Vivo X300 : ఫ్లిప్‌కార్ట్‌లో వీవో ఎక్స్300 పై భారీ ఆఫర్.. ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై వేలల్లో డిస్కౌంట్

మార్కెట్లో భారీ అంచనాల మధ్య విడుదలైన వీవో ఎక్స్300 స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది.

Vivo X300 : ఫ్లిప్‌కార్ట్‌లో వీవో ఎక్స్300 పై భారీ ఆఫర్.. ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై వేలల్లో డిస్కౌంట్

Photo Credit: Vivo

Vivo X300 में 50 मेगापिक्सल सेल्फी कैमरा है।

ముఖ్యాంశాలు
  • Vivo X300 में 6.31 इंच की 1.5K BOE Q10+ LTPO OLED डिस्प्ले है।
  • Vivo X300 में 6040mAh की बैटरी दी गई है।
  • Vivo X300 में 200 मेगापिक्सल का HPB प्राइमरी कैमरा है।
ప్రకటన

Vivo X300 : మీరు మంచి కెమెరా, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఉన్న ఒక ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మీకోసం ఒక క్రేజీ డీల్‌ను తీసుకొచ్చింది. మార్కెట్లో భారీ అంచనాల మధ్య విడుదలైన వీవో ఎక్స్300 స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. 200 మెగాపిక్సెల్ కెమెరా, భారీ బ్యాటరీ వంటి హై-ఎండ్ ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా చాలా తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం కస్టమర్లకు లభిస్తోంది.

కళ్లు చెదిరే రేట్ల తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్లు ఇవే
భారత మార్కెట్లో వీవో ఎక్స్300  12GB RAM + 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్ అసలు ధర రూ.75,999గా లిస్ట్ చేయబడింది. అయితే, ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ  లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్ చేస్తే కస్టమర్లకు నేరుగా రూ.7,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్ కలుపుకున్నాక ఫోన్ ఎఫెక్టివ్ ధర కేవలం రూ.68,499కి తగ్గుతుంది.

రూ.55 వేల వరకు భారీ ఎక్స్ఛేంజ్ బోనస్
బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు మీ పాత ఫోన్‌ను మార్చుకోవాలనుకునే వారి కోసం ఫ్లిప్‌కార్ట్ భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీని కింద పాత మొబైల్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ.55,600 వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు. అయితే, ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అనేది మీరు ఇచ్చే పాత ఫోన్ మోడల్, అది ఎంత వర్కింగ్ కండిషన్‌లో ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర మంచి హై-ఎండ్ పాత ఫోన్ ఉండి, దానికి పూర్తి వాల్యూ వస్తే కనుక ఈ వీవో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను చాలా తక్కువ బడ్జెట్ ధరలోనే ఇంటికి తీసుకెళ్లవచ్చు.
 

Amazon : అమెజాన్‌లో ఆఫర్ల జాతర.. మెగా డీల్ డేస్ సేల్‌లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు

సినిమా థియేటర్‌ను తలపించే డిస్‌ప్లే
ఫీచర్ల విషయానికి వస్తే, వీవో ఎక్స్300 లో 6.31 ఇంచుల 1.5K BOE Q10+ LTPO OLED స్క్రీన్‌ను అందించారు. ఇది 1216×2640 పిక్సెల్స్ రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల వీడియోలు చూడటమే కాకుండా హై-గ్రాఫిక్స్ గేమింగ్ ఆడేటప్పుడు కూడా స్క్రీన్ ఎంతో స్మూత్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. సెక్యూరిటీ కోసం ఇందులో సరికొత్త ఇన్-డిస్ప్లే 3D అల్ట్రాసోనిక్ సింగిల్ పాయింట్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు, ఇది చాలా వేగంగా స్పందిస్తుంది.

నెక్ట్స్ లెవెల్ ప్రాసెసర్, స్టోరేజ్
ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ పరంగా ఎక్కడా తగ్గకుండా ఉండేందుకు ఇందులో అత్యంత శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 6 పై రన్ అవుతుంది. స్టోరేజ్ వేరియంట్ల పరంగా చూస్తే, ఈ ఫోన్ టాప్ మోడల్‌లో ఏకంగా 16GB LPDDR5x అల్ట్రా ర్యామ్,  512GB UFS 4.1 ఇన్-బిల్ట్ స్టోరేజ్‌ను అందించారు. దీనివల్ల ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వకుండా కంప్యూటర్ వేగంతో పనిచేస్తుంది.

200 మెగాపిక్సెల్ కెమెరాతో రికార్డుల వేట
వీవో ఎక్స్300 స్మార్ట్‌ఫోన్ ప్రధాన హైలైట్ దీని కెమెరా సెటప్ అనే చెప్పాలి. ఫోన్ వెనుక వైపు మూడు కెమెరాలను ఇచ్చారు. అందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్ ఉన్న 200 మెగాపిక్సెల్ HPB ప్రైమరీ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీనితో పాటు 50 మెగాపిక్సెల్ JN1 వైడ్ యాంగిల్ కెమెరా, OIS సపోర్ట్ ఉన్న మరో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాను అమర్చారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు కూడా 50 మెగాపిక్సెల్ పవర్‌ఫుల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. దీనితో తీసే ఫోటోలు డీఎస్ఎల్ఆర్ కెమెరా క్వాలిటీని ఇస్తాయని కంపెనీ చెబుతోంది.

భారీ బ్యాటరీ, కనెక్టివిటీ ఫీచర్లు
ఎక్కువ సమయం ఫోన్ వాడుకునేలా ఇందులో 6040mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఫోన్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఫోన్ ధృడత్వం కోసం, ధూళి, నీటి నుంచి రక్షణ కోసం దీనికి IP68, IP69 రేటింగ్స్ ఇచ్చారు. అంటే నీటిలో పడినా ఈ ఫోన్‌కు ఏమీ కాదు. కనెక్టివిటీ పరంగా ఇందులో 5G, 4G, లేటెస్ట్ బ్లూటూత్ 6, వై-ఫై, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటి అన్ని ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ బరువు 190 గ్రాములు, కేవలం 7.95 మిమీ మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది.

#తాజా కథనాలు
  1. Smartphone Comparison : రూ.13 వేల బడ్జెట్‌లో ఏ ఫోన్ బెస్ట్?.. ఇన్‌ఫినిక్స్, లావా, రెడ్‌మిల మధ్య అసలైన పోటీ
  2. Vivo X300 : ఫ్లిప్‌కార్ట్‌లో వీవో ఎక్స్300 పై భారీ ఆఫర్.. ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై వేలల్లో డిస్కౌంట్
  3. TEMPT : కేవలం రూ.1,990కే మినీ ఏసీ లాంటి అనుభూతి.. టెంప్ట్ సరికొత్త గ్యాడ్జెట్
  4. OnePlus : మార్కెట్లోకి వన్‌ప్లస్ టర్బో సిరీస్.. ఒకేసారి రెండు అదిరిపోయే స్మార్ట్‌ఫోన్లు
  5. Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై మీ ప్రొఫైల్ పోస్టులను నచ్చినట్లు మార్చుకోవచ్చు
  6. Amazon : బ్యాంక్ కార్డు ఉంటే అదనపు డిస్కౌంట్.. ఈ సేల్‌లో అస్సలు మిస్ అవ్వకూడని టాప్ డీల్స్ ఇవే
  7. New Smartphones : భారత మార్కెట్లో మొబైల్స్ జాతర.. ఈ వారంలో లాంచ్ అవుతున్న 4 సూపర్ స్మార్ట్‌ఫోన్లు
  8. Amazon : అమెజాన్‌లో ఆఫర్ల జాతర.. మెగా డీల్ డేస్ సేల్‌లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు
  9. Xiaomi 17T : భారత మార్కెట్లోకి షావోమి 17T ఎంట్రీ.. శాంసంగ్, వన్‌ప్లస్‌లకు గట్టి పోటీ
  10. Xiaomi Pad 8 : టాబ్లెట్ కొనాలనుకునే వారికి షాక్.. గుట్టుచప్పుడు కాకుండా ధరలు పెంచేసిన షావోమి
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »