Devin AI : ఐటీ కంపెనీలకు బంపర్ ఆఫర్.. రిజల్ట్ రాకపోతే రూ.95 కోట్లు ఇస్తామంటున్న AI కంపెనీ

తమ ఏఐ టూల్ కస్టమర్లకు సరైన వ్యాల్యూ ఇవ్వకపోతే భారీ మొత్తంలో నష్టపరిహారం ఇస్తామని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించింది.

Devin AI : ఐటీ కంపెనీలకు బంపర్ ఆఫర్.. రిజల్ట్ రాకపోతే రూ.95 కోట్లు ఇస్తామంటున్న AI కంపెనీ

Photo Credit: Unsplash/ Markus Winkler

Cognition ने Devin AI के लिए नई Productivity Guarantee की घोषणा की

ముఖ్యాంశాలు
  • ఐటీ కంపెనీలకు బంపర్ ఆఫర్
  • రిజల్ట్ రాకపోతే రూ. 95 కోట్లు ఇస్తామంటున్న మోస్ట్ పాపులర్ AI కంపెనీ
  • సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 'డెవిన్' సరికొత్త రికార్డు
ప్రకటన

Devin AI : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ వాడకం కంపెనీలలో విపరీతంగా పెరిగిపోతోంది. అయితే దీనితో పాటు కొత్త ఆందోళనలు కూడా మొదలయ్యాయి. చాలా కంపెనీలు AI కోసం తాము పెడుతున్న భారీ ఖర్చులకు తగ్గ ఫలితం వస్తోందా లేదా అనే విషయాలపై లెక్కలు వేస్తున్నాయి. నిజంగానే ఈ టూల్స్ వల్ల కంపెనీలకు ఎంతవరకు ఉపయోగం ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్న తరుణంలో, ప్రముఖ ఏఐ స్టార్టప్ కాగ్నిషన్  ఒక ఊహించని సంచలన ప్రకటన చేసింది. తమ ఏఐ టూల్ కస్టమర్లకు సరైన వ్యాల్యూ ఇవ్వకపోతే భారీ మొత్తంలో నష్టపరిహారం ఇస్తామని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించింది.

రూ.95 కోట్ల ప్రొడక్టివిటీ గ్యారెంటీ
ప్రపంచంలోనే మొట్టమొదటి వర్చువల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పేరు తెచ్చుకున్న  డెవిన్(Devin AI) కస్టమర్లకు ఆశించిన స్థాయిలో ఇంజనీరింగ్ వ్యాల్యూని ఇవ్వలేకపోతే, ఏకంగా 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ.95.36 కోట్లు) వరకు పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాగ్నిషన్ సంస్థ తెలిపింది. ఈ సరికొత్త ప్రోగ్రామ్‌కు కంపెనీ  AI ప్రొడక్టివిటీ గ్యారెంటీ అని పేరు పెట్టింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X వేదికగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. ఏఐ టూల్స్ అనేవి కేవలం వాడుకోవడానికి మాత్రమే కాదు, అవి తమ నైపుణ్యాన్ని, కంపెనీకి జరిగే లాభాన్ని కూడా నిరూపించుకోవాలని స్పష్టం చేసింది.

క్యాష్ కాదు.. క్రెడిట్స్ రూపంలో పరిహారం
కంపెనీ వివరణ ప్రకారం.. ఒకవేళ డెవిన్ ఏఐ కస్టమర్లు చెల్లించిన డబ్బుకు తగ్గట్లుగా పని చేయకపోతే, ఆ నష్టాన్ని కాగ్నిషన్ సంస్థ భరిస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ 10 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని కంపెనీ కస్టమర్లకు నేరుగా చేతికి నగదు రూపంలో ఇవ్వదు. దానికి బదులుగా క్రెడిట్స్ రూపంలో అందిస్తుంది. ఈ క్రెడిట్లను ఉపయోగించుకుని కస్టమర్లు భవిష్యత్తులో కాగ్నిషన్ సంస్థకు చెందిన మరిన్ని ఏఐ సేవలను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది.

వర్చువల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డెవిన్ ప్రత్యేకత
డెవిన్ అనేది కాగ్నిషన్ సంస్థ తయారు చేసిన ఒక అద్భుతమైన ఏజెంటిక్ ఏఐ సిస్టమ్. ఇది ఒక సాధారణ చాట్‌బాట్ లాగా కాకుండా, ఒక నిజమైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లాగా బ్యాక్‌గ్రౌండ్‌లో స్వయంగా కోడింగ్ చేయగలదు. యూజర్లు ఏ రకమైన ఇంజనీరింగ్ టాస్క్ ఇచ్చినా.. ఇది స్వయంగా అర్థం చేసుకుని, ప్రాజెక్టులను పూర్తి చేస్తుంది. ఏఐ ఇండస్ట్రీ ఇప్పుడు కేవలం టోకెన్ల వాడకాన్ని పెంచడం పక్కన పెట్టి, కంపెనీలకు ఉపయోగపడే నిజమైన ప్రొడక్టివిటీని ఇవ్వడంపైనే దృష్టి పెట్టాలని కాగ్నిషన్ బలంగా నమ్ముతోంది.

Smartphone Comparison : షావోమి 17T వర్సెస్ వీవో X300 FE వర్సెస్ వన్ ప్లస్ 15.. ఫీచర్లు, ధరల పరంగా ఏది బెస్ట్?


పనితీరును కొలిచేందుకు AI ఎస్టిమేటర్ 
ఈ గ్యారెంటీ ప్రోగ్రామ్‌ను కరెక్ట్‌గా అమలు చేయడం కోసం కంపెనీ ప్రత్యేకంగా  AI ఎస్టిమేటర్ అనే సిస్టమ్‌ను డిజైన్ చేసింది. డెవిన్ పూర్తి చేసిన ప్రతి సెషన్‌ను ఈ సిస్టమ్ నిశితంగా పరిశీలిస్తుంది. ముఖ్యంగా రెండు ప్రశ్నల ఆధారంగా ఇది పనిచేస్తుంది. మొదటిది.. డెవిన్ చేసిన పని నిజంగా ఒక హ్యూమన్ ఇంజనీర్‌కు ఉపయోగపడిందా? రెండోది.. ఒకవేళ ఇదే పనిని మనుషులు చేయాల్సి వస్తే ఎంత సమయం పట్టేది? ఈ లెక్కల ప్రకారం కేవలం కోడింగ్ లైన్లను బట్టి కాకుండా, ఒక ఇంజనీర్ పని గంటల ఆధారంగా ప్రొడక్టివిటీని లెక్కిస్తారు. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ రంగంలో కొన్నిసార్లు చిన్న మార్పు చేయడానికే గంటల కొద్దీ సమయం పడుతుంది.

డాలర్ వ్యాల్యూగా మారే సమయం
కాగ్నిషన్ కంపెనీ సీఈఓ స్కాట్ వూ తన బ్లాగ్ పోస్ట్‌లో ఈ సరికొత్త సిస్టమ్ గురించి మరిన్ని వివరాలు పంచుకున్నారు. ఏఐ సేవ్ చేసిన ఇంజనీరింగ్ సమయాన్ని ఈ సిస్టమ్ డాలర్ వ్యాల్యూలోకి మారుస్తుందని ఆయన చెప్పారు. ఆ తర్వాత, వచ్చిన వ్యాల్యూని కస్టమర్ చెల్లించిన అసలు ఖర్చుతో పోల్చి చూస్తారు. ఒకవేళ సిస్టమ్ లెక్కల ప్రకారం ఏఐ సృష్టించిన వ్యాల్యూ, కస్టమర్ పెట్టిన ఖర్చు కంటే తక్కువగా ఉంటే.. ఆ గ్యాప్‌ను భర్తీ చేయడానికి కంపెనీ క్రెడిట్లను రీఫండ్ చేస్తుంది.

ఎవరికి ఈ ఆఫర్?
అయితే ఈ కొత్త మోడల్‌పై టెక్ నిపుణుల నుంచి కొన్ని సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రొడక్టివిటీ ఎంత అనేది కాగ్నిషన్ సంస్థకు చెందిన ఏఐ సిస్టమే స్వయంగా లెక్కిస్తుంది కాబట్టి, ఈ నిర్ణయాలు ఎంతవరకు నిష్పక్షపాతంగా ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే 126 మంది వినియోగదారుల నుంచి సేకరించిన 258 ఎంటర్‌ప్రైజ్ సెషన్ల డేటా ఆధారంగా ఈ సిస్టమ్‌ను పరీక్షించామని కంపెనీ సమర్థించుకుంది. కాకపోతే, కొన్నిసార్లు మనుషుల పని సమయాన్ని అంచనా వేయడంలో 2 లేదా 3 రెట్లు తేడాలు వచ్చే అవకాశం ఉందని కూడా ఒప్పుకుంది. ప్రస్తుతం ఈ భారీ గ్యారెంటీ ప్రోగ్రామ్ కేవలం డెవిన్ క్లౌడ్‎ను పెద్ద ఎత్తున వాడుతూ, కంపెనీ పెట్టిన అన్ని నిబంధనలకు లోబడి ఉండే పెద్ద ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది.

#తాజా కథనాలు
  1. Electric Taxi : ఓలా, ఉబర్‌లకు గట్టి పోటీ.. కేవలం విన్‌ఫాస్ట్ ఈవీ కార్లతోనే సరికొత్త క్యాబ్ సర్వీస్ ప్రారంభం
  2. Devin AI : ఐటీ కంపెనీలకు బంపర్ ఆఫర్.. రిజల్ట్ రాకపోతే రూ.95 కోట్లు ఇస్తామంటున్న AI కంపెనీ
  3. Smartphone Comparison : షావోమి 17T వర్సెస్ వీవో X300 FE వర్సెస్ వన్ ప్లస్ 15.. ఫీచర్లు, ధరల పరంగా ఏది బెస్ట్?
  4. OnePlus Community Sale 2026: వన్ ప్లస్ లవర్స్‌కు పండగే.. భారీ ఆఫర్లతో కమ్యూనిటీ సేల్ 2026 షురూ
  5. OnePlus 11 5G : ఫ్లిప్‌కార్ట్‌లో క్రేజీ ఆఫర్.. సగం ధరకే లగ్జరీ వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్!
  6. Wagon R Flex Fuel : ఇంజన్ మార్చేశారు.. సరికొత్త సెన్సార్లు పెట్టారు.. వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ స్పెషాలిటీస్ ఇవే
  7. Ugly Story : ఓటీటీలోకి వచ్చేసిన అవికా గోర్ అగ్లీ స్టోరీ.. గుండెల్ని పిండేసే ఎమోషనల్ డ్రామా
  8. Instagram Reels : మెట్రో సిటీలకే కాదు.. పల్లెటూరి జనాభాకు కూడా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పిచ్చి ముదిరింది
  9. Xiaomi TV : భారత్‌లోకి షావోమి సరికొత్త టీవీ FX మినీ ఎల్‌ఈడీ సిరీస్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
  10. Smartphone Comparison : భారత మార్కెట్లో మొబైల్స్ వార్.. షావోమి 17టి, వివో X200T, శాంసంగ్ గెలాక్సీ A57లలో ఏది బెస్ట్?
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »