ఒప్పో రెనో 16c 5G ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తోంది.
Photo Credit: Oppo/Google/Samsung
Oppo Reno 16c 5G vs Google Pixel 9a vs Samsung Galaxy S25 FE
Oppo Reno 16c : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో భారత మార్కెట్లోకి సరికొత్త మోడల్‌ను పరిచయం చేసింది. ఒప్పో రెనో 16c 5G పేరుతో సరికొత్త ఫీచర్లతో ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. మార్కెట్లోకి రాకముందే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్, ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న గూగుల్ పిక్సెల్ 9a, శాంసంగ్ గెలాక్సీ S25 FE మోడళ్లకు నేరుగా పోటీగా నిలుస్తోంది. ప్రీమియం లుక్, అదిరిపోయే కెమెరా క్వాలిటీ, భారీ బ్యాటరీ సామర్థ్యంతో వచ్చిన ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్? వినియోగదారులు ఏ ఫోన్ వైపు మొగ్గు చూపవచ్చు? అనే విషయాలను వాటి ఫీచర్లు, ధరల ఆధారంగా పోల్చి తెలుసుకుందాం.
ఒప్పో రెనో 16c vs గూగుల్ పిక్సెల్ 9a vs శాంసంగ్ గెలాక్సీ S25 FE: ధరల వివరాలు
ఈ మూడు స్మార్ట్ఫోన్ల ధరల విషయానికి వస్తే వినియోగదారులకు వేర్వేరు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఒప్పో రెనో 16c 5G ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తోంది. దీని 8GB+128GB వేరియంట్ ధర రూ.46,999 గా ఉండగా, 8GB+256GB మోడల్ ధర రూ.49,999, టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12GB+256GB ధర రూ.55,999 గా కంపెనీ నిర్ణయించింది. మరోవైపు, గూగుల్ పిక్సెల్ 9a కేవలం ఒకే ఒక 8GB+256GB స్టోరేజ్ వేరియంట్లో లభిస్తుండగా దీని ధర రూ.49,999 గా ఉంది. ఇక శాంసంగ్ గెలాక్సీ S25 FE మోడల్ విషయానికి వస్తే, దీని 8GB+128GB వేరియంట్ ధర రూ.45,499 గా ఉంది. బడ్జెట్ పరంగా చూస్తే శాంసంగ్ ప్రారంభ ధర కొద్దిగా తక్కువగా ఉండగా, ఒప్పో ఎక్కువ వేరియంట్ల ఛాయిస్‌ను ఇస్తోంది.
డిస్ప్లే రేసులో ఏది బెస్ట్?
డిస్ప్లే విభాగంలో మూడు కంపెనీలు కూడా వినియోగదారులకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తున్నాయి. ఒప్పో రెనో 16c 5G లో 6.57 ఇంచుల AMOLED డిస్ప్లేను ఇచ్చారు. ఇది FHD+ రెజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 1,400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. గూగుల్ పిక్సెల్ 9a లో 6.3 ఇంచుల ఆక్చువా pOLED డిస్ప్లే ఉంది. ఇది 1080x2424 పిక్సెల్స్ రెజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 2700 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఇక శాంసంగ్ గెలాక్సీ S25 FE లో 6.7 ఇంచుల అతిపెద్ద డైనమిక్ అమోలెడ్ 2X డిస్ప్లేను అమర్చారు. ఇది 1080x2340 పిక్సెల్స్ రెజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 1,900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పనిచేస్తుంది. ఇక్కడ స్క్రీన్ సైజ్ పరంగా శాంసంగ్ పెద్దదిగా ఉన్నప్పటికీ, బ్రైట్నెస్ పరంగా గూగుల్ పిక్సెల్ చాలా మెరుగ్గా ఉంది.
ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టమ్
స్మార్ట్‌ఫోన్ స్పీడ్, పర్ఫార్మెన్స్ అనేవి వాటిల్లో ఉపయోగించే ప్రొసెసర్లపై ఆధారపడి ఉంటాయి. ఒప్పో రెనో 16c 5G మోడల్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌ను అందించారు. దీనికి భిన్నంగా గూగుల్ పిక్సెల్ 9a లో వారి సరికొత్త ఫోర్త్ జనరేషన్ టెన్సర్ G4 పవర్ఫుల్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇక శాంసంగ్ గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్ సొంత బ్రాండ్ అయిన శాంసంగ్ ఎక్సినోస్ 2400 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే, ఒప్పో ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ 16తో వస్తుంది. గూగుల్ పిక్సెల్ 9a సరికొత్త ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. శాంసంగ్ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8తో రన్ అవుతుంది.
బ్యాటరీ పవర్లో ఒప్పో నయా రికార్డ్
బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే ఒప్పో రెనో 16c 5G మిగిలిన రెండు ఫోన్ల కంటే చాలా ముందుంది. ఒప్పో ఈ ఫోన్ లో ఏకంగా 7,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చింది. ఇది రెండు రోజుల పాటు నిరంతరాయంగా పనిచేయడమే కాకుండా 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనికి పోటీగా గూగుల్ పిక్సెల్ 9a లో 5,100mAh బ్యాటరీని మాత్రమే ఇచ్చారు. ఇక శాంసంగ్ గెలాక్సీ S25 FE విషయానికి వస్తే ఇందులో 4,900mAh బ్యాటరీ ఉంది, ఇది 45W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. బ్యాటరీ బ్యాకప్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకునే వారికి ఒప్పో అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది.
Apple : ఫోల్డబుల్ ఐఫోన్ సేల్స్ ఆలస్యం కానున్నాయా? యాపిల్ ఎదుర్కొంటున్న సవాళ్లు ఇవే
కెమెరా ప్రియులకు పండగే
ఫోటోగ్రఫీ పరంగా మూడు ఫోన్లు కూడా అద్భుతమైన కెమెరా సెటప్‌లను కలిగి ఉన్నాయి. ఒప్పో రెనో 16c 5G వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా ఉంది. ఇందులో OIS సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 9a వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OIS సపోర్ట్‌తో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ S25 FE లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి. ఇక సెల్ఫీల విషయానికి వస్తే ఒప్పో ఏకంగా 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇవ్వగా, గూగుల్ 13 మెగాపిక్సెల్, శాంసంగ్ 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలను కలిగి ఉన్నాయి. సెల్ఫీల్లో ఒప్పో నెంబర్ వన్ గా నిలుస్తోంది.
కనెక్టివిటీ ఆప్షన్స్
కనెక్టివిటీ పరంగా ఈ తరం సాంకేతికతకు తగినట్లుగా మూడు ఫోన్లలోనూ అన్ని సదుపాయాలు కల్పించారు. ఒప్పో రెనో 16c 5G ఫోన్లో 5G, 4G LTE నెట్‌వర్క్‌లతో పాటు వై-ఫై, లేటెస్ట్ బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్-సి పోర్ట్, జీపీఎస్ ఫీచర్లు ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 9a లో 5G, 4G LTE తో పాటు అడ్వాన్స్డ్ వై-ఫై 6E, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ, జీపీఎస్ , యూఎస్బీ 3.2 టైప్-సి పోర్ట్‌ను అందించారు. ఇక శాంసంగ్ గెలాక్సీ S25 FE లో కూడా కనెక్టివిటీ పరంగా 4G, 5G, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సి పోర్ట్ సపోర్ట్ ఉంది. ఓవరాల్‌గా ఫీచర్ల పరంగా చూస్తే ఈ మూడు ఫోన్లు ఒకదానికొకటి గట్టి పోటీని ఇస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన
iPhone Air 2 Tipped to Feature Bigger Battery, Dual Rear Cameras