Motorola : మార్కెట్‌ను షేక్ చేయనున్న మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+.. జూన్ 4న ఇండియా లాంచ్

మోటోరోలా భారతీయ మార్కెట్లో తన సరికొత్త ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను విడుదల చేయడానికి అధికారికంగా ముహూర్తం ఖరారు చేసింది.

Motorola : మార్కెట్‌ను షేక్ చేయనున్న మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+.. జూన్ 4న ఇండియా లాంచ్

Photo Credit: Flipkart/ Motorola

Motorola Edge 70 Pro+ will feature a hole-punch display cutout

ముఖ్యాంశాలు
  • మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+ను కంపెనీ ఇండియాలో జూన్ 4వ తేదీన గ్రాండ్‌గా లాంచ్
  • 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్‌వైటీ-710 ప్రధాన కెమెరా
  • ఈ ఫోన్ ధర రూ. 48,000 నుంచి రూ. 56,000 బడ్జెట్ పరిధిలో ఉండే అవకాశం ఉంది.
ప్రకటన

Motorola : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా భారతీయ మార్కెట్లో తన సరికొత్త ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను విడుదల చేయడానికి అధికారికంగా ముహూర్తం ఖరారు చేసింది. మోటో ఎడ్జ్ 70 సిరీస్‌లో ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎడ్జ్ 70, ఎడ్జ్ 70 ఫ్యూజన్, ఎడ్జ్ 70 ప్రో మోడల్స్ విజయవంతం కాగా.. ఇప్పుడు ఈ లైనప్‌లో నాలుగో, అత్యంత పవర్‌ఫుల్ మోడల్ అయిన మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+ను కంపెనీ ఇండియాలో జూన్ 4వ తేదీన గ్రాండ్‌గా లాంచ్ చేయబోతోంది. ఈ మేరకు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X ద్వారా సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఈ సరికొత్త మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+ స్మార్ట్‌ఫోన్ ప్రధానంగా ఫోటోగ్రఫీ, ప్రీమియం డిజైన్‌ను ఇష్టపడే యూజర్లను టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈ ఫోన్ వెనుక భాగంలో సరికొత్త ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌ను అమర్చారు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ కలిగిన 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్‌వైటీ-710 ప్రధాన కెమెరా ఉంటుంది. దీనితో పాటు ఈ విభాగంలోనే అత్యంత సన్నని డిజైన్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను ఇవ్వడం విశేషం. ఇది 85mm ఫోకల్ లెంగ్త్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఫోటోలను తీయడమే కాకుండా, కంపెనీకి చెందిన ప్రత్యేకమైన AI సూపర్ జూమ్ ప్రో టెక్నాలజీ ద్వారా ఏకంగా 50x డిజిటల్ జూమ్ సామర్థ్యాన్ని అందిస్తుంది.
 

Motorola Edge 70 Pro+ : మోటో నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్.. అదిరిపోయే కెమెరా, లగ్జరీ లుక్స్

డిజైన్ పరంగా కూడా ఈ ఫోన్ కస్టమర్లను మొదటి చూపులోనే ఆకట్టుకునేలా ఉంది. గ్లోబల్ కలర్ ఎక్స్‌పర్ట్ పాంటోన్ భాగస్వామ్యంతో ఈ ఫోన్‌ను మూడు విభిన్నమైన లగ్జరీ ఫినిషింగ్స్, కలర్ ఆప్షన్లలో తీసుకువస్తున్నారు. ఇందులో ఉడెన్ టెక్స్చర్‌తో కూడిన పాంటోన్ చికోరీ కాఫీ, ఫాబ్రిక్ లాంటి అల్లికతో ఉండే పాంటోన్ స్టార్మీ సీ, స్మూత్ మ్యాట్ ఫినిషింగ్‌తో మెరిసిపోయే వైన్ కలర్ పాంటోన్ జిన్‌ఫాండెల్ వేరియంట్లు ఉన్నాయి. ఫోన్ ముందర భాగంలో కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్‌తో పాటు సెంటర్‌ పంచ్-హోల్ కెమెరా కటౌట్ ఉంటుంది.

ఇక లీకైన ఇతర స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే.. ఈ అల్ట్రా ప్రీమియం ఫోన్ ఏకంగా 16GB భారీ ర్యామ్ కాన్ఫిగరేషన్, పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌తో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇందులో 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 6500mAh మెగా బ్యాటరీ ఉండనుందని సమాచారం. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఎడ్జ్ 70 ప్రో మోడల్ కంటే మూడు రేట్లు అప్‌గ్రేడ్ ఫీచర్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఇవ్వనున్నారు. ఈ ఫోన్ జూన్ 4 నుంచి ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఇండియా అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ రీటైల్ స్టోర్ల ద్వారా విక్రయానికి రానుంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఈ ఫోన్ ధర రూ. 48,000 నుంచి రూ. 56,000 బడ్జెట్ పరిధిలో ఉండే అవకాశం ఉంది.

#తాజా కథనాలు
  1. WhatsApp : వాట్సాప్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సెక్యూరిటీ అప్‌డేట్.. ఇకపై ఫోన్ నంబర్ ఇవ్వకుండానే చాటింగ్
  2. Motorola : మార్కెట్‌ను షేక్ చేయనున్న మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+.. జూన్ 4న ఇండియా లాంచ్
  3. Xiaomi : షియోమీ 17టీ సిరీస్ ధరలు లీక్.. లాంచ్‌కు ముందే గుట్టురట్టు చేసిన టిప్‌స్టర్
  4. Windows 11 : ఇక వెబ్‌క్యామ్ కొనే పనిలేదు.. మీ ఆండ్రాయిడ్ ఫోన్నే కంప్యూటర్ వెబ్‌క్యామ్‌గా మార్చేయండి
  5. Mad For Each Other : క్లైమాక్స్‌కు చేరిన లవ్ రియాలిటీ షో.. విన్నర్స్ ఎవరో తెలిసింది భయ్యా!
  6. Budget 5G Phones : మోటో జీ37 పవర్, ఒప్పో K14x, శామ్‌సంగ్ ఎం17 ఫోన్ల మధ్య గట్టి పోటీ.. ఏది కొనడం బెస్ట్?
  7. Xiaomi : మార్కెట్లోకి షియోమీ లగ్జరీ స్మార్ట్‌ఫోన్ల సిరీస్.. సరికొత్త డిజైన్, అదిరిపోయే కలర్స్‌తో ఎంట్రీ
  8. Budget Smartphones : రూ. 11 వేల లోపు బెస్ట్ ఫోన్ ఏది? హెచ్ఎండీ, రెడ్‌మీ, లావా మధ్య బిగ్ ఫైట్
  9. Realme : రియల్‌మీ నుంచి అదిరిపోయే బడ్స్ లాంచ్.. 50 గంటల నాన్‌స్టాప్ మ్యూజిక్
  10. Motorola : మోటరోలా నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్.. ఎడ్జ్ 70 ప్రో+ టీజర్ అవుట్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »