారు రూ.33,500)గా ఉంది. కంపెనీ ఈ ఫోన్‌ను క్లాసిక్ బ్లాక్, రాయల్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో కస్టమర్లకు అందిస్తోంది. ప్రస్తుతం ఈ డివైజ్ వివో అధికారిక అంతర్జాతీయ వెబ్‌సైట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
అదిరిపోయే డిస్‌ప్లే, సెల్ఫీ కెమెరా
ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే.. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే 6.77 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ (FHD+) అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేను అమర్చారు. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా ఇందులో 3000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందించారు. ఈ డిస్‌ప్లే పంచ్-హోల్ డిజైన్‌తో వస్తుంది. అందులోనే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం అద్భుతమైన 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. అదనపు భద్రత కోసం స్క్రీన్ కిందే అండర్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఫీచర్‌ను కూడా ఇచ్చారు.
సోనీ సెన్సార్‌తో పవర్‌ఫుల్ డ్యూయల్ కెమెరా సెటప్
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం వివో వి70 లైట్ వెనుక భాగంలో ఆకట్టుకునే డ్యూయల్ కెమెరా సెటప్‌ను డిజైన్ చేశారు. ఇందులో f/1.8 అపెర్చర్ కలిగిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ మెయిన్ కెమెరా ఉంది, దీని కోసం హై-క్వాలిటీ సోనీ IMX882 సెన్సార్‌ను ఉపయోగించారు. దీనివల్ల తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫోటోలు వస్తాయి. దీనితో పాటు వైడ్ యాంగిల్ షాట్స్ తీసుకోవడానికి వీలుగా 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను కూడా జత చేశారు.
Xiaomi Pad 8 : టాబ్లెట్ కొనాలనుకునే వారికి షాక్.. గుట్టుచప్పుడు కాకుండా ధరలు పెంచేసిన షావోమి
టర్బో ప్రొసెసర్, లేటెస్ట్ సాఫ్ట్‌వేర్
మంచి పర్ఫార్మెన్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది మల్టీటాస్కింగ్, గేమింగ్‌ను చాలా స్మూత్‌గా రన్ చేస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. దీనిపై వివోకు చెందిన ఓరిజిన్ ఓఎస్ 6 లేటెస్ట్ స్కిన్ లేయర్ రన్ అవుతుంది.
6500mAh మెగా బ్యాటరీ.. 90W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్
ఈ ఫోన్, అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని బ్యాటరీ సామర్థ్యమే. వివో వి70 లైట్‌లో ఏకంగా 6500mAh భారీ బ్యాటరీని ఇచ్చారు. సాధారణ వినియోగదారులకు ఇది హ్యాపీగా రెండు రోజుల పాటు బ్యాకప్ ఇస్తుంది. ఇంత పెద్ద బ్యాటరీని చాలా వేగంగా ఛార్జ్ చేయడానికి వీలుగా కంపెనీ ఇందులో 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందించింది. పవర్‌ఫుల్ ప్రొసెసర్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, బెస్ట్ కెమెరా ఫోన్ కావాలనుకునే మిడ్-రేంజ్ బడ్జెట్ కస్టమర్లకు ఈ ఫోన్ చక్కటి ఛాయిస్ కానుంది.
ప్రకటన
ప్రకటన