మన ఆండ్రాయిడ్ ఫోన్లలో డిఫాల్ట్‌గా వచ్చే గూగుల్ డ్రైవ్ యాప్ ద్వారా డాక్యుమెంట్లను స్కాన్ చేయడం చాలా సులభం.
PDF : ప్రస్తుత డిజిటల్ రోజుల్లో ఆఫీస్ పని కోసమో, కాలేజీ అడ్మిషన్ల కోసమో లేదా మరేదైనా ప్రభుత్వ పనుల కోసమో మన సర్టిఫికెట్లను, బిల్లులను పీడీఎఫ్ రూపంలోకి మార్చాల్సిన అవసరం చాలా తరచుగా వస్తుంటుంది. ఇలాంటి సమయంలో చాలా మంది వెంటనే ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్లి ఏవో కొన్ని తెలియని థర్డ్-పార్టీ స్కానర్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేస్తుంటారు. దీనివల్ల ఫోన్ స్టోరేజ్ వేస్ట్ అవ్వడమే కాకుండా, మన పర్సనల్ డాక్యుమెంట్ల డేటా వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రైవసీ రిస్క్ కూడా ఉంటుంది. కానీ నిజానికి ఎటువంటి అదనపు యాప్స్ లేకుండానే మన ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇన్‌బిల్ట్‌గా ఉండే గూగుల్ డ్రైవ్ లేదా మొబైల్ కెమెరా ద్వారానే కొన్ని నిమిషాల్లో హై-క్వాలిటీ పీడీఎఫ్ స్కాన్ చేసుకోవచ్చు.
మన ఆండ్రాయిడ్ ఫోన్లలో డిఫాల్ట్‌గా వచ్చే గూగుల్ డ్రైవ్ యాప్ ద్వారా డాక్యుమెంట్లను స్కాన్ చేయడం చాలా సులభం. దీనికోసం ముందుగా మీ మొబైల్‌లో గూగుల్ డ్రైవ్ యాప్‌ను ఓపెన్ చేయాలి. యాప్ ఓపెన్ అయ్యాక కింద కుడివైపున కనిపిచే ప్లస్ ("+") గుర్తుపై టాప్ చేయాలి. అక్కడ మీకు క్రియేట్ న్యూ ఆప్షన్లలో Scan అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ఫోన్ కెమెరా ఓపెన్ అవుతుంది, ఏ డాక్యుమెంట్‌ను అయితే పీడీఎఫ్‌గా మార్చాలనుకుంటున్నారో దానిని ఫొటో తీయాలి. ఆ తర్వాత అవసరమైతే అంచులను Crop లేదా Rotate చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చివరగా Save బటన్ నొక్కగానే ఆ ఫైల్ ఆటోమేటిక్‌గా పీడీఎఫ్ ఫార్మాట్‌లోకి మారి మీ డ్రైవ్‌లో సేవ్ అయిపోతుంది.
OnePlus : చైనా మార్కెట్లోకి వన్‌ప్లస్ కొత్త పవర్‌హౌస్ స్మార్ట్‌ఫోన్లు.. టర్బో 6X సిరీస్ లాంచ్
గూగుల్ డ్రైవ్ మాత్రమే కాకుండా.. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న శాంసంగ్, షియోమీ, రియల్‌మీ, వన్‌ప్లస్, వివో వంటి ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్లలో ఇన్‌బిల్ట్ కెమెరా యాప్‌లోనే స్కానింగ్ ఫీచర్‌ను ఇస్తున్నారు. దీనికోసం మీ ఫోన్ లోని కెమెరా యాప్ ఓపెన్ చేసి, అందులో ఉండే More లేదా Modes సెక్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ మీకు Document Scan లేదా Super Documents అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని సెలెక్ట్ చేసి డాక్యుమెంట్‌పై కెమెరా పెట్టగానే ఫోన్ ఆటోమేటిక్‌గా పేపర్ నాలుగు అంచులను గుర్తించి పర్ఫెక్ట్‌గా స్కాన్ చేస్తుంది. దీనిని మీరు నేరుగా గ్యాలరీలోనే పీడీఎఫ్‌గా సేవ్ చేసుకోవచ్చు లేదా ఇతరులకు షేర్ చేయవచ్చు.
ఫోన్ల ద్వారా డాక్యుమెంట్లను స్కాన్ చేసేటప్పుడు పీడీఎఫ్ ఫైల్ స్పష్టంగా, ప్రొఫెషనల్‌గా రావాలంటే కొన్ని చిన్న విషయాలను గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా సరే డాక్యుమెంట్‌ను స్కాన్ చేసేటప్పుడు దానిని వంకరగా లేకుండా ఒక ఫ్లాట్ గా ఉండే ఉపరితలంపై ఉంచాలి. చీకటిగా ఉండే ప్రదేశాల్లో కాకుండా తగినంత వెలుతురు లేదా లైటింగ్ ఉన్న చోట మాత్రమే స్కాన్ చేయాలి. ఫొటో తీసే ముందు మీ మొబైల్ కెమెరా లెన్స్‌ను ఒకసారి శుభ్రమైన క్లాత్‌తో తూడ్చుకోవడం వల్ల ఇమేజ్ బ్లర్ అవ్వకుండా క్లియర్‌గా వస్తుంది. స్కాన్ పూర్తయ్యాక పేపర్ అంచులు కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకుని క్రాప్ చేయడం వల్ల ప్రింట్ తీసినప్పుడు కూడా ఒరిజినల్ పేపర్ లాగే కనిపిస్తుంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Z Fold 8 Wide Appears on IMDA Database, New Wide Foldable Phone Could Arrive Soon
Xiaomi 18 Pro Could Launch Before Standard Xiaomi 18 Model, Tipster Claims