ఇలాంటి సమయంలో టెక్నో కంపెనీ తన సరికొత్త పోవా 8 మోడల్‌తో ఒక వింత ప్రయోగానికి తెరలేపింది. గత ఏడాది కేవలం రూ.12,999 బడ్జెట్ ధరలో లభించిన ఈ సిరీస్ ఫోన్‌ను, ఇప్పుడు సరికొత్త డిజైన్ మార్పులతో ఏకంగా రూ.29,999 మిడ్-రేంజ్ ధరకు మార్కెట్లోకి తెచ్చింది.
The Pova 8 is priced from Rs. 29,999 in India
Tecno Pova 8 Review : ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరగడం, మెమరీ చిప్‌ల కొరత కారణంగా మొబైల్స్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కంపెనీలు కొత్త ఫోన్లను భారీ ధరలకు లాంచ్ చేయడమే కాకుండా, కొన్ని నెలలకే వాటి ధరలను మరింత పెంచుతుండటంతో కస్టమర్లు అయోమయంలో పడ్డారు. ఇలాంటి సమయంలో టెక్నో కంపెనీ తన సరికొత్త పోవా 8 మోడల్‌తో ఒక వింత ప్రయోగానికి తెరలేపింది. గత ఏడాది కేవలం రూ.12,999 బడ్జెట్ ధరలో లభించిన ఈ సిరీస్ ఫోన్‌ను, ఇప్పుడు సరికొత్త డిజైన్ మార్పులతో ఏకంగా రూ.29,999 మిడ్-రేంజ్ ధరకు మార్కెట్లోకి తెచ్చింది. మరి ఈ ఫోన్ అంత ధరను జస్టిఫై చేస్తుందో లేదో చూద్దాం.
సైబర్ ఇండస్ట్రియల్ డిజైన్.. కానీ కాస్త బరువు ఎక్కువ
టెక్నో పోవా 8 డిజైన్ పరంగా పాత మోడళ్ల కంటే చాలా భిన్నంగా, స్టైలిష్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా దీని వెనుక భాగంలో ఒక సైబర్ థీమ్ సర్క్యూట్ బోర్డ్ లాంటి సెమీ ఇండస్ట్రియల్ లుక్‌ను ఇచ్చారు. వైట్ ఫినిషింగ్, ఆరెంజ్ కలర్ యాక్సెంట్లు ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను తెచ్చాయి. ఈ ఫోన్‌కు అఫీషియల్ గా ఐపీ64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. అయితే, ఈ ధరలో ఉండే ఇతర బ్రాండ్ల ఫోన్లు ఐపీ69 రేటింగ్‌తో వస్తుండటం గమనార్హం. అంతేకాకుండా, ఈ ఫోన్ 225 గ్రాముల బరువుతో చాలా లావుగా, చేతిలో పట్టుకుంటే కాస్త బరువుగా అనిపిస్తుంది. పాలి కార్బోనేట్ బాడీ అయినప్పటికీ పాత లీథియం-అయాన్ బ్యాటరీ టెక్నాలజీ వాడటం వల్లే ఫోన్ బరువు పెరిగింది.
![]()
బ్యాక్ ప్యానెల్ పై క్రేజీ అలైవ్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లే
ఈ ఫోన్ లో అందరినీ ఆకర్షించే ముఖ్యమైన ఫీచర్ దాని వెనుక కెమెరా మాడ్యూల్‌లో అమర్చిన అలైవ్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లే. గోరు పరిమాణంలో ఉండే ఈ చిన్న డాట్-మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ ప్యానెల్ చాలా ఫన్నీగా, ఉపయోగకరంగా ఉంటుంది. మనకు ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు, వాట్సాప్ నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఆయా యాప్ ఐకాన్లను ఇది ఫ్లాష్ చేస్తుంది. మ్యూజిక్ వింటున్నప్పుడు లైటింగ్ యానిమేషన్లు ఇస్తుంది. అంతేకాకుండా, వాల్యూమ్ బటన్ల సాయంతో ఆడుకునేలా ఇందులో రెండు చిన్న గేమ్‌లను కూడా అందించారు. అయితే ఈ చిన్న స్క్రీన్ సైజ్ మరీ ఇరుకుగా ఉండటం, గూగుల్ లైవ్ అప్‌డేట్స్ ఏపీఐకి సపోర్ట్ చేయకపోవడం కాస్త నిరాశపరుస్తుంది.
![]()
డిస్‌ప్లే విభాగంలో పెద్ద మైనస్
టెక్నో పోవా 8 లో 6.76 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. ఇది 144Hz రీఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ చెబుతున్నప్పటికీ.. అది కేవలం సెట్టింగ్స్, ఫోన్, మెసేజెస్ వంటి కొన్ని బేసిక్ యాప్స్‌లో, బ్రైట్‌నెస్ ఫుల్ గా ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. గేమింగ్ ఆడేటప్పుడు ఇది 120Hz కి పడిపోతుంది. అన్నింటికంటే పెద్ద మైనస్ ఏంటంటే, రూ.30 వేల బడ్జెట్ లో మిగతా బ్రాండ్లన్నీ అమోలెడ్ స్క్రీన్ ఇస్తుంటే, టెక్నో మాత్రం పాత ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్‌నే ఇచ్చింది. దీనివల్ల ఇండోర్ లో డిస్‌ప్లే బాగానే ఉన్నా.. ఎండలో లేదా అవుట్‌డోర్ లో స్క్రీన్ చాలా డిమ్ గా కనిపిస్తుంది. అలాగే స్క్రీన్ కింద అంచున లావుపాటి బోర్డర్ ఉండటం వల్ల ఫోన్ లుక్ కాస్త పాతబడినట్లుగా అనిపిస్తుంది.
![]()
సాఫ్ట్‌వేర్, ఏఐ ఫీచర్లు
ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 కస్టమ్ స్కిన్‌తో పనిచేస్తుంది. కంపెనీ దీనికి 2 ఏళ్ల ఓఎస్ అప్‌డేట్స్, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని ప్రామిస్ చేసింది. యాపిల్ ఐఓఎస్ తరహాలోనే దీని సాఫ్ట్‌వేర్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. హోమ్‌స్క్రీన్ పై వాల్‌పేపర్లు లేయర్ల లాగా కనిపించే డెప్త్ ఎఫెక్ట్ ఫీచర్ చాలా బాగుంది. ఇందులో బ్లోట్‌వేర్ (ప్రీఇన్‌స్టాల్డ్ యాప్స్), యాప్ సెంటర్ నుంచి వచ్చే కొన్ని స్పామ్ నోటిఫికేషన్ల గోల ఉన్నప్పటికీ, వాటిని సెట్టింగ్స్ లో బంద్ చేసుకోవచ్చు. గూగుల్ జెమిని ఏఐతో పాటు టెక్నో సంస్థకు చెందిన సొంత ఏఐ ఫీచర్లు కూడా ఇందులో ఇన్-బిల్ట్ గా వస్తాయి. వైర్డ్ ఇయర్‌ఫోన్స్ కనెక్ట్ చేసుకుంటే వాడుకోవడానికి ఎఫ్ఎమ్ రేడియో కూడా ఉంది.
![]()
గేమింగ్, పర్ఫార్మెన్స్ రివ్యూ
టెక్నో పోవా 8 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 6 నానోమీటర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. రివ్యూ కోసం మాకు 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ లభించింది. డైలీ యూసేజ్ లో సాఫ్ట్‌వేర్ చాలా స్మూత్ గానే రన్ అవుతుంది కానీ, యూట్యూబ్ షార్ట్స్ చూసేటప్పుడు అక్కడక్కడా లాగ్ కనిపిస్తుంది. ఇక గేమింగ్ విషయానికి వస్తే.. జెన్‌షిన్ ఇంపాక్ట్ లాంటి హెవీ గ్రాఫిక్స్ గేమ్‌లను ఇది లోయెస్ట్ సెట్టింగ్స్‌లో మాత్రమే 30 ఫ్రేమ్స్ వద్ద రన్ చేయగలదు. గ్రాఫిక్స్ పెంచితే ఫోన్ విపరీతంగా వేడెక్కడంతో పాటు ఫ్రేమ్ రేట్ పడిపోయి గేమ్ లాగ్ అవుతుంది. కాబట్టి ఇది కేవలం క్యాజువల్ గేమ్స్ ఆడుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. ఆడియో పరంగా ఫోన్ కింద భాగంలో ఒకే ఒక స్పీకర్ ఇచ్చారు. దీనికి ‘డాల్బీ అట్మాస్' సర్టిఫికేషన్ ఉన్నప్పటికీ బేస్ లేకపోవడం వల్ల సౌండ్ వన్-సైడెడ్ గా అనిపిస్తుంది.
![]()
కెమెరా పర్ఫామెన్స్
ఈ ఫోన్ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉన్నట్లు కనిపించినా, నిజానికి కస్టమర్లు వాడుకోవడానికి కేవలం ఒకే ఒక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మాత్రమే అందుబాటులో ఉంటుంది. మిగిలినవి డెప్త్ డేటా కోసం వాడే ఏఐ కెమెరాలు మాత్రమే. ఈ కెమెరాకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఫీచర్ లేదు. పగటిపూట తీసే ఫోటోలు ఓకే అనిపించినా, కాస్త ఓవర్ ఎక్స్‌పోజ్ అవుతాయి. లో-లైట్ లేదా నైట్ మోడ్ ఫోటోలు ఓఐఎస్ లేకపోయినా పర్వాలేదనిపించినా, డిటైలింగ్స్ తక్కువగా ఉండి ఫోటోలు సాఫ్ట్ గా వస్తాయి. వీడియో రికార్డింగ్ గరిష్టంగా 2K @ 30fpsకి పరిమితం చేయబడింది. స్టెబిలైజేషన్ లేకపోవడం వల్ల వీడియోలు చాలా షేకీగా వస్తాయి.
![]()
8000mAh బ్యాటరీ బాహుబలి
ఈ స్మార్ట్‌ఫోన్ లో ఉన్న ఏకైక, అతిపెద్ద ప్లస్ పాయింట్ దాని 8000mAh భారీ బ్యాటరీ. ఎల్‌సీడీ డిస్‌ప్లే, 6nm ప్రాసెసర్ కావడంతో పీసీ మార్క్ బ్యాటరీ లైఫ్ టెస్ట్ లో ఇది ఏకంగా 21 గంటల 4 నిమిషాల రన్‌టైమ్‌ను ఇచ్చింది. సాధారణ వినియోగదారులకు ఈ ఫోన్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలా సులభంగా 1.5 రోజుల నుంచి 2 రోజుల వరకు వస్తుంది. బాక్స్‌లోనే 45W ఫాస్ట్ ఛార్జర్‌ను అందించారు. దీని ద్వారా 30 నిమిషాల్లో 37 శాతం, ఒక గంటలో 73 శాతం ఛార్జింగ్ అవుతుంది. ఫోన్ పూర్తిగా 100 శాతం ఛార్జ్ అవ్వడానికి 1 గంటా 32 నిమిషాల సమయం పడుతుంది.
![]()
టెక్నో పోవా 8 ఫైనల్ వర్డిక్ట్
టెక్నో పోవా 8 సరికొత్త సైబర్ డిజైన్, అలైవ్ మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ లైట్లతో మొదటి చూపులోనే అందరినీ ఆకట్టుకుంటుంది. బ్యాటరీ లైఫ్ ఆశించిన దానికంటే చాలా అద్భుతంగా ఉంది. కానీ, రూ.29,999 మిడ్-రేంజ్ ధర వద్ద ఈ ఫోన్ ను రికమండ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే 2026 లో ఇదే ధరలో లభిస్తున్న మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 వంటి ఫోన్లు దీనికంటే మెరుగైన అమోలెడ్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ గేమింగ్ ప్రాసెసర్లు, ఓఐఎస్ కలిగిన అద్భుతమైన కెమెరాలను ఆఫర్ చేస్తున్నాయి. కాబట్టి, మీకు కేవలం బ్యాక్ సైడ్ ఎల్‌ఈడీ లైట్ల క్రేజ్, భారీ బ్యాటరీ మాత్రమే కావాలనుకుంటే తప్ప.. ఈ ఫోన్‌ను ప్రస్తుత ధరకు కొనడం అంత లాభదాయకం కాదు. ధర తగ్గినప్పుడు మాత్రమే దీనిని పరిశీలించవచ్చు.
![]()
ప్రకటన
ప్రకటన