Instagram : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్..కంటెంట్ నచ్చకపోతే లిస్ట్ మార్చేయండిలా

సాధారణంగా మనం ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే అందులోని అల్గోరిథం దానంతట అదే కొన్ని వీడియోలను, పోస్టులను మనకు చూపిస్తుంది.

Instagram : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్..కంటెంట్ నచ్చకపోతే లిస్ట్ మార్చేయండిలా

Photo Credit: Pixabay/ Solen Feyissa

Instagram

ముఖ్యాంశాలు
  • ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్
  • అల్గోరిథం గురంచి ఆడమ్ మొస్సేరి కీలక ప్రకటన
  • రీల్స్, ఎక్స్‌ప్లోర్ పేజీల తర్వాత ఇప్పుడు మెయిన్ ఫీడ్‌పై కంట్రోల్
ప్రకటన

Instagram : ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్ల కోసం ఒక అద్భుతమైన ఫీచర్‌ను తీసుకురాబోతోంది. సాధారణంగా మనం ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే అందులోని అల్గోరిథం దానంతట అదే కొన్ని వీడియోలను, పోస్టులను మనకు చూపిస్తుంది. అయితే, ఇకపై అలా కాకుండా మనకు ఎలాంటి కంటెంట్ కావాలో మనమే స్వయంగా నిర్ణయించుకునేలా సరికొత్త వెసులుబాటును కల్పించనుంది. దీనికోసం మెటా యాజమాన్యంలోని ఈ ప్లాట్‌ఫామ్.. ఇప్పటికే ఉన్న యువర్ అల్గోరిథం ఫీచర్‌ను మరింత ముందుకు తీసుకెళ్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఈ సరికొత్త మార్పుల గురించి ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి తన థ్రెడ్స్ ఖాతాలో ఒక పోస్ట్ ద్వారా వివరాలను వెల్లడించారు. ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే.. మెయిన్ ఫీడ్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లోని పలు విభాగాలలో కంటెంట్‌ను యూజర్లు తమ ఇష్టానుసారంగా కంట్రోల్ చేయవచ్చని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కేవలం టాపిక్స్‎ను మాత్రమే చూపిస్తుందని.. కానీ భవిష్యత్తులో ఇందులో వ్యక్తులు, కంటెంట్ రకాలు, యూజర్ల మూడ్స్, ఇతర ప్రాధాన్యతలను కూడా జోడించేందుకు కంపెనీ రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తోందని ఆయన వివరించారు.

గత కొంతకాలంగా యూజర్లకు అల్గోరిథంపై పూర్తి నియంత్రణ ఇచ్చేందుకు ఇన్‌స్టాగ్రామ్ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే గతంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఎక్స్‌ప్లోర్ పేజీల కోసం ఈ  యువర్ అల్గోరిథం ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. అక్కడ మంచి రెస్పాన్స్ రావడంతో.. ఇప్పుడు దీనిని హోమ్ స్క్రీన్ పై ఉండే మెయిన్ ఫీడ్‌కు కూడా విస్తరిస్తున్నారు. దీనివల్ల యూజర్లు తమ రోజువారీ సోషల్ మీడియా అనుభవాన్ని తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకునే అవకాశం లభిస్తుంది.

FIFA World Cup 2026 : భారత్‌లో ఫిఫా వరల్డ్ కప్ 2026 షురూ.. టీవీ, మొబైల్స్‌లో లైవ్ మ్యాచులు చూసేది ఎలాగంటే?

ఆడమ్ మొస్సేరి అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అల్గోరిథంలు సాంకేతికంగా చాలా అడ్వాన్స్‌డ్ గా మారాయి. కానీ దీనివల్ల యూజర్లకు తమ సొంత ఛాయిస్ పై కంట్రోల్ తగ్గిపోతోంది. ఇప్పటివరకు ఉన్న సిస్టమ్ అనేది యూజర్ల యాక్టివిటీస్.. అంటే వారు ఏ పోస్ట్‌పై ట్యాప్ చేస్తున్నారు, ఏ వీడియోను ఎంత సమయం చూస్తున్నారు, వేటిని షేర్ చేస్తున్నారు అనే విషయాల ఆధారంగానే నేర్చుకుంటుంది. కానీ, వినియోగదారులు నేరుగా తాము ఏం చూడాలనుకుంటున్నారో, ఏది చూడటం ఇష్టం లేదో స్పష్టంగా చెప్పే ఆప్షన్ ఇప్పటివరకు లేదనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

పాత పద్ధతుల వల్ల చాలా మందికి సోషల్ మీడియా వాడకం ఒక్కోసారి కాస్త అసౌకర్యంగా లేదా బోర్ గా అనిపిస్తుందని ఇన్‌స్టాగ్రామ్ భావిస్తోంది. అందుకే అల్గోరిథం ప్రభావం మాత్రమే కాకుండా, యూజర్ల సొంత నిర్ణయాలకు విలువ ఇచ్చేలా కొత్త సిస్టమ్‌ను డిజైన్ చేస్తున్నారు. గతంలో వాడిన ర్యాంకింగ్ మోడల్స్ సాధారణ యూజర్లకు అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉండేది. అయితే ఇప్పుడు లేటెస్ట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ టెక్నాలజీ సాయంతో ఇన్‌స్టాగ్రామ్ లోని వివిధ కంటెంట్ గ్రూపులను సులభమైన పదాలలో యూజర్లకు వివరించవచ్చు. దీనివల్ల సిస్టమ్ మన ఇంట్రెస్ట్‌ను ఎలా అర్థం చేసుకుంటుందో మన కళ్లముందే కనిపిస్తుంది, నచ్చకపోతే అక్కడికక్కడే దాన్ని మార్చేయవచ్చు.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  2. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  3. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
  4. Flipkart Freedom Sale: ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా..శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ 5జీ ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్లు
  5. Chandra Grahan: రాఖీ పండగ రోజే ఏడాది ఆఖరి చంద్రగ్రహణం..భారత్‌లో సూతకం ఉంటుందా?
  6. PM Ujjwala Yojana: ఉచిత వంటగ్యాస్ సిలిండర్ పొందే గొప్ప అవకాశం.. ఇలా అప్లై చేసుకోండి
  7. Flipkart Freedom Sale : స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్.. ఫ్లిప్ కార్ట్‎లో నథింగ్ ఫోన్ 4బి పై భారీ డిస్కౌంట్
  8. Apple: ఆపిల్ లవర్లకు అదిరిపోయే ఫ్రీడమ్ ఆఫర్.. అతితక్కువ ఈఎంఐకే ఐఫోన్, మ్యాక్‌బుక్
  9. Samsung Galaxy S25 Edge: శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ ఆఫర్.. రూ.45,000 తక్కువకే 200MP కెమెరా ఫోన్
  10. Tech Tips: స్టోరేజ్ ఫుల్ అయి ఫోన్ స్లో అయిపోయిందా?..ఈ 5 చోట్ల క్లీన్ చేస్తే క్షణాల్లో దూసుకెళ్తుంది
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »