Redmi Note 17 Series Launched: మార్కెట్లోకి సరికొత్త రెడ్‌మి నోట్ 17 సిరీస్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

Redmi Note 17 Series Launched: ప్రస్తుతానికి చైనా మార్కెట్లో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ మూడు అద్భుతమైన స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తోంది.

Redmi Note 17 Series Launched: మార్కెట్లోకి సరికొత్త రెడ్‌మి నోట్ 17 సిరీస్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

Redmi Note 17

ముఖ్యాంశాలు
  • మార్కెట్లోకి సరికొత్త రెడ్‌మి నోట్ 17 సిరీస్
  • ఏకంగా 8,000 mAh బిగ్ బ్యాటరీతో సరికొత్త రికార్డు
  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజులు గడిచిపోతాయి
ప్రకటన

Redmi Note 17 Series Launched: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్‌మి తన బడ్జెట్, మిడ్-రేంజ్ కస్టమర్ల కోసం సరికొత్త సంచలనానికి తెరలేపింది. కంపెనీ తన మోస్ట్ పాపులర్ సిరీస్ లో భాగంగా రెడ్ మీ నోట్ 17 సిరీస్‌ను మంగళవారం అధికారికంగా మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ కొత్త లైనప్‌లో స్టాండర్డ్ మోడల్ అయిన రెడ్‌మి నోట్ 17 తో పాటు మరింత శక్తివంతమైన  రెడ్‌మి నోట్ 17 ప్రో కూడా అందుబాటులోకి వచ్చింది. గతంలో సూపర్ హిట్ అయిన రెడ్‌మి నోట్ 15 మోడల్‌కు సక్సెసర్‌గా ఈ సరికొత్త ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. పాత మోడళ్లతో పోలిస్తే ఇందులో బ్యాటరీ కెపాసిటీని ఎవరూ ఊహించని రేంజ్ లో పెంచడం విశేషం.

రెడ్‌మి నోట్ 17 ధర ఎంత..?

ప్రస్తుతానికి చైనా మార్కెట్లో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ మూడు అద్భుతమైన స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తోంది. ఇందులో బేస్ వేరియంట్ అయిన 6 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ మోడల్ ధర 1,299 యువాన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.18,400)గా ఉంది. అలాగే 8 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర 1,399 యువాన్లు (సుమారు రూ.19,900) కాగా, హై-ఎండ్ మోడల్ అయిన 8 GB ర్యామ్, 256 GB స్టోరేజ్ వేరియంట్ ధరను 1,599 యువాన్లు (సుమారు రూ.22,700)గా నిర్ణయించారు. ఈ ఫోన్ పర్పుల్, గ్రీన్, బ్లాక్ వంటి మూడు ఆకర్షణీయమైన రంగులలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

భారీ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌

సాంకేతిక వివరాలు పరిశీలిస్తే.. డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వచ్చే ఈ స్మార్ట్‌ఫోన్ లో ఏకంగా 7 ఇంచుల భారీ ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అమర్చారు. థియేటర్ లాంటి అనుభూతిని ఇచ్చే ఈ స్క్రీన్ 120 Hz రిఫ్రెష్ రేట్, 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవెల్‌తో వస్తుంది. దీనివల్ల అవుట్‌డోర్ లో కూడా డిస్‌ప్లే చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇందులో క్వాల్కమ్ సంస్థకు చెందిన శక్తివంతమైన ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు అడ్రినో జీపీయూని జత చేశారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత షియోమీ సరికొత్త  హైపర్ ఓఎస్ 3 పై రన్ అవుతుంది.

Manhattan Project : అమెరికా ఆంక్షలకు చైనా మాస్టర్ స్ట్రోక్.. సొంతంగా EUV లిథోగ్రఫీ మిషన్ ప్రోటోటైప్ సిద్ధం

పాత మోడల్‌కు అదిరిపోయే అప్‌గ్రేడ్

కెమెరా విభాగం చూస్తే.. ఈ ఫోన్ వెనుక వైపు ఒక వినూత్నమైన స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్‌ను ఇచ్చారు. అందులో f/1.8 అపర్చర్ కలిగిన 50 మెగాపిక్సెల్ సింగిల్ ప్రైమరీ కెమెరాతో పాటు ఎల్‌ఈడీ ఫ్లాష్ లైట్‌ను అమర్చారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ ద్వారా యూజర్లు 1,080p క్వాలిటీతో సెకనుకు 30 ఫ్రేమ్స్ వేగంతో అద్భుతమైన వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. ఫోన్ బరువు సుమారు 225 గ్రాములు కాగా, దీని సైజ్ 169.7 x 79.14 x 8.26 mm గా ఉంది. సెక్యూరిటీ కోసం ఇందులో అత్యాధునిక ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కూడా ఇస్తున్నారు.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజులు గడిచిపోతాయి..

ఈ స్మార్ట్‌ఫోన్ లోని అన్నింటికంటే బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే.. దీనిలో అమర్చిన ఏకంగా 8,000 mAh సామర్థ్యం గల మోన్‌స్టర్ బ్యాటరీ. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో 5000 లేదా 6000 mAh బ్యాటరీ చూస్తుంటాం, కానీ రెడ్‌మి ఏకంగా 8వేల ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చి రికార్డు సృష్టించింది. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, అత్యవసర సమయాల్లో ఇతర చిన్న చిన్న గ్యాడ్జెట్లను ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్‌ను కూడా ఇందులో చేర్చారు. కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ లో 4G, 5G, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. అలాగే ఈ-కంపాస్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, ప్రాక్సిమిటీ వంటి అన్ని రకాల అవసరమైన సెన్సార్లను కూడా ఇందులో అమర్చారు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Aggregator Policy 2026 : ఆఖరి నిమిషంలో క్యాబ్ క్యాన్సిల్ చేస్తే డ్రైవర్లకు చుక్కలే.. ఏకంగా 5 రెట్ల భారీ జరిమానా
  2. Moto Pad 70 : ఏకంగా 9 జేబీఎల్ స్పీకర్లు, 48W సౌండ్.. జూలై 31న మార్కెట్లోకి మోటో ప్యాడ్ 70 గ్రూవ్
  3. Samsung Galaxy F70 Pro : పాత ఫోన్ మార్చేద్దామనుకుంటున్నారా? శాంసంగ్ కొత్త ఫోన్ చూశాకే నిర్ణయం తీసుకోండి
  4. OnePlus N6x : అఫోర్డబుల్ ప్రైస్‌లో వన్‌ప్లస్ ధమాకా.. 7,000mAh బ్యాటరీ, ఆకట్టుకునే డిజైన్‌తో కొత్త ఫోన్
  5. Xiaomi Mijia Wireless Floor Cleaner 5C : ఇంటి తుడవడంలో భార్యతో గొడవలు బంద్.. షియోమీ నుంచి ఇల్లు మెరిపించే కొత్త గాడ్జెట్ 
  6. Cab Rules : ఓలా, ఉబర్, రాపిడోలకు కొత్త రూల్స్..ఇకపై మగవారితో కలిపి ప్రయాణించే పనిలేకుండా కొత్త ఆప్షన్
  7. Vivo X300 Pro : వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై ధమాకా ఆఫర్.. వివో X300 ప్రోపై ఏకంగా రూ.10,000 డిస్కౌంట్
  8. Xiaomi Mix Fold 5 : 200MP కెమెరా, 6,000mAh బ్యాటరీతో షియోమి మిక్స్ ఫోల్డ్ 5.. లీకైన అదిరిపోయే ఫీచర్లు
  9. Nothing : గ్లోబల్ ఎగ్జిట్ వార్తలకు చెక్.. ఫేక్ న్యూస్ అని తేల్చిచెప్పిన నథింగ్ కో-ఫౌండర్
  10. Vivo S2 : ఏడేళ్ల తర్వాత వీవో సరికొత్త సంచలనం.. ఆగస్టు 6న భారత్‌లో Vivo S2 లాంచ్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »