స్టీవ్ జాబ్స్, టిమ్ కుక్.. ఇప్పుడు జాన్ టెర్నస్! యాపిల్ సామ్రాజ్యాన్ని ఏలబోయే కొత్త 'కింగ్' ఇతనే!

టెక్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన యాపిల్ సీఈఓ పీఠం ఇప్పుడు కొత్త చేతుల్లోకి వెళ్తోంది.

స్టీవ్ జాబ్స్, టిమ్ కుక్.. ఇప్పుడు జాన్ టెర్నస్! యాపిల్ సామ్రాజ్యాన్ని ఏలబోయే కొత్త 'కింగ్' ఇతనే!

Photo Credit: Apple

యాపిల్‌లో భారీ మార్పులు

ముఖ్యాంశాలు
  • AI వార్ లో ఆపిల్ మాస్టర్ స్ట్రోక్
  • కొత్త సీఈఓ గా హార్డ్‌వేర్ మేధావి
  • యాపిల్‌లో భారీ మార్పులు
ప్రకటన

టెక్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన యాపిల్ సీఈఓ పీఠం ఇప్పుడు కొత్త చేతుల్లోకి వెళ్తోంది. ఇన్నాళ్లూ కంపెనీని ఒక రేంజ్‌లో నడిపించిన టిమ్ కుక్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. ఆయన స్థానంలో జాన్ టెర్నస్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. సాధారణంగా క్రెయిగ్ ఫెడెరిఘి లేదా ఎడ్డీ క్యూ లాంటి పాపులర్ ముఖాలు ఈ రేసులో ఉంటాయని అందరూ ఊహించారు. కానీ యాపిల్ బోర్డు మాత్రం ఎవరూ ఊహించని విధంగా తెర వెనుక ఉండి కంపెనీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన టెర్నస్‌ను ఎంపిక చేసింది. ఇది ఒక రకంగా 2011 నాటి సీన్‌ను గుర్తుచేస్తోంది. అప్పట్లో స్టీవ్ జాబ్స్ తప్పుకున్నప్పుడు కూడా టిమ్ కుక్ ఎవరో చాలామందికి తెలియదు. ఆ నిర్ణయమే యాపిల్ దశను మార్చేసింది కాబట్టి టెర్నస్ నియామకం మరో మాస్టర్ స్ట్రోక్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

టిమ్ కుక్ నిష్క్రమణ అనేది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం ఏమీ కాదు. దీని వెనుక పెద్ద ప్లానింగ్ ఉంది. అక్టోబర్ 2025లోనే ఆయన రిటైర్మెంట్ గురించి చర్చలు మొదలయ్యాయి. కుక్ వయస్సు 65 ఏళ్లకు దగ్గర పడుతుండటంతో కంపెనీ భవిష్యత్తు కోసం కొత్త రక్తం అవసరమని బోర్డు భావించింది. అమెరికాలో సాధారణంగా ఈ వయస్సులో రిటైర్మెంట్ తీసుకోవడం కామనే. పైగా గత రెండేళ్లలో కంపెనీకి చెందిన పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ కూడా తప్పుకున్నారు. దీనివల్ల యాపిల్ లీడర్‌షిప్ టీమ్ కాస్త బలహీనపడినట్లు కనిపించింది. వారసుడి వేటలో చాలా పేర్లు వినిపించినా వయస్సు ఫ్యాక్టర్ అడ్డు వచ్చింది. కొందరు సీనియర్లు రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉండటం వల్ల లాంగ్ రన్ కోసం యువ నాయకుడి అవసరముందని గ్రహించి టెర్నస్‌ను ఫైనలైజ్ చేశారు.

జాన్ టెర్నస్ ఇప్పుడే కొత్తగా యాపిల్‌లోకి రాలేదు. గత 25 ఏళ్లుగా ఆయన ఈ సంస్థలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ విభాగంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తూ ఐఫోన్, ఐప్యాడ్, మాక్ బుక్ లాంటి ప్రతి ప్రొడక్ట్ తయారీలో తన ముద్ర వేశారు. 2001లో ప్రొడక్ట్ డిజైన్ టీమ్‌లో చేరిన ఆయన టెక్నికల్ విషయాల్లో దిట్ట అని పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రీసెంట్‌గా వచ్చిన మాక్ బుక్ నియో లాంటి గ్యాడ్జెట్స్ వెనుక టెర్నస్ ఆలోచనలు ఉన్నాయి. ఆయన కేవలం ఒక ఇంజనీర్ మాత్రమే కాదు మేనేజ్‌మెంట్‌లో కూడా తిరుగులేని పట్టు ఉన్న వ్యక్తి. అందుకే టిమ్ కుక్ కూడా టెర్నస్‌పై పూర్తి నమ్మకం ఉంచి తన వారసుడిగా సెలెక్ట్ చేసుకున్నారు.

టెర్నస్ వర్కింగ్ స్టైల్ గురించి కంపెనీ లోపల చాలా పాజిటివ్ టాక్ ఉంది. ఆయన అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని చెప్తారు. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికల ప్రకారం టెర్నస్ చాలా ప్రశాంతంగా ఉంటూనే కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగుల పట్ల సాఫ్ట్‌గా ఉంటూనే పని విషయంలో కాంప్రమైజ్ కాకుండా గట్టిగా ఉంటారని పేరుంది. స్టీవ్ జాబ్స్ లాగా విపరీతమైన రిస్క్‌లు తీసుకోకపోయినా ప్రతి అడుగును చాలా జాగ్రత్తగా లెక్కలేసి వేస్తారు. యాపిల్ సంస్కృతిపై ఆయనకు పూర్తి అవగాహన ఉండటం వల్ల కంపెనీ మార్కెట్ స్థానాన్ని కాపాడటంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని నమ్ముతున్నారు. ఈ హ్యాండ్స్-ఆన్ అప్రోచ్ వల్ల భవిష్యత్తులో గ్యాడ్జెట్స్ మరింత పవర్‌ఫుల్‌గా వచ్చే అవకాశం ఉంది.

కొత్త సీఈఓగా బాధ్యతలు తీసుకున్న వెంటనే టెర్నస్ ముందు పెద్ద సవాళ్లు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ మాయలో ఉంది. యాపిల్ ఈ విషయంలో కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. గూగుల్ లేదా మెటా లాంటి సంస్థలతో పోలిస్తే యాపిల్ సొంతంగా ఏఐ టెక్నాలజీని డెవలప్ చేయడంలో ఆలస్యం చేసింది. ప్రస్తుతం థర్డ్ పార్టీ సాయంతో ఫీచర్లు ఇస్తున్నప్పటికీ సొంతంగా పవర్‌ఫుల్ మోడల్స్ తయారు చేయడం టెర్నస్ ముందున్న మొదటి టాస్క్. ముఖ్యంగా ఐఫోన్ యూజర్లు సిరి అసిస్టెంట్ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారు. దాన్ని చాట్ జీపీటీ స్థాయికి తీసుకెళ్లడం ఇప్పుడు అత్యవసరం. ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం ద్వారానే యాపిల్ మళ్ళీ రేసులోకి రాగలదు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Motorola G37 Power 5G: మోటోరోలా బంపర్ ఆఫర్.. 7000mAh భారీ బ్యాటరీ ఫోన్‌పై ఏకంగా 47% డిస్కౌంట్
  2. iQOO Z11 : భారత్‌లోకి ఐకూ Z11 గ్రాండ్ ఎంట్రీ.. ఆగస్టు 20న లాంచ్ కాబోతున్న పవర్‌ఫుల్ 5G ఫోన్
  3. Google Pixel 11 Series Launch: ఆగస్టు 12న గూగుల్ మెగా ఈవెంట్.. నాలుగు మోడళ్లలో పిక్సెల్ 11 సిరీస్ లాంచ్
  4. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ షురూ.. రూ. 399లకే బ్రాండెడ్ పవర్ బ్యాంక్‌లు
  5. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో ఊహించని ధమాకా.. ఐఫోన్ 17 పై భారీ డిస్కౌంట్
  6. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ షురూ.. రూ. 30 వేల బడ్జెట్‌లో టాప్ 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
  7. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. 43 ఇంచుల స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు
  8. Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం.. 32 ఇంచుల స్మార్ట్ టీవీలపై ఊహించని డిస్కౌంట్లు
  9. ITR Refund: ఐటీఆర్ రీఫండ్ కోసం చూస్తున్నారా? నిమిషాల్లో స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలుసా ?
  10. TVS Motor: టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి షాక్.. భారీగా పెరిగిన ఐక్యూబ్, ఆర్బిటర్ ధరలు
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »