ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లను టెలివిజన్, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఏకంగా 1.2 బిలియన్ల (120 కోట్లు) మంది కస్టమర్లు వీక్షించారని జియోస్టార్ వెల్లడించింది.
Photo Credit: BCCI
IPL
IPL 2026 : భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ పండగ ఐపీఎల్ ఈ ఏడాది వ్యూయర్‌షిప్ పరంగా సరికొత్త చరిత్ర సృష్టించింది. గత కొన్ని సంవత్సరాలుగా ఐపీఎల్ క్రేజ్ విపరీతంగా పెరుగుతూ వస్తోంది. దీనిని చూసే లంక ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్ లాంటి టోర్నమెంట్లు పుట్టుకొచ్చినప్పటికీ.. మన ఐపీఎల్ రేంజ్ మాత్రం ఎవరూ అందుకోలేకపోయారు. ఈ ఏడాది టోర్నీ డిజిటల్, టెలివిజన్ బ్రాడ్‌కాస్టింగ్ పార్టనర్ అయిన జియోస్టార్ తాజాగా ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం.. ఈ సీజన్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మంది వీక్షించిన సీజన్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పింది.
1.2 బిలియన్ల వ్యూయర్స్.. ఆర్‌సీబీ రెండోసారి కప్ విన్నర్
ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లను టెలివిజన్, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఏకంగా 1.2 బిలియన్ల (120 కోట్లు) మంది కస్టమర్లు వీక్షించారని జియోస్టార్ వెల్లడించింది. దేశంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ అయిన ఐపీఎల్ రీచ్.. ఏడాది ప్రాతిపదికన ఏకంగా 7 శాతం పెరిగింది. అభిమానులు ఈ మ్యాచ్‌లను చూసిన మొత్తం సమయం ఏకంగా 870 బిలియన్ నిమిషాలుగా నమోదైంది. అన్నింటికంటే ముఖ్యంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ వాచ్డ్ మ్యాచ్‌గా నిలిచింది. ఈ హోరాహోరీ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించి, తమ రెండో ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌ను ఏకంగా 40 కోట్ల మంది లైవ్‌లో చూడటం విశేషం.
కనెక్టెడ్ టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ హవా
ఈసారి ఐపీఎల్ డిజిటల్ రంగంలో ఊహించని గ్రోత్ నమోదు చేసిందని జియోస్టార్ తెలిపింది. ముఖ్యంగా ఇంట్లో ఇంటర్నెట్ ద్వారా నడిచే కనెక్టెడ్ టీవీలలో మ్యాచ్‌లు చూసే వారి సంఖ్య గత ఏడాది కంటే ఏకంగా 22 శాతం పెరిగింది. ఐపీఎల్ వీక్షించడానికి అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్లాట్‌ఫామ్‌గా ఇది అవతరించింది. మరోవైపు డిజిటల్ వీడియోలపై వ్యూస్ సంఖ్య కూడా 8 శాతం పెరిగి.. ఏకంగా 25 బిలియన్ల (2500 కోట్లు) వ్యూస్ మైలురాయిని దాటేసింది. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీల వాడకం పెరగడం వల్లే ఈ స్థాయిలో డిజిటల్ వ్యూస్ వచ్చాయని నిపుణులు చెబుతున్నారు.
Smartphone Comparison : మిడ్-బడ్జెట్ రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్ల మహా సంగ్రామం.. రియల్‌మీ, వన్‌ప్లస్, పోకో ఫోన్ల మధ్య గట్టి పోటీ
ప్రాంతీయ భాషల కామెంట్రీకి కాసుల వర్షం
ఈ సీజన్ లో స్థానిక భాషల్లో ఐపీఎల్ కవరేజ్ అందించడం కంపెనీకి బాగా కలిసి వచ్చింది. సొంత భాషల్లో మ్యాచ్‌లు చూడటానికి కస్టమర్లు ఎక్కువ ఆసక్తి చూపించారు. దీనివల్ల ప్రాంతీయ భాషల్లో ఐపీఎల్ చూసిన వాచ్ టైమ్ ఏడాది ప్రాతిపదికన ఏకంగా 33 శాతం భారీ వృద్ధిని సాధించింది. ఈ ఏడాది ఏకంగా 12 ప్రాంతీయ భాషల్లో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలు, కామెంట్రీని జియోస్టార్ విజయవంతంగా నిర్వహించింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్రికెట్ ప్రేమికులు టీవీలు, మొబైల్ స్క్రీన్లకు అతుక్కుపోయారు.
ఓపెన్ ఏఐ, స్విగ్గీ టై-అప్‌తో సరికొత్త టెక్నాలజీ
క్రికెట్ ఫ్యాన్స్ ప్రయాణాన్ని, ఎక్స్‌పీరియన్స్‌ను మరింత లగ్జరీగా మార్చేందుకు ఈసారి సరికొత్త టెక్నాలజీని ఉపయోగించారు. మ్యాచ్‌ల ప్రసారం కోసం 30 ఫీడ్స్, మల్టీ-క్యామ్ వంటి అద్భుతమైన ఫీచర్లను ప్రవేశపెట్టారు. దీనివల్ల యూజర్లు తమకు నచ్చిన కెమెరా యాంగిల్ లో మ్యాచ్‌ను వీక్షించే అవకాశం లభించింది. వీటితో పాటు లైవ్ టెలికాస్ట్ జరుగుతున్న సమయంలో వ్యూయర్స్ ఎంగేజ్‌మెంట్ పెంచడానికి ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ, ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ లతో ప్రత్యేక టై-అప్ కుదుర్చుకున్నారు. దీని ద్వారా మ్యాచ్ చూస్తూనే చాట్ చేయడం, ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం లాంటి సరికొత్త క్రేజీ ఫీచర్లను కస్టమర్లకు అందించారు.
ప్రకటన
ప్రకటన
Google Home Speaker Finally Makes Its Global Debut, Available to Pre-Order in Select Markets: Price, Features