రెడ్‌మి టర్బో 5 పేరుతో రాబోతున్న ఈ సరికొత్త మొబైల్ ఇండియాలో త్వరలోనే లాంచ్ కానుందని కంపెనీ ఇప్పటికే అధికారికంగా హింట్ ఇచ్చింది.
Photo Credit: Redmi
Redmi Turbo 5 features a 7,560mAh battery in China
Redmi : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమి సబ్‌బ్రాండ్ అయిన రెడ్‌మి భారతీయ మొబైల్ లవర్స్ కోసం సరికొత్త పవర్‌ఫుల్ ఫోన్‌ను పరిచయం చేయడానికి సిద్ధమైంది. రెడ్‌మి టర్బో 5 పేరుతో రాబోతున్న ఈ సరికొత్త మొబైల్ ఇండియాలో త్వరలోనే లాంచ్ కానుందని కంపెనీ ఇప్పటికే అధికారికంగా హింట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన టీజర్లలో ఫోన్ వెనుక భాగంలో ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ ఉండబోతున్నట్లు స్పష్టమైంది. చైనాలో విడుదలైన మోడల్ తరహాలోనే ఈ ఇండియన్ వేరియంట్ డిజైన్ కూడా ఉండనుంది.
లీకైన అఫీషియల్ లాంచ్ డేట్
కంపెనీ ఇంకా అధికారికంగా లాంచ్ తేదీని ప్రకటించకముందే, ప్రముఖ టిప్‌స్టర్ సంజు చౌదరి సోషల్ మీడియా వేదిక Xలో దీనికి సంబంధించిన ఒక ప్రమోషనల్ పోస్టర్‌ను లీక్ చేశారు. ఈ లీక్ ప్రకారం రెడ్‌మి టర్బో 5 స్మార్ట్‌ఫోన్ జూన్ 16న భారతదేశంలో గ్రాండ్‌గా విడుదల కానుంది. గతంలో వచ్చిన కొన్ని నివేదికలు జూన్ 18న ఈ ఫోన్ వస్తుందని పేర్కొన్నప్పటికీ, తాజా లీక్ అంతకంటే ముందే అంటే జూన్ 16నే ఫోన్ వస్తుందని ఖరారు చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో కూడా లైవ్ చేయబడింది.
అదిరిపోయే కలర్ వేరియంట్లు, డిజైన్
ఇప్పటికే కన్ఫర్మ్ అయిన క్లాసిక్ బ్లాక్ కలర్ ఆప్షన్‌తో పాటు, ఈ ఫోన్ సరికొత్త వైట్ కలర్ వేరియంట్‌లో కూడా లభిస్తుందని లీకైన పోస్టర్ ద్వారా వెల్లడైంది. అంతేకాకుండా, ఈ లాంచ్ ఈవెంట్‌లోనే రెడ్‌మి తన బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ ఫోన్ అయిన రెడ్‌మి 17 5జీను కూడా లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ బడ్జెట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 సిరీస్ ప్రాసెసర్‌తో రానుందని అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై కంపెనీ నుంచి ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
CIBIL Score : ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో సిబిల్ స్కోర్ చెక్ చేయడం ఎలా? సింపుల్ స్టెప్స్ మీకోసం!
డిస్‌ప్లే, ప్రాసెసర్ సామర్థ్యం
చైనా వేరియంట్ స్పెసిఫికేషన్ల ఆధారంగా చూస్తే, ఈ రెడ్‌మి టర్బో 5 ఫోన్ 6.59-ఇంచుల 1.5K ఫ్లాట్ అమోలెడ్ డిస్‌ప్లేతో రానుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్, ఏకంగా 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ ఫోన్ డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్‌తో రావడం వల్ల ఓటీటీ కంటెంట్ చూసేవారికి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా 4nm ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
భారీ బ్యాటరీ, కెమెరా ఫీచర్లు
ఈ ఫోన్ అతిపెద్ద హైలైట్ దీని బ్యాటరీ సామర్థ్యమే. ఇందులో ఏకంగా 7560mAh భారీ బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల ఈ పెద్ద బ్యాటరీని చాలా తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనుక వైపు 50 మెగాపిక్సెల్ LYT600 ప్రధాన కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ OV20B కెమెరాను అందించారు. గేమింగ్ ప్రియుల కోసం 5300mm² వీసీ కూలింగ్ సిస్టమ్, ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Onimusha: Way of the Sword Launches September 25, Playable Demo and Pre-Orders Now Live
Dashlane Password Manager Reveals Hackers Stole Some Encrypted Vaults Using Brute-Force Attacks
Apple Doubles MacBook Neo Output as Budget Laptop Gains Popularity, Analyst Says