ప్రస్తుతం చైనా మార్కెట్లో విడుదలైన ఈ పవర్‌బ్యాంక్ ధర 359 యువాన్లు (మన భారత కరెన్సీలో సుమారు రూ.5,000)గా ఉంది.
Photo Credit: Ugreen
Ugreen PB728 200W
Ugreen : స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు వాడేవారికి నిరంతరం ఛార్జింగ్ సమస్య వేధిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు పవర్‌బ్యాంక్ ఎంతైనా అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ యుగ్రీన్ మార్కెట్లోకి ఒక పవర్‌ఫుల్ పవర్‌బ్యాంక్‌ను తీసుకువచ్చింది. Ugreen PB728 మోడల్ పేరుతో విడుదలైన ఈ డివైజ్ ఏకంగా 25,000mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతో పనిచేస్తుంది. కేవలం ఫోన్లు మాత్రమే కాకుండా లాప్‌టాప్‌లను కూడా సులువుగా ఛార్జ్ చేయగలిగేలా దీనిని 200W గరిష్ట అవుట్‌పుట్ పవర్‌తో డిజైన్ చేశారు. ప్రస్తుతం చైనా మార్కెట్లో విడుదలైన ఈ పవర్‌బ్యాంక్ ధర 359 యువాన్లు (మన భారత కరెన్సీలో సుమారు రూ.5,000)గా ఉంది. దీనిని కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఇక కేబుల్స్ మర్చిపోయారనే తిప్పలుండవు
చాలా సార్లు మనం పవర్‌బ్యాంక్ తెచ్చుకుంటాం కానీ, డేటా కేబుల్ ఇంట్లోనే మర్చిపోతుంటాం. ఈ సమస్యకు చెక్ పెడుతూ యుగ్రీన్ ఈ డివైజ్‌లోనే రెండు ఇన్-బిల్ట్ టైప్-సి కేబుల్స్ అందించింది. ఇందులో పైభాగంలో ఉండే 65 సెంటిమీటర్ల కేబుల్‌ను మనకు కావాల్సినప్పుడు బయటకు లాగి, మళ్లీ లోపలికి చుట్టేయవచ్చు. అలాగే సైడ్‌లో మరో 30 సెంటిమీటర్ల కేబుల్ ఉంటుంది, దీనిని పవర్‌బ్యాంక్ పట్టుకోవడానికి క్యారీ హ్యాండిల్‌లా కూడా వాడుకోవచ్చు. ఇవి కాకుండా సొంత కేబుల్స్ వాడుకునే వారి కోసం అదనంగా ఒక యూఎస్‌బీ-సి పోర్ట్, ఒక యూఎస్‌బీ-ఏ పోర్ట్‌ను కూడా ఇందులో ఇచ్చారు.
పవర్‌బ్యాంక్‌పై కలర్ డిస్‌ప్లే
ఈ పవర్‌బ్యాంక్ ముందు భాగంలో ఒక ఆకర్షణీయమైన స్మార్ట్ కలర్ డిస్‌ప్లేను అమర్చారు. ఇది కేవలం బ్యాటరీ ఎంత ఉందో చూపించడమే కాకుండా, కరెంట్ ఎంత స్పీడ్‌తో ఛార్జ్ అవుతోంది లేదా డిస్‌ఛార్జ్ అవుతుందో రియల్ టైమ్ డేటాను స్క్రీన్‌పై లైవ్‌గా చూపిస్తుంది. ఇందులోని సింగిల్ యూఎస్‌బీ-సి కేబుల్ ద్వారా 100W పవర్ అందుతుంది. ఒకవేళ రెండు టైప్-సి కేబుల్స్ ఒకేసారి వాడితే ఏకంగా 200W అవుట్‌పుట్ లభిస్తుంది. షీయోమి మొబైల్స్ వాడేవారి కోసం ఇందులో ప్రత్యేకంగా MiPPS ఫాస్ట్ ఛార్జింగ్ ప్రోటోకాల్ ఇచ్చారు, దీని ద్వారా 90W స్పీడ్‌తో ఫోన్ ఛార్జ్ అవుతుంది. అలాగే ఇందులోని యూఎస్‌బీ-ఏ పోర్ట్ ద్వారా 33W అవుట్‌పుట్ లభిస్తుంది.
Redmi Note 17 Pro : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మి సంచలనం.. ఏకంగా 9000mAh బ్యాటరీతో వస్తున్న నోట్ 17 ప్రో
ఫ్లైట్లలోనూ హ్యాపీగా తీసుకెళ్లొచ్చు
ఈ పవర్‌బ్యాంక్‌ను తిరిగి ఛార్జ్ చేయడం కూడా చాలా సులభం. ఇది 100W ఇన్‌పుట్ స్పీడ్‌ను సపోర్ట్ చేస్తుంది, కాబట్టి చాలా వేగంగా ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. దీని సైజ్ 158 x 54 x 50mm కాగా, బరువు 623 గ్రాములు ఉంటుంది. దీని బాడీని గట్టి పీసీ, ఏబీఎస్ ప్లాస్టిక్ మెటీరియల్‌తో చాలా బలంగా తయారు చేశారు. భద్రత కోసం ఇందులో టెంపరేచర్ మానిటరింగ్, ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్ ఫీచర్లు ఉన్నాయి. దీని మొత్తం ఎనర్జీ రేటింగ్ 90Wh కావడంతో, అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో కూడా దీనిని ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాగులో తీసుకెళ్లవచ్చు. ఆఫీస్ వర్క్, లాంగ్ ట్రావెలింగ్ చేసే వారికి ఇదొక బెస్ట్ గ్యాడ్జెట్ అని చెప్పవచ్చు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
OnePlus Ace 7 Series Spotted on Geekbench With Snapdragon 8 Elite Gen 5, Android 17
Apple HomeView Smart Hub, New Apple TV 4K and HomePod mini Launch Timeline Leaks
Google Fitbit Edge Set to Launch Today: Expected Price, Specifications