Instagram Plus : ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఇన్‌స్టాగ్రామ్ ప్లస్.. పైసలు కడితేనే ఆ అదిరిపోయే ఫీచర్లు బాస్

ఇన్‌స్టాగ్రామ్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ను కంపెనీ ప్రధానంగా మూడు విభాగాలుగా విభజించింది. ఇందులో సోషల్ కనెక్టివిటీ, అడ్వాన్స్‌డ్ ఇన్సైట్స్, ప్రొఫైల్ కస్టమైజేషన్‌కు సంబంధించిన ఫీచర్లు ఉన్నాయి.

Instagram Plus : ఇన్‌స్టాగ్రామ్ నుంచి  ఇన్‌స్టాగ్రామ్ ప్లస్.. పైసలు కడితేనే ఆ అదిరిపోయే ఫీచర్లు బాస్

Photo Credit: Meta

Instagram Plus सब्सक्रिप्शन के साथ कई नए प्रीमियम फीचर्स आए

ముఖ్యాంశాలు
  • ఇన్‌స్టాగ్రామ్ నుంచి ‘ఇన్‌స్టాగ్రామ్ ప్లస్’
  • కొత్త పెయిడ్ ప్లాన్ ప్రకటించిన మెటా (Meta) సంస్థ
  • స్టోరీల టైమ్ 24 నుంచి 48 గంటలకు పెంపు
ప్రకటన

Instagram Plus : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్ల కోసం ఒక సంచలన ప్రకటన చేసింది. ప్లాట్‌ఫామ్‌లో మరింత పర్సనలైజేషన్, అడ్వాన్స్‌డ్ ఆప్షన్లు కోరుకునే వారి కోసం ఇన్‌స్టాగ్రామ్ ప్లస్ పేరుతో సరికొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను పరిచయం చేసింది. అయితే, సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్ వాడే కస్టమర్లు దీనికోసం ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యాప్ నార్మల్ ఎక్స్‌పీరియన్స్ ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగా ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. అదనపు కంట్రోల్స్, క్రేజీ ఫీచర్లు కావాలనుకునే వారు మాత్రమే ఈ పెయిడ్ ప్లాన్ తీసుకోవచ్చు.

మూడు కేటగిరీలుగా సరికొత్త ఫీచర్లు
ఈ సరికొత్త ఇన్‌స్టాగ్రామ్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ను కంపెనీ ప్రధానంగా మూడు విభాగాలుగా విభజించింది. ఇందులో సోషల్ కనెక్టివిటీ, అడ్వాన్స్‌డ్ ఇన్సైట్స్, ప్రొఫైల్ కస్టమైజేషన్‌కు సంబంధించిన ఫీచర్లు ఉన్నాయి. తమ అకౌంట్‌పై, అలాగే తాము పెట్టే కంటెంట్‌పై యూజర్లకు పూర్తి స్థాయి కంట్రోల్ ఇవ్వడమే ఈ కొత్త అప్‌డేట్ యొక్క ముఖ్య ఉద్దేశమని ఇన్‌స్టాగ్రామ్ అధికారికంగా వెల్లడించింది.

48 గంటల పాటు ఉండే స్టోరీలు
ఈ పెయిడ్ ప్లాన్ తీసుకునే సబ్‌స్క్రైబర్ల కోసం స్టోరీ స్పాట్‌లైట్ అనే ఫీచర్‌ను ఇస్తున్నారు. దీనివల్ల మీరు పెట్టే స్టోరీ.. మీ ఫ్రెండ్స్ స్టోరీ ఫీడ్‌లో అందరికంటే ముందు ప్రయారిటీతో కనిపిస్తుంది. అలాగే ప్రస్తుతం ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ ఫీచర్‌ను మరింత అప్‌గ్రేడ్ చేస్తూ మల్టిపుల్ స్టోరీ ఆడియన్స్ ఫీచర్‌ను తెచ్చారు. దీని ద్వారా వేర్వేరు వ్యక్తుల కోసం వేర్వేరు కస్టమ్ లిస్ట్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. అన్నింటికంటే హైలైట్ ఏంటంటే.. స్టోరీ ఎక్స్‌టెండ్ ఫీచర్ ద్వారా మీ స్టోరీ కాలపరిమితిని 24 గంటల నుంచి ఏకంగా 48 గంటల వరకు పెంచుకోవచ్చు.

Smartphone Comparison : షావోమి 17T వర్సెస్ వీవో X300 FE వర్సెస్ వన్ ప్లస్ 15.. ఫీచర్లు, ధరల పరంగా ఏది బెస్ట్?


రియాక్షన్స్ కోసం సూపర్ హార్ట్స్
చాటింగ్‌ను, స్టోరీ ఇంటరాక్షన్‌ను మరింత ఫన్నీగా మార్చడానికి ఇన్‌స్టాగ్రామ్ ప్లస్‌లో సూపర్ హార్ట్స్ అనే కొత్త ఫీచర్‌ను జోడించారు. దీని సహాయంతో మీరు మీ ఫ్రెండ్స్ పెట్టే స్టోరీలపై రియాక్ట్ అయినప్పుడు స్క్రీన్ మీద అదిరిపోయే ఎనిమేటెడ్ హార్ట్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. స్టోరీస్ చూసేటప్పుడు యూజర్లకు సరికొత్త అనుభూతిని ఇవ్వడానికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది.

మీ స్టోరీని ఎవరు ఎన్నిసార్లు చూశారో తెలిసిపోతుంది
ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేట్ చేసేవారికి, తమ స్టోరీల పర్ఫార్మెన్స్‌ను ట్రాక్ చేయాలనుకునే వారికి ఈ ప్లాన్ చాలా బాగా ప్లస్ అవుతుంది. ఇందులో స్టోరీ రీవాచ్ ఇన్సైట్స్  అనే టూల్‌ను ఇస్తున్నారు. దీని ద్వారా మీ స్టోరీని ఎవరైనా మళ్లీ మళ్లీ (రీవాచ్) చూస్తే.. అది ఎన్నిసార్లు చూశారో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మీ స్టోరీ వ్యూవర్ లిస్ట్‌లో ఎవరి అకౌంట్ అయినా వెతకాలనుకుంటే సులభంగా సర్చ్ చేసుకోవడానికి ‘సర్చ్ వ్యూవర్ లిస్ట్' ఫీచర్‌ను కూడా యాడ్ చేశారు.

సీక్రెట్‌గా స్టోరీలు చూసేయొచ్చు
చాలా మంది యూజర్లు ఎదుటివారి ఇన్‌స్టా స్టోరీలను చూడాలనుకుంటారు.. కానీ తమ పేరు అక్కడ వ్యూవర్ లిస్ట్‌లో పడకూడదని కోరుకుంటారు. అలాంటి వారి కోసం  స్టోరీ ప్రివ్యూ  అనే మైండ్ బ్లాకింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఈ ఫీచర్ ఉన్న సబ్‌స్క్రైబర్లు అవతలి వ్యక్తి స్టోరీని ఓపెన్ చేసినా కూడా, అక్కడ మీ పేరు రికార్డ్ అవ్వదు. అంటే మీ వ్యూ పడకుండానే మీరు వారి స్టోరీని సీక్రెట్‌గా చూసేయొచ్చు అన్నమాట.

ప్రొఫైల్ కస్టమైజేషన్ ఆప్షన్లు
ఇన్‌స్టాగ్రామ్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌లో మూడో భాగం పూర్తిగా మీ ప్రొఫైల్ లుక్‌ను మార్చడానికి ఉపయోగపడుతుంది. అయితే దీనికి సంబంధించిన అన్ని ఫీచర్ల వివరాలను కంపెనీ ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ ఇన్‌స్టాగ్రామ్ ప్లస్ ప్లాన్‌ను గ్లోబల్ లెవెల్లో రోలౌట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రీమియం ప్లాన్ కింద మరిన్ని సరికొత్త అదనపు ఫీచర్లను యాడ్ చేయనున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »