స్మార్ట్‌ఫోన్ యుద్ధం.. పోకో Vs ఐకూ Vs వీవో.. రూ. 42,999 బడ్జెట్‌లో ఏ ఫోన్ మొనగాడు?

ఐకూ 15ఆర్, వివో వి70 ఎలైట్ మూడు ఫోన్లు కూడా 2026 నాటి లేటెస్ట్ టెక్నాలజీతో, 120Hz అమోలెడ్ డిస్ప్లేలు, ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్లతో యూజర్లను ఊరిస్తున్నాయి.

స్మార్ట్‌ఫోన్ యుద్ధం..  పోకో Vs ఐకూ Vs వీవో.. రూ. 42,999 బడ్జెట్‌లో ఏ ఫోన్ మొనగాడు?

మార్కెట్లో ఐకూ 15ఆర్, వివో వి70 ఎలైట్, సిద్ధంగా ఉన్నాయి

ముఖ్యాంశాలు
  • ఐకూ 15ఆర్, వివో వి70 ఎలైట్
  • ఈ మూడు ఫోన్లు దేనికదే సాటి
  • పోకో ఎక్స్8 ప్రో మాక్స్, ఐకూ 15ఆర్ మధ్య గట్టి పోటీ
ప్రకటన

టెక్ ప్రపంచంలో ఇప్పుడు అసలైన యుద్ధం మొదలైంది. భారత్‌లో మిడ్-ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ పోకో ఎక్స్8 ప్రో మాక్స్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే దీనికి గట్టి పోటీ ఇచ్చేందుకు ఇప్పటికే మార్కెట్లో ఐకూ 15ఆర్, వివో వి70 ఎలైట్, సిద్ధంగా ఉన్నాయి. ఈ మూడు ఫోన్లు కూడా 2026 నాటి లేటెస్ట్ టెక్నాలజీతో, 120Hz అమోలెడ్ డిస్ప్లేలు,  ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్లతో యూజర్లను ఊరిస్తున్నాయి. పోకో తన భారీ బ్యాటరీతో రికార్డులు సృష్టిస్తుంటే, ఐకూ తన గేమింగ్ పవర్‌తో, వివో తన జైస్ కెమెరా మ్యాజిక్‌తో అదరగొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ ఫోన్ తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్‌లో ఉన్న వారికోసం ఈ స్పెషల్ కంపారిజన్ ఇక్కడ ఉంది.

ఏది బడ్జెట్ ఫ్రెండ్లీ?
మొదటగా వీటి ధరల విషయానికి వస్తే, పోకో ఎక్స్8 ప్రో మాక్స్ అందరికంటే తక్కువ ధరకే లభిస్తోంది. దీని 12GB + 256GB వేరియంట్ రూ.42,999 ఉండగా, ఐకూ 15ఆర్ బేస్ వేరియంట్ (8GB + 256GB) రూ.44,999 నుండి ప్రారంభమవుతోంది. అయితే వివో వి70 ఎలైట్ మాత్రం కొంచెం కాస్ట్లీ అని చెప్పాలి, దీని ప్రారంభ ధర రూ.51,999 గా ఉంది. అంటే మీరు బడ్జెట్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే పోకో వైపు చూడొచ్చు, కానీ బ్రాండ్ వాల్యూ మరియు కెమెరాకు ఇంపార్టెన్స్ ఇచ్చేవారు వివో కోసం కొంచెం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. కలర్ ఆప్షన్లలో కూడా పోకో క్లాసిక్ లుక్ ఇస్తుంటే, వివో ప్యాషన్ రెడ్ వంటి వెరైటీ షేడ్స్‌తో స్టైలిష్‌గా కనిపిస్తోంది.

డిస్ప్లే ,సాఫ్ట్‌వేర్
డిస్ప్లే క్వాలిటీ విషయంలో ఈ మూడు ఫోన్లు దేనికదే సాటి. పోకో ఎక్స్8 ప్రో మాక్స్ 6.83 అంగుళాల భారీ 1.5K అమోలెడ్ స్క్రీన్‌తో వస్తోంది, ఇది 3,500 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. కానీ ఐకూ, వివోలు ఏకంగా 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఇండోర్, అవుట్‌డోర్‌లో అదిరిపోయే విజువల్స్ ఇస్తున్నాయి. ముఖ్యంగా ఐకూ 15ఆర్ గేమింగ్ సమయంలో 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయడం గేమర్లకు పెద్ద ప్లస్ పాయింట్. సాఫ్ట్‌వేర్ పరంగా ఇవన్నీ ఆండ్రాయిడ్ 16పైనే పనిచేస్తున్నాయి, అయితే పోకో హైపర్ ఓఎస్ 3తో కొత్త ఫీల్ ఇస్తుంటే, ఐకూ,  వివోలు ఒరిజిన్ ఓఎస్ 6తో స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తున్నాయి.

ప్రాసెసర్ పవర్, బ్యాటరీ
పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే పోకో ఎక్స్8 ప్రో మాక్స్,  ఐకూ 15ఆర్ మధ్య గట్టి పోటీ ఉంది. పోకోలో 3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9500ఎస్ చిప్‌సెట్ ఉండగా, ఐకూ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5తో దూసుకెళ్తోంది. ఇక వివో వి70 ఎలైట్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3తో వస్తోంది. అయితే బ్యాటరీ విషయంలో పోకో 9,000mAh భారీ కెపాసిటీతో అందరినీ వెనక్కి నెట్టేసింది. ఐకూ 7,600mAh, వివో 6,500mAh బ్యాటరీలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పోకో,  ఐకూలు త్వరగా ఛార్జ్ అవుతాయి, కానీ బ్యాటరీ లైఫ్ విషయంలో పోకో ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు నిరంతరాయంగా పనిచేస్తుంది.

కెమెరా క్వాలిటీ, డిజైన్
ఫోటోగ్రఫీని ప్రాణంగా ప్రేమించే వారికి వివో వి70 ఎలైట్ ఒక వరం లాంటిది. ఇందులో జైస్ ట్యూన్ చేసిన 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ముఖ్యంగా దీని టెలిఫోటో లెన్స్ అద్భుతమైన పోర్ట్రెయిట్లను క్లిక్ చేస్తుంది. పోకో,  ఐకూలు 50MP మెయిన్ కెమెరాతో మంచి ఫోటోలు తీసినప్పటికీ, వివో ఇచ్చే క్లారిటీ,  ప్రొఫెషనల్ టచ్ వేరు. డిజైన్ పరంగా వివో చాలా సన్నగా,  లైట్ వెయిట్‌గా ఉంది, జేబులో పెట్టుకుంటే అస్సలు బరువు అనిపించదు. పోకో కొంచెం బరువుగా ఉన్నప్పటికీ, దాని ఐపీ69 రేటింగ్స్ వల్ల నీళ్లలో పడినా, దుమ్ములో ఉన్నా ఏమీ కాదు అనే భరోసా ఇస్తుంది.

ఈ మూడు స్మార్ట్‌ఫోన్లలో దేని ప్రత్యేకత దానిదే. మీకు అంతులేని బ్యాటరీ లైఫ్,  రగ్గడ్ బాడీ కావాలంటే కళ్లు మూసుకుని పోకో ఎక్స్8 ప్రో మాక్స్ తీసుకోండి. ఒకవేళ మీరు మొబైల్ గేమింగ్‌లో ప్రో కావాలని అనుకుంటే ఐకూ 15ఆర్ మీకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది. అలా కాకుండా నాకు బెస్ట్ కెమెరా ఉండాలి, స్టైలిష్‌గా కనిపించాలి అనుకుంటే మాత్రం వివో వి70 ఎలైట్ పర్ఫెక్ట్. మొత్తానికి 2026 మార్కెట్లో ఈ మూడు ఫోన్లు యూజర్లకు సూపర్ ఆప్షన్లుగా మారాయి. మీ అవసరాలకు తగ్గట్టుగా వీటిలో ఒక దానిని సెలెక్ట్ చేసుకుంటే మీ ఇన్వెస్ట్‌మెంట్ వృధా కాదు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Nokia 123 Shield Phone: చేతిలోంచి జారినా, నీళ్లలో మునిగినా నో ప్రాబ్లమ్.. టైప్-సి పోర్ట్‌తో నోకియా కొత్త ఫోన్ వచ్చేసింది!
  2. Xiaomi Power Bank: ఒకేసారి 3 డివైజ్లు ఛార్జ్ చేసుకోవచ్చు.. షావోమి నుంచి 67W పవర్ బ్యాంక్ లాంచ్
  3. OPPO Find X10 Series: ఒప్పో నుంచి సరికొత్త లుక్‌తో ఫైండ్ X10 సిరీస్.. కెమెరా డిజైన్ లీక్!
  4. iQOO Neo 11S: ఛార్జర్ ని మరచిపోయినా నో ప్రాబ్లమ్.. 8000mAh బ్యాటరీతో ఐకూ కొత్త ఫోన్ తెచ్చేస్తోంది!
  5. Samsung AI Galaxy Glasses: కళ్లజోడు పెట్టుకుంటే చాలు.. ప్రపంచాన్నంతా చూసేయొచ్చు.. శామ్‌సంగ్ నుంచి కొత్త స్మార్ట్ గ్లాసెస్!
  6. Samsung Galaxy Z Fold 8: 50MP డ్యూయల్ కెమెరా, లైట్ వెయిట్ టైటానియం బాడీ.. శామ్‌సంగ్ నయా ఫోల్డబుల్ ఫోన్ లాంచ్!
  7. Samsung Galaxy Watch Ultra 2 Launched: చేతికి ఈ వాచ్ ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనే లేదు.. శామ్‌సంగ్ నుంచి అల్ట్రా వాచ్ 2 లాంచ్!
  8. Garmin Cirqa Smart Band launched: స్క్రీన్ లేని గార్మిన్ సిర్కా స్మార్ట్ బ్యాండ్ లాంచ్.. డిస్‌ప్లే లేకపోవడమే దీని ప్రత్యేకం!
  9. Samsung Galaxy Z Fold 8 Ultra: ఫోన్ తెరిస్తే ట్యాబ్.. మడిచితే ఫోన్.. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో శామ్‌సంగ్ విధ్వంసం!
  10. Samsung Galaxy Card Launched: శామ్‌సంగ్ నుంచి తొలి క్రెడిట్ కార్డ్.. శామ్‌సంగ్ గెలాక్సీ కార్డ్ లాంచ్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »