Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై మీ ప్రొఫైల్ పోస్టులను నచ్చినట్లు మార్చుకోవచ్చు

మన ప్రొఫైల్ పేజీలో ఫొటోలు ఎలా కనిపించాలనేది మనమే స్వయంగా నిర్ణయించుకునేలా రీఆర్డర్ యువర్ గ్రిడ్ అనే సరికొత్త ఫీచర్‌ను కంపెనీ పరిచయం చేసింది.

Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై మీ ప్రొఫైల్ పోస్టులను నచ్చినట్లు మార్చుకోవచ్చు

Photo Credit: Pexels/Viralyft

रीऑर्डर योर ग्रिड फीचर धीरे-धीरे ग्लोबल स्तर पर यूजर्स के लिए उपलब्ध हो रहा है।

ముఖ్యాంశాలు
  • ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్
  • ఇకపై మీ ప్రొఫైల్ పోస్టులను నచ్చినట్లు మార్చుకోవచ్చు!
  • పోస్ట్ డేట్ మారదు.. కానీ ఆర్డర్ మారుతుంది
ప్రకటన

Instagram : ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్ల కోసం ఒక అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా మనం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ఫొటోలు లేదా వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి టైమ్‌లైన్ ప్రకారం వరుసగా కనిపిస్తాయి. కానీ, ఇప్పుడు ఆ పద్ధతికి చెక్ పెడుతూ.. మన ప్రొఫైల్ పేజీలో ఫొటోలు ఎలా కనిపించాలనేది మనమే స్వయంగా నిర్ణయించుకునేలా రీఆర్డర్ యువర్ గ్రిడ్ అనే సరికొత్త ఫీచర్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఈ అప్‌డేట్ వల్ల యూజర్లకు తమ ప్రొఫైల్ కంటెంట్‌పై పూర్తి నియంత్రణ లభిస్తుంది.

అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసిన ఇన్‌స్టా బాస్
ఈ సరికొత్త ఫీచర్ గురించి ఇన్‌స్టాగ్రామ్ హెడ్ యాడమ్ మొస్సేరి స్వయంగా ప్రకటించారు. యూజర్లు తమ క్రియేటివిటీని మరింత మెరుగ్గా చూపించుకోవడానికి, తమ ప్రొఫైల్‌ను మరింత అందంగా మార్చుకోవడానికి ఈ అప్‌డేట్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లకు దశలవారీగా అందుబాటులోకి వస్తోంది. ఈ ఫీచర్ సపోర్ట్ చేసే అకౌంట్లలో పోస్ట్ ఆప్షన్ మెనూలోనే ఈ సరికొత్త ఆప్షన్ కస్టమర్లకు దర్శనమిస్తోంది.

ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?
ఇన్‌స్టాగ్రామ్ యాప్ లోపలే చాలా సులభమైన ప్రాసెస్ ద్వారా మీ ప్రొఫైల్ పోస్టులను రీఅరేంజ్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.
* మొదటగా మీ మొబైల్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ పేజీకి వెళ్లాలి.
* మీ ప్రొఫైల్ గ్రిడ్‌లో ఉన్న ఏదేని ఒక పోస్ట్‌ను కాసేపు నొక్కి పట్టుకోవాలి.
* అలా చేయగానే అక్కడ ఒక పాప్-అప్ మెనూ ఓపెన్ అవుతుంది.
* ఆ మెనూలో మీకు రీఆర్డర్ యువర్ గ్రిడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిని సెలెక్ట్ చేసుకోవాలి.
* ఆ తర్వాత మీకు నచ్చిన పోస్ట్‌ను డ్రాగ్ చేస్తూ 

 

Xiaomi 17T : భారత మార్కెట్లోకి షావోమి 17T ఎంట్రీ.. శాంసంగ్, వన్‌ప్లస్‌లకు గట్టి పోటీ

డేట్, క్యాప్షన్లు మారవు
మీరు ఇలా పోస్టుల ఆర్డర్ మార్చిన వెంటనే ఆ మార్పులు సేవ్ అయిపోతాయి. మీ ప్రొఫైల్‌ను సందర్శించే ఇతర యూజర్లకు కూడా మీరు మార్చిన ఆర్డర్ ప్రకారమే పోస్టులు కనిపిస్తాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ ఫీచర్ ద్వారా కేవలం ప్రొఫైల్ చూసే విధానం మాత్రమే మారుతుంది. దీనివల్ల మీరు గతంలో పెట్టిన ఒరిజినల్ పోస్ట్ డేట్, దానికి ఇచ్చిన క్యాప్షన్ లేదా లోపల ఉన్న కంటెంట్ ఏమాత్రం ప్రభావితం కావు. అవి ఎప్పటిలాగే సేఫ్‌గా ఉంటాయి.

క్రియేటర్స్, బిజినెస్ అకౌంట్లకు వరం
ఈ  రీఆర్డర్ యువర్ గ్రిడ్ ఫీచర్ ముఖ్యంగా ఇన్‌ఫ్లుయెన్సర్లు, క్రియేటర్లు,  బిజినెస్ బ్రాండ్ నడిపే వారికి ఒక పెద్ద వరం లాంటిదని చెప్పవచ్చు. తమ అకౌంట్లలో అత్యధిక వ్యూస్ లేదా లైక్స్ వచ్చిన బెస్ట్ పోస్టులను ప్రొఫైల్‌లో అందరికీ ముందే కనిపించేలా హైలైట్ చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఎవరైనా కొత్త విజిటర్స్ మన ప్రొఫైల్‌ను చూసినప్పుడు ఒక మంచి ఇంప్రెషన్ పడేలా లేఅవుట్‌ను ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసుకోవచ్చు. మీ పర్సనల్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత స్టైలిష్‌గా మార్చుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్ తెచ్చిన ఈ సరికొత్త ఫీచర్ అద్భుతంగా ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »