అమెజాన్ మెగా డీల్ డేస్ సేల్‌లో షాపింగ్ చేస్తూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసిన కస్టమర్లకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించింది.
Photo Credit: Amazon
Mega Deal Days में बंपर छूट मिल रही है।
Amazon : ఆన్‌లైన్ షాపింగ్ ప్రియుల కోసం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సరికొత్త డిస్కౌంట్ సేల్‌ను తీసుకొచ్చింది. అమెజాన్ మెగా డీల్ డేస్ పేరుతో నిర్వహించిన ఈ ప్రత్యేక సేల్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆఫర్ల వర్షం కురిసింది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, హెడ్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లతో పాటు ఎన్నో గ్యాడ్జెట్స్‌పై కస్టమర్లకు భారీ మినహాయింపులు లభించాయి. ఈ సేల్ సందర్భంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై గరిష్టంగా ఏకంగా 70 శాతం వరకు తగ్గింపును అందించడం విశేషం.
కార్డ్ ఆఫర్లతో అదనపు ప్రయోజనాలు
ఈ సేల్‌లో తక్కువ ధరలకే వస్తువులను అందించడంతో పాటు, కస్టమర్లకు మరింత లాభం చేకూర్చేలా అదనపు బ్యాంక్ ఆఫర్లను కూడా కంపెనీ జత చేసింది. అమెజాన్ మెగా డీల్ డేస్ సేల్‌లో షాపింగ్ చేస్తూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసిన కస్టమర్లకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించింది. దీనివల్ల చాలా ప్రొడక్ట్స్ మరింత తక్కువ ధరకే లభించాయి. ఈ సేల్‌లో మొబైల్స్, ల్యాప్‌టాప్‌లపై లభించిన కొన్ని బెస్ట్ డీల్స్ వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
స్మార్ట్‌ఫోన్లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు
ఈ సేల్‌లో మొబైల్ ఫోన్లపై ఊహించని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా నథింగ్ ఫోన్ (3) (12GB/256GB) మోడల్ అసలు ధర రూ.84,999 కాగా, ఈ సేల్‌లో ఏకంగా రూ.44,999కే లభించింది. అలాగే పాపులర్ మోడల్ అయిన ఐకూ 15R (8GB/256GB) ఫోన్ రూ.53,990కి బదులు రూ.46,998 కే సొంతం చేసుకునే అవకాశం లభించింది. బడ్జెట్ రేంజ్ లో ఉన్న ఒప్పో A6x 5G ధర రూ.18,999 నుంచి రూ.16,999 కి తగ్గింది. వీటితో పాటు శాంసంగ్ గెలాక్సీ M56 5G రూ.23,498 (అసలు ధర రూ.33,999)కి , వన్‌ప్లస్ నార్డ్ CE6 (8GB+12GB) మోడల్ రూ.40,999 కి బదులుగా రూ.31,998 ధరల వద్ద కస్టమర్లను ఆకట్టుకున్నాయి.
Moolyam OTT Release : ఓటీటీలోకి వచ్చేసిన పవర్‌ఫుల్ సోషల్ డ్రామా మూల్యం.. ఎక్కడ చూడాలంటే?
ల్యాప్‌టాప్‌లపై భారీగా తగ్గిన ధరలు
ఆఫీస్ పనులకు లేదా స్టూడెంట్స్ కోసం ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి ఈ సేల్ ఒక మంచి అవకాశంగా నిలిచింది. స్నాప్‌డ్రాగన్ X ప్రాసెసర్‌తో వచ్చే ప్రీమియం మోడల్ హెచ్‌పీ ఓమ్నీబుక్ 3 ల్యాప్‌టాప్ అసలు ధర రూ.1,08,510 కాగా, ఈ సేల్‌లో రూ. 73,990 కే అందుబాటులోకి వచ్చింది. అలాగే ఏసస్ వివోబుక్ 16' మోడల్ రూ. 84,990కి బదులుగా రూ.62,990కే లభించింది. బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ ఏసర్ స్మార్ట్‌చాయిస్ ఆస్పైర్ వన్ రూ. 55,999 నుంచి ఏకంగా రూ. 34,990 కి తగ్గింది. వీటితో పాటు లెనోవో యోగా స్లిమ్ 7 రూ. 82,990 (అసలు ధర రూ.1,13,290) కి గేమింగ్ ల్యాప్‌టాప్ ఏసస్ టఫ్ A15 (Ryzen 7, RTX 3050) రూ. 83,990 కి బదులు రూ. 63,990 ధరకే అందుబాటులో ఉన్నాయి.
స్మార్ట్ టీవీలపై సూపర్ డీల్స్
ఇంట్లో హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారి కోసం స్మార్ట్ టీవీలపై కూడా అమెజాన్ క్రేజీ ఆఫర్లను అందించింది. శాంసంగ్ 43 ఇంచుల క్రిస్టల్ 4K విస్టా అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ రూ.39,500 కి బదులుగా రూ.28,490కే లభించింది. పెద్ద స్క్రీన్ ఇష్టపడే వారి కోసం హైయర్ H6E సిరీస్ 65 ఇంచుల 4K QLED గూగుల్ టీవీ రూ.91,990 నుంచి రూ.63,490కి తగ్గింది. ఇక సరికొత్త మోడల్ అయిన లూమియో విజన్ 9 (2026) 55 ఇంచుల 4K అల్ట్రా హెచ్‌డీ క్యూడీ-మినీ ఎల్‌ఈడీ' గూగుల్ టీవీపై ఏకంగా సగం ధర తగ్గి రూ.99,999కి బదులు రూ.51,999 ధరకే లభించింది. ఈ సేల్ జూన్ 9, 2026 నాటికే ముగిసినప్పటికీ, కస్టమర్ల నుంచి దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది.
ప్రకటన
ప్రకటన