Xiaomi : మార్కెట్లోకి షియోమీ లగ్జరీ స్మార్ట్‌ఫోన్ల సిరీస్.. సరికొత్త డిజైన్, అదిరిపోయే కలర్స్‌తో ఎంట్రీ

సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల సిరీస్ షియోమీ 17టీను విడుదల చేయడానికి కంపెనీ అధికారికంగా రంగం సిద్ధం చేసింది.

Xiaomi : మార్కెట్లోకి షియోమీ లగ్జరీ స్మార్ట్‌ఫోన్ల సిరీస్.. సరికొత్త డిజైన్, అదిరిపోయే కలర్స్‌తో ఎంట్రీ

Photo Credit: Xiaomi

Xiaomi 17T series will boast a Leica-branded camera unit

ముఖ్యాంశాలు
  • షియోమీ 17టీ, షియోమీ 17టీ ప్రో మోడల్స్ రానున్నాయి.
  • ఈ ఫోన్ల డిజైన్, డిస్‌ప్లే సైజులు, కలర్ ఆప్షన్ల వివరాలను కంపెనీ రివీల్
  • షియోమీ 17టీ త్వరలో ఇండియాలో కూడా లాంచ్ అవుతుంది
ప్రకటన


Xiaomi : టెక్ ప్రియులకు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమీ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారతీయ మార్కెట్లోకి తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల సిరీస్ షియోమీ 17టీను విడుదల చేయడానికి కంపెనీ అధికారికంగా రంగం సిద్ధం చేసింది. ఈ లైనప్‌లో భాగంగా షియోమీ 17టీ, షియోమీ 17టీ ప్రో మోడల్స్ రానున్నాయి. వచ్చే వారమే గ్లోబల్ మార్కెట్లో గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్న ఈ ఫోన్ల డిజైన్, డిస్‌ప్లే సైజులు, కలర్ ఆప్షన్ల వివరాలను కంపెనీ అధికారికంగా రివీల్ చేసింది.

ఈ సరికొత్త షియోమీ 17టీ సిరీస్ ఫోన్లు రెండు విభిన్న డిస్‌ప్లే సైజులలో కొనుగోలుదారులకు అందుబాటులోకి రానున్నాయి. డిజైన్ పరంగా రెండు మోడల్స్ ఒకేలా ఉన్నప్పటికీ, సైజులు, కలర్స్‌లో మార్పులు ఉన్నాయి. వీటిలో చిన్న డిస్‌ప్లే ఉన్న వేరియంట్ ఆకర్షణీయమైన వయిలెట్ కలర్ ఆప్షన్‌లో రానుండగా, పెద్ద డిస్‌ప్లే కలిగిన వేరియంట్ రాయల్ డీప్ బ్లూ కలర్ ఆప్షన్‌లో కస్టమర్లను పలకరించనుంది. ప్రీమియం లుక్ కోసం ఈ ఫోన్ల చుట్టూ ఫ్లాట్ మెటల్ ఫ్రేమ్, కుడి వైపున పవర్, వాల్యూమ్ బటన్లను అమర్చారు.
 

Realme : రియల్‌మీ నుంచి అదిరిపోయే బడ్స్ లాంచ్.. 50 గంటల నాన్‌స్టాప్ మ్యూజిక్

ఈ లైనప్ ఫోన్ల వెనుక భాగంలో స్క్వేర్ షేప్  కెమెరా మాడ్యూల్‌ను ఇచ్చారు. ఇందులో ప్రసిద్ధ లైకా బ్రాండింగ్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. కెమెరా ఐలాండ్ పక్కనే ఎల్‌ఈడీ ఫ్లాష్ లైట్‌ను కూడా అమర్చారు. అలాగే బ్యాక్ ప్యానెల్ ఎడమ వైపు దిగువన నిలువుగా ఉండే షియోమీ బ్రాండింగ్ లోగో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ల సిరీస్ గ్లోబల్ లాంచ్ వచ్చే వారం మే 28న జరగనుంది. ఆ తర్వాతి వారమే, అంటే జూన్ 4వ తేదీన బేస్ మోడల్ అయిన షియోమీ 17టీని భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాలో టీ సిరీస్ మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తుండటం విశేషం.

లీకైన సమాచారం ప్రకారం, స్టాండర్డ్ షియోమీ 17టీ మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్, 460 ppi పిక్సెల్ డెన్సిటీతో కూడిన 6.59 ఇంచుల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మల్టీటాస్కింగ్, గేమింగ్ కోసం ఇందులో అత్యంత పవర్‌ఫుల్ 4nm ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 3.4GHz గరిష్ట క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. దీనితో పాటు 12GB ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512GB వరకు యూఎఫ్ఎస్ 4.1 ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది.

#తాజా కథనాలు
  1. WhatsApp : వాట్సాప్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సెక్యూరిటీ అప్‌డేట్.. ఇకపై ఫోన్ నంబర్ ఇవ్వకుండానే చాటింగ్
  2. Motorola : మార్కెట్‌ను షేక్ చేయనున్న మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+.. జూన్ 4న ఇండియా లాంచ్
  3. Xiaomi : షియోమీ 17టీ సిరీస్ ధరలు లీక్.. లాంచ్‌కు ముందే గుట్టురట్టు చేసిన టిప్‌స్టర్
  4. Windows 11 : ఇక వెబ్‌క్యామ్ కొనే పనిలేదు.. మీ ఆండ్రాయిడ్ ఫోన్నే కంప్యూటర్ వెబ్‌క్యామ్‌గా మార్చేయండి
  5. Mad For Each Other : క్లైమాక్స్‌కు చేరిన లవ్ రియాలిటీ షో.. విన్నర్స్ ఎవరో తెలిసింది భయ్యా!
  6. Budget 5G Phones : మోటో జీ37 పవర్, ఒప్పో K14x, శామ్‌సంగ్ ఎం17 ఫోన్ల మధ్య గట్టి పోటీ.. ఏది కొనడం బెస్ట్?
  7. Xiaomi : మార్కెట్లోకి షియోమీ లగ్జరీ స్మార్ట్‌ఫోన్ల సిరీస్.. సరికొత్త డిజైన్, అదిరిపోయే కలర్స్‌తో ఎంట్రీ
  8. Budget Smartphones : రూ. 11 వేల లోపు బెస్ట్ ఫోన్ ఏది? హెచ్ఎండీ, రెడ్‌మీ, లావా మధ్య బిగ్ ఫైట్
  9. Realme : రియల్‌మీ నుంచి అదిరిపోయే బడ్స్ లాంచ్.. 50 గంటల నాన్‌స్టాప్ మ్యూజిక్
  10. Motorola : మోటరోలా నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్.. ఎడ్జ్ 70 ప్రో+ టీజర్ అవుట్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »