నాసా 2004వ సంవత్సరంలో అంతరిక్షంలో జరిగే విస్ఫోటనాలు, నక్షత్రాల పుట్టుక, మరణాల గురించి పరిశోధించడానికి స్విఫ్ట్ అబ్జర్వేటరీ అనే స్పేస్ టెలిస్కోప్‌ను ప్రయోగించింది.
Photo Credit: NASA
NASA
NASA : అంతరిక్ష పరిశోధనల్లో అగ్రగామిగా ఉన్న అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా త్వరలోనే స్పేస్‌లోకి ఒక అసాధారణమైన మిషన్‌ను పంపేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు అంతరిక్ష చరిత్రలో ఎవరూ ఊహించని, చూడని విధంగా ఒక వినూత్న రెస్క్యూ మిషన్(సహాయక చర్య)ను చేపట్టబోతోంది. దాదాపు 22 ఏళ్ల క్రితం నాసా ప్రయోగించిన ఒక పాత టెలిస్కోప్ అంతరిక్షం నుంచి భూమిపైకి కూలిపోకుండా కాపాడటమే ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం. ఒకవేళ నాసా సమయానికి ఈ ఆపరేషన్ ప్రారంభించకపోతే, ఆ విలువైన టెలిస్కోప్ భూ వాతావరణంలోకి ప్రవేశించి తీవ్రమైన వేడికి పూర్తిగా మండిపోయి బూడిదయ్యే ప్రమాదం ఉంది. ఈ అద్భుతమైన స్పేస్ ఆపరేషన్ వెనుక ఉన్న ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భూ వాతావరణంలోకి దూసుకొస్తున్న స్విఫ్ట్ అబ్జర్వేటరీ
నాసా 2004వ సంవత్సరంలో అంతరిక్షంలో జరిగే విస్ఫోటనాలు, నక్షత్రాల పుట్టుక, మరణాల గురించి పరిశోధించడానికి స్విఫ్ట్ అబ్జర్వేటరీ అనే స్పేస్ టెలిస్కోప్‌ను ప్రయోగించింది. ఇది ఎక్స్-రే, ఆల్ట్రావైలెట్ కిరణాల సహాయంతో అంతరిక్షంలోని అద్భుతమైన చిత్రాలను తీసి శాస్త్రవేత్తలకు పంపుతూ ఉంటుంది. గత 20 ఏళ్లకు పైగా ఎంతో కీలకమైన సమాచారాన్ని అందించిన ఈ టెలిస్కోప్, ప్రస్తుతం తన కక్ష్య నుంచి క్రమంగా పక్కకు తప్పుకుంటూ కిందికి జారిపోతోంది. సాధారణంగా భూమికి దగ్గరగా ఉండే లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోని ఉపగ్రహాలపై వాతావరణ ప్రభావం వల్ల స్వల్పంగా కిందకు లాగబడతాయి. అయితే, ఇటీవలి కాలంలో సూర్యుడిలో జరిగిన తీవ్రమైన సౌర కార్యకలాపాల వల్ల ఏర్పడిన వేడి తరంగాల కారణంగా ఈ స్విఫ్ట్ టెలిస్కోప్ శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే చాలా వేగంగా భూమి వైపు దూసుకొస్తోంది.
Ola : సర్వీస్ లోపాలను సరిదిద్దుకుని మరీ సూపర్‌హిట్.. కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకున్న ఓలా స్కూటర్స్
ప్రైవేట్ కంపెనీతో నాసా రూ. 250 కోట్ల భారీ డీల్
ఈ అపురూపమైన టెలిస్కోప్‌ను ఎలాగైనా కాపాడుకోవాలని నిశ్చయించుకున్న నాసా, ఒక ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ సాయం తీసుకుంది. ఇందులో భాగంగా క్యాటలిస్ట్ టెక్నాలజీస్ అనే ప్రైవేట్ సంస్థతో నాసా దాదాపు 30 మిలియన్ అమెరికన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ.250 కోట్లు) భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ స్టార్టప్ కంపెనీ కేవలం ఏడాది లోపే లింక్ అనే సరికొత్త రోబోటిక్ రెస్క్యూ స్పేస్‌క్రాఫ్ట్‌ను డిజైన్ చేసి నాసాకు అప్పగించింది. ఈ రోబోటిక్ క్రాఫ్ట్ అంతరిక్షంలోకి వెళ్లి, కిందకు పడిపోతున్న స్విఫ్ట్ టెలిస్కోప్‌ను సురక్షితంగా పట్టుకుని, దానిని మళ్లీ పై కక్ష్యలోకి నెట్టేలా పనిచేస్తుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా జరుగుతున్న ఈ అంతరిక్ష రెస్క్యూ ఆపరేషన్ ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైన్స్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Nothing Deals Revealed for Phone 4 Series, CMF Buds Lineup, More Ahead of Flipkart's Big Billion Days Sale