Canva : డిజైనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. నెట్ లేకపోయినా ఇకపై కాన్వాలో డిజైన్స్ చేసుకోవచ్చు

ఇకపై నెట్‌వర్క్ లేదా ఇంటర్నెట్ లేకపోయినా సరే, యూజర్లు తమకు నచ్చినట్లుగా డిజైన్లను క్రియేట్ చేసుకునే సదుపాయాన్ని కంపెనీ కల్పించింది.

Canva : డిజైనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. నెట్ లేకపోయినా ఇకపై కాన్వాలో డిజైన్స్ చేసుకోవచ్చు

Photo Credit: Canva

The company explained that users can save their designs for offline access

ముఖ్యాంశాలు
  • నెట్ లేకపోయినా ఇకపై ‘కాన్వా’లో డిజైన్స్ చేసుకోవచ్చు!
  • ఏకంగా 14 రోజుల పాటు ఇంటర్నెట్ లేకుండానే ఎడిటింగ్
  • విద్యార్థులు, ఉద్యోగుల కోసం సూపర్ అప్‌డేట్!
ప్రకటన

Canva : గ్రాఫిక్ డిజైనింగ్, సోషల్ మీడియా పోస్టర్లు, ప్రెజెంటేషన్లు క్రియేట్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న ప్రముఖ ప్లాట్‌ఫారమ్ కాన్వా  తమ వినియోగదారుల కోసం ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్‌ను ప్రకటించింది. బుధవారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కాన్వా ఆఫ్‌లైన్ ఫీచర్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇప్పటివరకు కాన్వాలో ఏదైనా డిజైన్ చేయాలన్నా లేదా ఎడిట్ చేయాలన్నా ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సిందే. కానీ ఇకపై నెట్‌వర్క్ లేదా ఇంటర్నెట్ లేకపోయినా సరే, యూజర్లు తమకు నచ్చినట్లుగా డిజైన్లను క్రియేట్ చేసుకునే సదుపాయాన్ని కంపెనీ కల్పించింది. తమ గ్లోబల్ యూజర్ల నుంచి గత కొంతకాలంగా వస్తున్న అతిపెద్ద డిమాండ్‌ను నెరవేరుస్తూ కాన్వా ఈ నిర్ణయం తీసుకుంది.

సిగ్నల్ లేకపోయినా ఆగిపోని క్రియేటివిటీ
మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు, మెట్రో లేదా బస్సుల్లో వెళ్తున్నప్పుడు, కాలేజీ క్లాసుల్లో ఉన్నప్పుడు లేదా సిగ్నల్స్ సరిగ్గా లేని రిమోట్ ఏరియాల్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ సరిగ్గా రాక డిజైనింగ్ పనులు మధ్యలోనే ఆగిపోతుంటాయి. ఇటువంటి ఇబ్బందులకు చెక్ పెట్టడానికే ఈ ఆఫ్‌లైన్ మోడ్‌ను తీసుకొచ్చారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లలో ఎక్కువగా డిజైన్స్ చేసేవారు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, చిన్న వ్యాపారవేత్తలు, ప్రొఫెషనల్స్ కోసం ఈ ఫీచర్ ఒక వరప్రసాదంలా మారనుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవడం అనేది ఇకపై ఎవరి క్రియేటివిటీకి ఆటంకం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ ఫీచర్‌ను డెవలప్ చేసినట్లు కాన్వా ప్రెస్ నోట్‌లో పేర్కొంది.

14 రోజుల పాటు ఇంటర్నెట్ లేకుండానే ఎడిటింగ్
ఈ ఆఫ్‌లైన్ ఫీచర్ అసలు గమ్మత్తు ఏంటంటే.. ఒకసారి ఈ సపోర్ట్‌ను ఎనేబుల్ చేసుకుంటే, ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా సరే ఏకంగా 14 రోజుల పాటు నిరంతరాయంగా డిజైన్లను క్రియేట్ చేయడం, ఎడిట్ చేయడం కొనసాగించవచ్చు. దీనికోసం యూజర్లు చేయాల్సిందల్లా ఒక్కటే.. తమకు కావలసిన డిజైన్ ఫైల్‌పై క్లిక్ చేసి, అక్కడ కనిపించే మేక్ అవైలబుల్ ఆఫ్‌లైన్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత నెట్ కనెక్షన్ కట్ అయినా సరే, సపోర్టెడ్ డివైజ్‌లలో మీరు ఎడిటింగ్ పనులు చేసుకోవచ్చు. మళ్లీ మీ ఫోన్ లేదా లాప్‌టాప్‌కు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వగానే, ఆఫ్‌లైన్‌లో మీరు చేసిన మార్పులన్నీ ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్ క్లౌడ్‌లోకి సింక్ అయిపోతాయి. అత్యంత ఆనందకరమైన విషయం ఏంటంటే, ఈ ఫీచర్ కోసం కాన్వా ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదు, యూజర్లు అందరికీ ఇది పూర్తిగా ఉచితం.

Lenovo : భారత మార్కెట్లోకి లెనోవో సరికొత్త ఏఐ ల్యాప్‌టాప్.. ఐడియాప్యాడ్ స్లిమ్ 3 లాంచ్!

భారతీయ మార్కెట్‌పై కాన్వా ప్రత్యేక ఫోకస్
ప్రస్తుత గ్లోబల్ మార్కెట్‌లో కాన్వా సంస్థకు భారతదేశం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా నిలిచింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే, భారతీయ మొబైల్ వినియోగదారుల రోజువారీ అవసరాలకు తగినట్లుగా ఈ ఆఫ్‌లైన్ మోడ్‌ను డిజైన్ చేసినట్లు కంపెనీ స్పష్టం చేసింది. దీనిపై కాన్వా గ్లోబల్ ప్రొడక్ట్ హెడ్ రోబ్ కవాల్స్కీ స్పందిస్తూ.. "భారతదేశంలో క్రియేటర్లు ఈరోజు ఏ విధంగానైతే సరికొత్త ఐడియాలతో ఎప్పుడూ దూసుకుపోతున్నారో, వారి స్పీడ్‌కు తగినట్లుగానే మా ఆఫ్‌లైన్ మోడ్‌ను నిర్మించాం. నెట్ ఉన్నా లేకపోయినా ప్రయాణాల్లోనూ వారి క్రియేటివిటీ ఆగకూడదనేదే మా లక్ష్యం" అని తెలిపారు.

గూగుల్ జెమినితో అడ్వాన్స్డ్ ఏఐ ఫీచర్లు
ఆఫ్‌లైన్ మోడ్‌తో పాటు కాన్వా ఇటీవలే గూగుల్ జెమిని కోసం ప్రవేశపెట్టిన కాన్వా కనెక్టెడ్ యాప్ గురించి కూడా కంపెనీ హైలైట్ చేసింది. ఇది కాన్వా సొంత ఫౌండేషన్ మోడల్‌తో పనిచేస్తుంది. దీనివల్ల గూగుల్ జెమిని ఏఐలో క్రియేట్ చేసిన డిజైన్లను నేరుగా కాన్వా ఎడిటర్‌లోకి తెచ్చుకుని సులభంగా రీమిక్స్ లేదా రీఫైన్ చేసుకోవచ్చు. మళ్లీ మొదటి నుంచి డిజైన్ చేయాల్సిన అవసరం లేకుండానే టీమ్ మెంబర్స్ అందరూ కలిసి వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఈ సరికొత్త అప్‌డేట్ ద్వారా గూగుల్ నానో బనానా ఇమేజ్ జనరేషన్ మోడల్‌ను కాన్వా లోని మ్యాజిక్ లేయర్స్ ఫీచర్‌లోకి తీసుకురావడం విశేషం.

#తాజా కథనాలు
  1. Motorola Edge 70 Pro+ : భారత మార్కెట్లోకి మోటోరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. నేటి నుంచే ఎడ్జ్ 70 ప్రో+ సేల్ షురూ
  2. PDF : ఫోన్లలో సీక్రెట్ ఫీచర్.. ఏ యాప్ లేకుండానే డాక్యుమెంట్లను పీడీఎఫ్‎గా మార్చండిలా
  3. Canva : డిజైనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. నెట్ లేకపోయినా ఇకపై కాన్వాలో డిజైన్స్ చేసుకోవచ్చు
  4. Elon Musk : ఎలాన్ మస్క్‌కు గట్టి షాక్.. ఇండియాలో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ లాంచ్‌కు బ్రేక్
  5. Vivo : ఫోటోగ్రఫీ లవర్స్‌కు పండగే.. వివో ప్రీమియం కెమెరా ఫోన్ Vivo X200T పై భారీ డిస్కౌంట్
  6. SmartPhones : మొబైల్ ప్రియులకు మైండ్ బ్లాక్ కాంబినేషన్.. రియల్‌మీ, మోటో, రెడ్‌మీ ఫోన్లలో ఏది బెస్ట్ చాయిస్?
  7. Tecno Pova 8 : భారత మార్కెట్లో టెక్నో సరికొత్త సంచలనం.. 8,000mAh మెగా బ్యాటరీతో Tecno Pova 8 లాంచ్
  8. Lenovo : భారత మార్కెట్లోకి లెనోవో సరికొత్త ఏఐ ల్యాప్‌టాప్.. ఐడియాప్యాడ్ స్లిమ్ 3 లాంచ్!
  9. OnePlus : చైనా మార్కెట్లోకి వన్‌ప్లస్ కొత్త పవర్‌హౌస్ స్మార్ట్‌ఫోన్లు.. టర్బో 6X సిరీస్ లాంచ్
  10. Xiaomi 17T : ఆండ్రాయిడ్ 16.. హైపర్‌ఓఎస్ 3.. సరికొత్త అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో షావోమి 17T
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »