Xiaomi 18 : షావోమి నుంచి నెక్స్ట్ లెవెల్ స్మార్ట్‌ఫోన్ సిరీస్.. మార్కెట్లోకి త్వరలోనే Xiaomi 18 సిరీస్ లాంచ్

షావోమి 18 ప్రో మాక్స్ మోడల్లో బ్రహ్మాండమైన విజువల్స్ కోసం 6.9 ఇంచుల భారీ 2K OLED డిస్‌ప్లేను అందించనున్నారు.

Xiaomi 18  : షావోమి నుంచి నెక్స్ట్ లెవెల్ స్మార్ట్‌ఫోన్ సిరీస్.. మార్కెట్లోకి త్వరలోనే Xiaomi 18 సిరీస్ లాంచ్

Xiaomi 17

ముఖ్యాంశాలు
  • షావోమి నుండి నెక్స్ట్ లెవెల్ స్మార్ట్‌ఫోన్ సిరీస్
  • ఏకంగా 8,500 mAh మైండ్ బ్లోయింగ్ బ్యాటరీ కెపాసిటీ
  • పక్కనున్న వారికి మీ ఫోన్ స్క్రీన్ కనిపించదు
ప్రకటన

Xiaomi 18  : ప్రముఖ చైనీస్ మొబైల్ దిగ్గజం షావోమి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త విప్లవానికి తెరలేపనుంది. కంపెనీ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్లాగ్‌షిప్ సిరీస్ Xiaomi 18ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సిరీస్ గురించి ప్రస్తుతం మార్కెట్లో కొన్ని కీలకమైన లీకులు బయటకు వచ్చాయి. ఈ సిరీస్‌లో భాగంగా రాబోయే అత్యంత ప్రీమియం మోడల్ Xiaomi 18 Pro Maxలో ఊహించని రేంజ్‌లో డ్యూయల్ 200 మెగాపిక్సెల్ కెమెరా సెటప్‌ను, ఏకంగా 8,500 mAh సామర్థ్యం గల భారీ పవర్ బ్యాకప్‌ను అందించబోతున్నట్లు సమాచారం. ఈ లీకులు టెక్ ప్రియుల్లో భారీ అంచనాలను పెంచేస్తున్నాయి.

లీకైన Xiaomi 18 Pro Max స్పెసిఫికేషన్లు 
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్  వెయిబోలో ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ ఫోన్‌కు సంబంధించిన ఇంజనీరింగ్ ప్రోటోటైప్ స్పెసిఫికేషన్ల వివరాలను లీక్ చేశారు. దీని ప్రకారం.. షావోమి 18 ప్రో మాక్స్ మోడల్లో బ్రహ్మాండమైన విజువల్స్ కోసం 6.9 ఇంచుల భారీ 2K OLED డిస్‌ప్లేను అందించనున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న అతిపెద్ద హైలైట్ ఏంటంటే, ఇందులో 8,000 mAh కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న, దాదాపు 8,500 mAh పవర్‌ఫుల్ బ్యాటరీని అమర్చబోతున్నారు. ఇంత పెద్ద బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడం కోసం 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా షావోమి జోడించనుంది.

లైకా ట్యూనింగ్, లోఫిక్ టెక్నాలజీ 
కెమెరా విభాగంలో షావోమి 18 ప్రో మాక్స్ సరికొత్త రికార్డులను సృష్టించబోతోంది. దీని వెనుక భాగంలో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను ఇవ్వనున్నారు. ఈ కెమెరాకు లోఫిక్ (LOFIC) అనే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సపోర్ట్‌ను కూడా అందించబోతున్నారు. దీనితో పాటు మ్యాక్రో ఫోటోగ్రఫీ కోసం మరో 200 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాను కూడా జత చేయనున్నారు. ఈ అద్భుతమైన కెమెరాల ట్యూనింగ్ కోసం ప్రసిద్ధ కెమెరా బ్రాండ్ లైకాతో షావోమి టై-అప్ కానుంది. దీనివల్ల ఫోటోల క్వాలిటీ ప్రొఫెషనల్ కెమెరాల స్థాయిలో డిజిటల్ క్లారిటీతో రానుంది.

Vivo X300e : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మార్కెట్లోకి సరికొత్త Vivo X300e

పక్కనున్న వారికి మీ ఫోన్ స్క్రీన్ కనిపించదు 
ఈ సరికొత్త షావోమి 18 సిరీస్‌లో స్టాండర్డ్ మోడల్‌తో పాటు Xiaomi 18 Pro, Xiaomi 18 Pro Max అనే మూడు వేరియంట్లు ఉండబోతున్నాయి. ఇటీవలే ఇదే టిప్‌స్టర్ షావోమి 18 ప్రో మోడల్ వివరాలను కూడా లీక్ చేశారు. ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండేలా ఇందులో అత్యంత వేగవంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 సిరీస్ చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారు. ఈ మోడల్ వెనుక వైపు కూడా డ్యూయల్ 200 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉండబోతోంది. అలాగే ఇందులో కస్టమర్ల సెక్యూరిటీ కోసం ఒక క్రేజీ  ప్రైవసీ ప్రొటెక్షన్ ఫీచర్‌ను ఇస్తున్నారు.

ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన Samsung Galaxy S26 Ultraలో ఈ తరహా ఫీచర్‌ను మొదటిసారి చూశాం. ఈ ప్రైవసీ ప్రొటెక్షన్ ఫీచర్ వల్ల మన పక్కన నిలబడే లేదా కూర్చునే వ్యక్తులకు మన మొబైల్ స్క్రీన్ మీదున్న సమాచారం అస్సలు కనిపించదు. సైడ్ యాంగిల్స్ నుంచి స్క్రీన్ కంటెంట్‌ను చూడటం చాలా కష్టమవుతుంది కాబట్టి, మన పాస్‌వర్డ్‌లు లేదా ఇతర వ్యక్తిగత విషయాలు అనుమానాస్పద వ్యక్తుల కంటపడకుండా చాలా సురక్షితంగా ఉంటాయి.

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రాసెసర్ 
ఈసారి షావోమి తన కొత్త సిరీస్ లాంచ్ విధానంలో ఒక పెద్ద మార్పును చేయబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతిసారి స్టాండర్డ్ మోడల్, ప్రో మోడళ్లను ఒకేసారి మార్కెట్లోకి విడుదల చేసే షావోమి, ఈసారి మాత్రం కాస్త భిన్నంగా ప్లాన్ చేస్తోంది. రాబోయే సిరీస్‌లో అందరి కంటే ముందే Xiaomi 18 Pro మోడల్‌ను మార్కెట్లోకి ఒంటరిగా తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఆ తర్వాత మిగిలిన మోడళ్లను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల లాంచ్ డేట్ మరియు ధరలకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Monsoon Smartphone Care: వర్షాకాలంలో స్మార్ట్‌ఫోన్ జాగ్రత్త.. చిన్న నిర్లక్ష్యం చేసినా మదర్‌బోర్డ్ క్లోజ్
  2. Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఊహించని ఆఫర్.. సగం ధరకే Nothing Phone 3
  3. Vivo : వివో నుంచి ట్విన్ స్మార్ట్‌ఫోన్లు.. మార్కెట్లోకి ఒకేసారి Vivo G5i, Vivo G5z విడుదల
  4. Xiaomi 18 : షావోమి నుంచి నెక్స్ట్ లెవెల్ స్మార్ట్‌ఫోన్ సిరీస్.. మార్కెట్లోకి త్వరలోనే Xiaomi 18 సిరీస్ లాంచ్
  5. Vivo X300e : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మార్కెట్లోకి సరికొత్త Vivo X300e
  6. iPhone : ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. సగం ధరకే అద్భుతమైన ఐఫోన్ మోడల్స్
  7. Samsung : శాంసంగ్ నుంచి సరికొత్త మిడ్-బడ్జెట్ ఫోన్.. త్వరలోనే మార్కెట్లోకి Samsung Galaxy F70 Pro
  8. Flipkart GOAT Sale : ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ ధమాకా.. రూ.45 వేల బడ్జెట్‌లో శాంసంగ్, పిక్సెల్ ఫోన్ల మధ్య గట్టి పోటీ
  9. Whatsapp : వాట్సాప్‌లో ప్రైవసీ విప్లవం.. మొబైల్ నంబర్ అవసరం లేకుండానే చాటింగ్ చేసేలా సరికొత్త ఫీచర్
  10. Flipkart Goat Sale : ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ ధమాకా.. కేవలం రూ.12 వేల బడ్జెట్లోనే శామ్‌సంగ్ 5G స్మార్ట్‌ఫోన్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »