TEMPT : కేవలం రూ.1,990కే మినీ ఏసీ లాంటి అనుభూతి.. టెంప్ట్ సరికొత్త గ్యాడ్జెట్

టెంప్ట్ ఐసీ పేరుతో ఒక ఇన్స్టంట్ కూలింగ్ పోర్టబుల్ ఫ్యాన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది.

TEMPT : కేవలం రూ.1,990కే మినీ ఏసీ లాంటి అనుభూతి.. టెంప్ట్ సరికొత్త గ్యాడ్జెట్

Photo Credit: TEMPT

TEMPT ICY पोर्टेबल फैन 18°C तक कूलिंग इफेक्ट देने का दावा करता है

ముఖ్యాంశాలు
  • కేవలం రూ. 1,990 కే మినీ ఏసీ లాంటి అనుభూతి
  • మార్కెట్లోకి టెంప్ట్ ఐసీ (TEMPT ICY) ఇన్స్టంట్ కూలింగ్ పోర్టబుల్ ఫ్యాన్!
  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 గంటల బ్యాకప్
ప్రకటన

TEMPT : సమ్మర్ సీజన్‌లో ఎండలు, ఉక్కపోతతో ఇబ్బంది పడే ప్రజల కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ టెంప్ట్ ఒక సూపర్ గ్యాడ్జెట్‌ను మార్కెట్లోకి తెచ్చింది.  టెంప్ట్ ఐసీ పేరుతో ఒక ఇన్స్టంట్ కూలింగ్ పోర్టబుల్ ఫ్యాన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఆఫీసులకు వెళ్లేవారు, ట్రావెలింగ్ చేసేవారు, అవుట్‌డోర్ యాక్టివిటీస్, రోజువారీ ప్రయాణాలు చేసేవారిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేసింది. ఎండలో ప్రయాణించేటప్పుడు తక్షణ ఉపశమనం కోసం ఒక పోర్టబుల్ కూలింగ్ సొల్యూషన్‌గా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

బడ్జెట్ ధరలోనే అందుబాటులోకి..
ఈ సరికొత్త టెంప్ట్ ఐసీ పోర్టబుల్ ఫ్యాన్ ధరను సామాన్యులకు అందుబాటులో ఉండేలా కేవలం రూ. 1,990 గా నిర్ణయించారు. ఇది చూడటానికి ఎంతో స్టైలిష్‌గా ఉండటమే కాకుండా ఎలిగెంట్ బీజ్, బోల్డ్ గ్రే, సెరీన్ వైట్ వంటి మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కస్టమర్లు ఈ డివైజ్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ద్వారా సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఇది పరిమాణంలో చాలా చిన్నదిగా ఉండటం వల్ల బ్యాగ్ లేదా హ్యాండ్‌బ్యాగ్‌లో సులభంగా సర్ది పట్టుకెళ్లవచ్చు.

మినీ ఏసీ లాంటి చిల్లర్ మోడ్ టెక్నాలజీ
ఈ టెంప్ట్ ఐసీ ఫ్యాన్ అతిపెద్ద ప్లస్ పాయింట్ దీనిలో ఉన్న చిల్లర్ మోడ్. కంపెనీ ఇందులో సెమీకండక్టర్ ఆధారిత కూలింగ్ ప్లేట్‌ను అమర్చింది. ఈ మోడ్‌ను ఆన్ చేసిన కొన్ని సెకన్లలోనే ఈ ప్లేట్ ఏకంగా 18 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లబడుతుంది. ఈ ప్లేట్‌ను చర్మం పై తాకించడం ద్వారా వెంటనే మంచు ముక్కను తాకినట్లుగా చల్లటి అనుభూతి కలుగుతుంది. అందుకే కంపెనీ దీనిని ఒక మినీ పోర్టబుల్ ఏసీ లాంటి అనుభవాన్ని ఇచ్చే డివైజ్‌గా అభివర్ణిస్తోంది.

పవర్‌ఫుల్ బ్యాటరీ బ్యాకప్ విశేషాలు
ఛార్జింగ్ టెన్షన్ లేకుండా ఎక్కువ సమయం పనిచేసేందుకు ఇందులో 4000mAh సామర్థ్యం ఉన్న రీఛార్జబుల్ లిథియం బ్యాటరీని అందించారు. సాధారణ మోడ్‌లో వాడితే ఈ ఫ్యాన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 12 గంటల పాటు నిరంతరాయంగా గాలిని ఇస్తుంది. ఒకవేళ మీరు అత్యంత చల్లదనాన్ని ఇచ్చే చిల్లర్ మోడ్ ఆన్ చేసి వాడినా కూడా ఇది 10 గంటల వరకు బ్యాకప్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, కస్టమర్లు తమ అవసరానికి అనుగుణంగా మార్చుకునేందుకు ఇందులో నాలుగు రకాల ఎయిర్‌ఫ్లో మోడ్స్‌ను కూడా ఇచ్చారు.

New Smartphones : భారత మార్కెట్లో మొబైల్స్ జాతర.. ఈ వారంలో లాంచ్ అవుతున్న 4 సూపర్ స్మార్ట్‌ఫోన్లు

శబ్దం లేని సూపర్ స్పీడ్ పర్ఫార్మెన్స్
ఈ చిన్న డివైజ్‌లో అత్యంత శక్తివంతమైన హై-పర్ఫార్మెన్స్ బ్రష్‌లెస్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 14,000 RPM కంటే ఎక్కువ స్పీడ్‌తో తిరుగుతూ పవర్‌ఫుల్ గాలిని అందిస్తుంది. ఇంత ఎక్కువ స్పీడ్ ఉన్నప్పటికీ, ఇది చేసే శబ్దం మాత్రం కేవలం 20dB కంటే తక్కువగానే ఉంటుంది. దీనివల్ల ఆఫీసుల్లో పని చేసుకునేటప్పుడు, విద్యార్థులు చదువుకునేటప్పుడు లేదా రాత్రి పూట పడుకునేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా దీనిని వాడుకోవచ్చు.

స్మార్ట్ డిస్‌ప్లే,  ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
యూజర్ల సౌకర్యార్థం ఈ ఫ్యాన్‌పై ఒక ఎల్‌ఈడీ డిస్‌ప్లేను కూడా ఏర్పాటు చేశారు. ఇది బ్యాటరీ ఎంత శాతం ఉంది, ఫ్యాన్ ఏ స్పీడ్‌లో తిరుగుతోంది. ఏ కూలింగ్ మోడ్ రన్ అవుతోంది అనే వివరాలను స్పష్టంగా చూపిస్తుంది. కేవలం ఒకే ఒక్క బటన్‌తో ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ చేయడం, చిల్లర్ మోడ్‌ను ఆన్/ఆఫ్ చేసుకోవడం చేయవచ్చు. ఛార్జింగ్ కోసం ఇందులో లేటెస్ట్ టైప్-సి పోర్ట్‌ను ఇచ్చారు. ఇది కేవలం 90 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. దీనిని లాప్‌టాప్, పవర్ బ్యాంక్, వాల్ ఛార్జర్ లేదా కార్ ఛార్జర్ల సహాయంతో ఎక్కడైనా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు.

#తాజా కథనాలు
  1. Vivo X300 : ఫ్లిప్‌కార్ట్‌లో వీవో ఎక్స్300 పై భారీ ఆఫర్.. ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై వేలల్లో డిస్కౌంట్
  2. TEMPT : కేవలం రూ.1,990కే మినీ ఏసీ లాంటి అనుభూతి.. టెంప్ట్ సరికొత్త గ్యాడ్జెట్
  3. OnePlus : మార్కెట్లోకి వన్‌ప్లస్ టర్బో సిరీస్.. ఒకేసారి రెండు అదిరిపోయే స్మార్ట్‌ఫోన్లు
  4. Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై మీ ప్రొఫైల్ పోస్టులను నచ్చినట్లు మార్చుకోవచ్చు
  5. Amazon : బ్యాంక్ కార్డు ఉంటే అదనపు డిస్కౌంట్.. ఈ సేల్‌లో అస్సలు మిస్ అవ్వకూడని టాప్ డీల్స్ ఇవే
  6. New Smartphones : భారత మార్కెట్లో మొబైల్స్ జాతర.. ఈ వారంలో లాంచ్ అవుతున్న 4 సూపర్ స్మార్ట్‌ఫోన్లు
  7. Amazon : అమెజాన్‌లో ఆఫర్ల జాతర.. మెగా డీల్ డేస్ సేల్‌లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు
  8. Xiaomi 17T : భారత మార్కెట్లోకి షావోమి 17T ఎంట్రీ.. శాంసంగ్, వన్‌ప్లస్‌లకు గట్టి పోటీ
  9. Xiaomi Pad 8 : టాబ్లెట్ కొనాలనుకునే వారికి షాక్.. గుట్టుచప్పుడు కాకుండా ధరలు పెంచేసిన షావోమి
  10. NASA Space Alert : భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం.. నాసా శాస్త్రవేత్తల హై అలర్ట్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »