గ్లోబల్ మార్కెట్‌లో ఈ మొబైల్స్ మే 28న గ్రాండ్‌గా విడుదల కానుండగా, ఆ తర్వాత జూన్ 4న భారతదేశంలో స్టాండర్డ్ షియోమీ 17టీ మోడల్ అడుగుపెట్టనుంది
Photo Credit: Xiaomi
Xiaomi 17T will succeed the Xiaomi 15T (pictured)
Xiaomi : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం షియోమీ నుంచి రాబోతున్న మోస్ట్ అవేటెడ్ షియోమీ 17టీ సిరీస్ ధరలు మార్కెట్లోకి అధికారికంగా లాంచ్ కాకముందే లీకయ్యాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఈ మొబైల్స్ మే 28న గ్రాండ్‌గా విడుదల కానుండగా, ఆ తర్వాత జూన్ 4న భారతదేశంలో స్టాండర్డ్ షియోమీ 17టీ మోడల్ అడుగుపెట్టనుంది. గత ఏడాది సెప్టెంబర్ 2025లో వచ్చిన షియోమీ 15టీ సిరీస్ తర్వాత దాదాపు ఎనిమిది నెలల గ్యాప్‌తో వస్తున్న నయా లైనప్ ధరల గుట్టును ప్రముఖ ఇండియన్ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా రట్టు చేశారు. ఫిలిప్పీన్స్ మార్కెట్‌కు సంబంధించిన ఈ ధరల వివరాలు ఇప్పుడు టెక్ నెటిజన్లలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
లీకైన తాజా సమాచారం ప్రకారం, బేస్ మోడల్ అయిన షియోమీ 17టీ రెండు మెమరీ వేరియంట్లలో లభించనుంది. ఇందులో 12GB ర్యామ్ + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రారంభ వేరియంట్ ధర 33,999 ఫిలిప్పీన్ పెసోలు (భారత కరెన్సీలో సుమారు రూ.52,700)గా ఉండే అవకాశం ఉంది. అలాగే దీని టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ మోడల్ ధరను 37,999 ఫిలిప్పీన్ పెసోలు (మన కరెన్సీలో దాదాపు రూ.58,900) గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. యూరప్ మార్కెట్ అంచనాలతో పోలిస్తే ఆసియా దేశాలలో ఈ ధరలు చాలా తక్కువగా ఉండటం విశేషం.
మరోవైపు ఈ సిరీస్‌లో అత్యంత ప్రీమియం ఫీచర్లతో వస్తున్న షియోమీ 17టీ ప్రో ధరలు కూడా భారీగానే ఉన్నాయి. దీని 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ బేస్ మోడల్ ధర 45,999 ఫిలిప్పీన్ పెసోలు (సుమారు రూ.71,400) గా ఉండనుండగా, 12GB ర్యామ్ + 512GB మెమరీ కలిగిన హై-ఎండ్ మోడల్ ధర 47,999 ఫిలిప్పీన్ పెసోలు (మన దేశంలో దాదాపు రూ.74,500) గా ఉండబోతోంది. అయితే భారతీయ టెక్ ప్రియులకు ఒక చిన్న చేదు వార్త ఏమిటంటే.. షియోమీ సంస్థ ఈ ప్రో వేరియంట్‌ను ఇండియాలో లాంచ్ చేయడం లేదని, దీనిని కేవలం గ్లోబల్ మార్కెట్లకే పరిమితం చేసి, ఇండియాలో కేవలం స్టాండర్డ్ 17టీ మోడల్‌ను మాత్రమే జూన్ 4న సేల్స్‌కు తీసుకురానుందని అంతర్గత నివేదికలు చెబుతున్నాయి.
ఈ ధరల వ్యత్యాసాన్ని గమనిస్తే.. గతంలో లీకైన యూరప్ ధరల కంటే ఇవి చాలా తక్కువ. యూరప్‌లో షియోమీ 17టీ బేస్ ప్రైస్ ఏకంగా 749 యూరోలు (సుమారు రూ. 83,100) గాను, ప్రో మోడల్ ధర 999 యూరోలు (సుమారు రూ.1,10,800)గాను ఉంటుందని వార్తలు వచ్చాయి. ఆగ్నేయాసియా దేశాల మార్కెట్లలో యాపిల్, శామ్‌సంగ్ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడానికి షియోమీ ఎప్పుడూ కాస్త దూకుడుగా ఉండే తక్కువ ధరల వ్యూహాన్నే పాటిస్తుంది. ఈసారి కూడా అదే ఫార్ములాను అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే దీనిపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ ఇవ్వలేదు.
ఫీచర్ల పరంగా చూస్తే, భారతదేశంలో విడుదల కాబోయే షియోమీ 17టీ ఫోన్‌లో వెనుక వైపు చతురస్రాకార కెమెరా మాడ్యూల్‌ను అమర్చారు. ఇందులో ప్రసిద్ధ జర్మన్ కెమెరా బ్రాండ్ లైకా ట్యూన్ చేసిన మూడు అద్భుతమైన కెమెరాలను ఇస్తున్నారు. దీనితో పాటు పవర్ఫుల్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 1.5K అమోలెడ్ స్క్రీన్ వంటి నెక్స్ట్ లెవెల్ ఫీచర్లు ఉండనున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత భారత్‌లో టీ-సిరీస్ రీఎంట్రీ ఇస్తుండటంతో వన్ ప్లస్, ఐకూ వంటి బ్రాండ్లకు గట్టి పోటీ ఎదురుకానుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
GTA 6 Is Getting an Official Soundtrack Album With 34 Original Tracks; Physical Version Pre-Orders Now Live
Ai+ Pulse 2 FE India Launch Teased; Colour Options, Flipkart Availability Confirmed