ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) టాటా మోటార్స్ ఈవీ విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ పెరిగాయి.
Photo Credit: Sierra EV
Sierra EV
Tata Motors : భారతదేశపు దిగ్గజ ఆటోమొబైల్ తయారీ సంస్థ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తన తిరుగులేని ఆధిక్యాన్ని మరోసారి చాటుకుంది. గత జూన్ నెలలో కంపెనీ ఈవీ విభాగంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. అధికారిక లెక్కల ప్రకారం.. జూన్ నెలలో టాటా మోటార్స్ రికార్డు స్థాయిలో ఏకంగా 14,800 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెల అమ్మకాలతో పోలిస్తే ఇది సుమారు 183 శాతం భారీ వృద్ధి కావడం విశేషం. ప్రస్తుతం దేశీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా సంస్థ తన లీడర్‌షిప్ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.
తొలి త్రైమాసికంలో రెట్టింపైన ఈవీ విక్రయాలు
తాజా మీడియా నివేదికల ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) టాటా మోటార్స్ ఈవీ విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ పెరిగాయి. కంపెనీ సాధించిన మొత్తం అమ్మకాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాటానే దాదాపు పావు వంతు ఉండటం విశేషం. జూన్ నెలలో టాటా షోరూమ్‌లకు వచ్చిన ప్రతి మూడు కొత్త కార్ల బుకింగ్స్‌లో ఒకటి ఎలక్ట్రిక్ కారు కోసమే రావడం కస్టమర్లలో ఈవీలపై ఉన్న క్రేజ్‌ను సూచిస్తోంది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఏడాది ప్రాతిపదికన 112 శాతం వృద్ధితో మొత్తం 34,467 ఈవీ యూనిట్లను విక్రయించి సరికొత్త రికార్డు సృష్టించింది.
మార్కెట్లోకి టాటా మోస్ట్ అవేటెడ్ సియెర్రా ఈవీ
ఎలక్ట్రిక్ వాహన ప్రియులను అలరించేందుకు టాటా మోటార్స్ మంగళవారం దేశీయ మార్కెట్లో తన సరికొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాటా సియెర్రా ఈవీని అధికారికంగా లాంచ్ చేసింది. పాత ఐసీఈ (పెట్రోల్/డీజిల్) మోడల్‌తో పోలిస్తే ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ డిజైన్‌లో కంపెనీ చాలా ఆకర్షణీయమైన మార్పులు చేసింది. ఈ సరికొత్త ఎస్‌యూవీ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్‌ను ప్రారంభించగా, జూలై 15వ తేదీ నుంచి కస్టమర్లకు డెలివరీలను అందించనున్నారు. మార్కెట్లో ఈ కారు ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 18.79 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ రూ. 24.79 లక్షల వరకు ఉన్నాయి.
NASA : అంతరిక్ష చరిత్రలోనే కనవినీ ఎరుగని మిషన్.. కూలిపోతున్న పాత టెలిస్కోప్‌ను కాపాడనున్న నాసా
సింగిల్ ఛార్జ్‌తో 660 కిలోమీటర్ల మైలేజ్
టాటా సియెర్రా ఈవీ మోడల్‌లో క్లోజ్డ్-ఆఫ్ ఫ్రంట్ గ్రిల్, సరికొత్త డిజైన్‌తో కూడిన పవర్‌ఫుల్ బంపర్‌ను అందించారు. ఈ కారును కస్టమర్ల కోసం రిషికేష్ రాపిడ్స్, నైనిటాల్ నాక్టర్న్, ప్రిస్టైన్ వైట్, అండమాన్ అడ్వెంచర్, ప్యూర్ గ్రే, బెంగాల్ రూజ్, కూర్గ్ క్లౌడ్ లాంటి 7 అద్భుతమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి తెచ్చారు. ఇందులో మొదటి రెండు రంగులు కేవలం హై-ఎండ్ క్యూడబ్ల్యూడీ (QWD) వేరియంట్లలో మాత్రమే లభిస్తాయి. బ్యాటరీ విషయానికొస్తే, ఇందులో 63 kWh, 75 kWh సామర్థ్యం గల రెండు ఆప్షన్లు ఉన్నాయి. దీని 63 kWh బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై 560 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, పెద్దదైన 75 kWh బ్యాటరీ ప్యాక్ ఏకంగా 660 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది.
రూ.6.99 లక్షలకే టాటా టియాగో ఈవీ కొత్త వెర్షన్
భారీ ఎస్‌యూవీలతో పాటు మిడిల్ క్లాస్ బడ్జెట్ కస్టమర్ల కోసం టాటా మోటార్స్ తన పాపులర్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ టియాగో ఈవీ కొత్త వెర్షన్‌ను కూడా మార్కెట్లోకి తెచ్చింది. ఈ సరికొత్త మోడల్ డిజైన్‌ను మరింత స్టైలిష్‌గా మార్చడంతో పాటు కస్టమర్ల సౌకర్యార్థం పలు అడ్వాన్స్‌డ్ ఫీచర్లను కూడా యాడ్ చేశారు. ఈ కొత్త టియాగో ఈవీ ప్రారంభ ధరను రూ.6.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ కారులో ప్రయాణ అవసరాలకు అనుగుణంగా 19.2 kWh, 24 kWh సామర్థ్యం గల రెండు విభిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను అందిస్తున్నారు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Samsung Galaxy SmartTag 3 India Launch Timeline Confirmed by Company Executive
Microsoft Announces $50 Xbox Nano Controller, Launch Set for Next Month