Vivo Pad 5c : టెక్ మార్కెట్లోకి వివో సరికొత్త పవర్‌ఫుల్ టాబ్లెట్.. అద్భుతమైన ఫీచర్లతో వివో ప్యాడ్ 5సి లాంచ్

వివో ప్యాడ్ 5సి టాబ్లెట్ డిస్‌ప్లే విభాగంలో అత్యుత్తమ ప్రమాణాలను కలిగి ఉంది. ఇందులో 12.1 ఇంచుల భారీ డిస్‌ప్లేను అందించారు, ఇది 2.8K హై-రెజల్యూషన్‌ను సపోర్ట్ చేస్తుంది.

Vivo Pad 5c : టెక్ మార్కెట్లోకి వివో సరికొత్త పవర్‌ఫుల్ టాబ్లెట్.. అద్భుతమైన ఫీచర్లతో వివో ప్యాడ్ 5సి లాంచ్

Photo Credit: Vivo

Vivo Pad 5c

ముఖ్యాంశాలు
  • టెక్ మార్కెట్లోకి వివో సరికొత్త పవర్‌ఫుల్ టాబ్లెట్
  • థియేటర్ రేంజ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌తో వివో నయా టాబ్లెట్
  • స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్‌తో అల్టిమేట్ పర్ఫార్మెన్స్
ప్రకటన

Vivo Pad 5c : ప్రముఖ చైనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం వివో బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ టాబ్లెట్ వివో ప్యాడ్ 5సిని అధికారికంగా విడుదల చేసింది. చైనా మార్కెట్లో విడుదలైన ఈ టాబ్లెట్ సరికొత్త టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఐకూ ప్యాడ్ 5సి మోడల్‌ను పోలి ఉండేలా దీని స్పెసిఫికేషన్లను రూపొందించారు. ఆకర్షణీయమైన డిజైన్, పవర్‌ఫుల్ బాడీతో రానున్న ఈ టాబ్లెట్ ముఖ్యంగా ఆన్‌లైన్ క్లాసులు వినే విద్యార్థులకు, ఆఫీస్ పనులు చేసుకునే ఉద్యోగులకు, గేమింగ్ ప్రియులకు ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది.

వివో ప్యాడ్ 5సి టాబ్లెట్ డిస్‌ప్లే విభాగంలో అత్యుత్తమ ప్రమాణాలను కలిగి ఉంది. ఇందులో 12.1 ఇంచుల భారీ డిస్‌ప్లేను అందించారు, ఇది 2.8K హై-రెజల్యూషన్‌ను సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, స్మూత్ పర్ఫార్మెన్స్ కోసం 144 Hz రిఫ్రెష్ రేట్, ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవెల్‌ను ఇందులో చేర్చారు. వీడియోలు చూసేటప్పుడు, సినిమాలు ఆస్వాదించేటప్పుడు థియేటర్ లాంటి అనుభూతిని ఇచ్చేందుకు వీలుగా ఇందులో ఫోర్-స్పీకర్ ప్యానోరామిక్ సౌండ్ సిస్టమ్ ను అమర్చారు.

ఈ టాబ్లెట్ పర్ఫార్మెన్స్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఉండేందుకు క్వాల్కమ్ సంస్థకు చెందిన అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. భారీ గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా ఎక్కువ సమయం వాడుతున్నప్పుడు టాబ్లెట్ వేడెక్కకుండా ఉండేందుకు 3D కూలింగ్ సిస్టమ్ అనే అత్యాధునిక థర్మల్ మేనేజ్‌మెంట్‌ను ఇందులో ఇచ్చారు. సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే.. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6 పై రన్ అవుతుంది. స్మార్ట్ వర్కింగ్ కోసం ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‎తో కూడిన పీపీటీ అసిస్టెంట్ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

లాంగ్ బ్యాటరీ లైఫ్ ఆశించే వారి కోసం వివో ఈ టాబ్లెట్‌లో ఏకంగా 10,000 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చింది. ఇది ఎక్కువ సమయం బ్యాకప్ ఇవ్వడమే కాకుండా, త్వరగా చార్జ్ అవ్వడానికి 44W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. టాబ్లెట్ వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ లేదా ఆన్‌లైన్ మీటింగ్స్ కోసం 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ టాబ్లెట్ కేవలం 6.62 mm మందం, 584 గ్రాముల బరువుతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్, వై-ఫై, 3.5 mm ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

చైనాలో విడుదలైన ఈ టాబ్లెట్ మొత్తం మూడు విభిన్న స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ మోడల్ అయిన 8 GB రామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,699 (మన భారత కరెన్సీలో సుమారు రూ.37,800) గా ఉంది. అలాగే 8 GB రామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,999 (సుమారు రూ. 42,000), హై-ఎండ్ మోడల్ అయిన 12 GB రామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 3,499 (సుమారు రూ. 48,000)గా నిర్ణయించారు. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ఈ టాబ్లెట్‌ను బ్లూ, గ్రీన్,  గ్రే వంటి మూడు ఆకర్షణీయమైన రంగులలో వివో అధికారిక వెబ్‌సైట్ ద్వారా విక్రయించనున్నారు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Redmi : ఏకంగా 72 గంటల నాన్‌స్టాప్ బ్యాటరీ బ్యాకప్.. రెడ్‌మి సరికొత్త వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ ప్రత్యేకతలివే
  2. WhatsApp : వాట్సాప్ కొత్త యూజర్‌నేమ్ ఫీచర్‌పై దేశంలో పెద్ద చర్చ.. లాభాల కంటే నష్టాలే ఎక్కువనా?
  3. Vivo Pad 5c : టెక్ మార్కెట్లోకి వివో సరికొత్త పవర్‌ఫుల్ టాబ్లెట్.. అద్భుతమైన ఫీచర్లతో వివో ప్యాడ్ 5సి లాంచ్
  4. Vivo : కెమెరా రంగంలో సరికొత్త విప్లవం.. డిఎస్‌ఎల్‌ఆర్ రేంజ్ ఫీచర్లతో వస్తున్న వివో X500 ప్రో మాక్స్
  5. Tata Motors : భారత ఈవీ మార్కెట్లో టాటా మోటార్స్ నయా రికార్డ్.. జూన్ అమ్మకాల్లో ఏకంగా 183 శాతం జంప్
  6. NASA : అంతరిక్ష చరిత్రలోనే కనవినీ ఎరుగని మిషన్.. కూలిపోతున్న పాత టెలిస్కోప్‌ను కాపాడనున్న నాసా
  7. Ola : సర్వీస్ లోపాలను సరిదిద్దుకుని మరీ సూపర్‌హిట్.. కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకున్న ఓలా స్కూటర్స్
  8. Citizen Watches : స్పైడర్ మ్యాన్ థీమ్‌తో సిటిజన్ నయా వాచ్.. కామిక్ లవర్స్ కోసం స్పెషల్ డిజైన్!
  9. WhatsApp : మీ వాళ్లకు తెలియకుండా లొకేషన్ ట్రాక్ చేయడం సాధ్యమేనా? వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ రూల్స్ ఇవే
  10. Xiaomi : టెక్ మార్కెట్లోకి షావోమి నయా వైర్‌లెస్ మౌస్.. క్లిక్ చేసినా అస్సలు శబ్దం రాదు
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »