Amazon Freedom Sale 2026: అమెజాన్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. హోమ్ సెక్యూరిటీ సీసీటీవీ కెమెరాలపై భారీ ఆఫర్లు

అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌లో అత్యంత భారీ డిస్కౌంట్ లభిస్తున్న కెమెరాలలో ట్రూవ్యూ 3MP వై-ఫై సెక్యూరిటీ కెమెరా ఒకటి.

Amazon Freedom Sale 2026: అమెజాన్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. హోమ్ సెక్యూరిటీ సీసీటీవీ కెమెరాలపై భారీ ఆఫర్లు

Photo Credit: Amazon

Amazon Freedom Sale

ముఖ్యాంశాలు
  • అమెజాన్ ఫ్రీడమ్ సేల్ సెక్యూరిటీ కెమెరాలపై బంపర్ ఆఫర్లు
  • బ్రాండెడ్ స్మార్ట్ కెమెరాలపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు
  • ఎచ్‌డిఎఫ్‌సి కార్డ్‌పై 10% ఇన్స్టంట్ డిస్కౌంట్
ప్రకటన

Amazon Freedom Sale 2026: మీరు మీ ఇల్లు, షాపు లేదా ఆఫీస్ భద్రత కోసం హోమ్ సెక్యూరిటీ కెమెరాని కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే, అమెజాన్ నిర్వహిస్తున్న ఫ్రీడమ్ సేల్ 2026 ఒక అద్భుతమైన అవకాశం. ఈ సేల్‌లో సీపీ ప్లస్, క్యూబో, ట్రూవ్యూ, హిక్విజన్ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఇన్డోర్, అవుట్‌డోర్ సెక్యూరిటీ కెమెరాలపై ఊహించని రేంజ్‌లో డిస్కౌంట్లు లభిస్తున్నాయి. నేరుగా లభించే తగ్గింపులతో పాటు అదనపు బ్యాంక్ ఆఫర్ల ద్వారా మరింత ఆదా చేసుకోవచ్చు.

అదనపు బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ 
ఈ సేల్‌లో ఎచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఈజీ ఈఎమ్‌ఐ లావాదేవీలపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది, దీని ద్వారా గరిష్టంగా రూ. 10,500 వరకు ఆదా చేసుకోవచ్చు. అలాగే అమెజాన్ పే యూపీఐ లేదా అర్హత కలిగిన ప్రీపెయిడ్ విధానాల్లో చెల్లిస్తే రూ. 150 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీనికి తోడు అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు 5 శాతం అన్ లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ ప్రయోజనం అందుబాటులో ఉంది.

ట్రూవ్యూ 3MP వై-ఫై సెక్యూరిటీ కెమెరాపై భారీ ఆఫర్ 
ఈ సేల్‌లో అత్యంత భారీ డిస్కౌంట్ లభిస్తున్న కెమెరాలలో ట్రూవ్యూ 3MP వై-ఫై సెక్యూరిటీ కెమెరా ఒకటి. దీని ఎమ్మార్పీ రూ. 4,000 కాగా, ఫ్రీడమ్ సేల్‌లో కేవలం రూ. 1,799 కే అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో వై-ఫై సెక్యూరిటీ కెమెరా కోరుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక.

Freedom Sale 2026: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్‌లో ధమాకా డిస్కౌంట్లు.. సగం ధరకే బ్రాండెడ్ 55-ఇంచ్ 4K టీవీలు

సీపీ ప్లస్, హిక్విజన్ అవుట్‌డోర్ కెమెరా ఆఫర్లు 
సీపీ ప్లస్ 4MP అవుట్‌డోర్ కెమెరా ఎమ్మార్పీ రూ. 4,300 కాగా, సేల్‌లో రూ. 3,799 కి లభిస్తోంది. దీనిపై రూ. 501 నేరుగా ఆదా అవుతుంది. ఇక హిక్విజన్ 5MP అవుట్‌డోర్ బుల్లెట్ సీసీటీవీ కెమెరా రూ. 4,200 ఎమ్మార్పీకి బదులుగా కేవలం రూ. 1,929 కే డిస్కౌంట్ ధరలో లభిస్తోంది.

సిపి ప్లస్, క్యూబో ఇన్డోర్ స్మార్ట్ కెమెరాలు:
ఇన్డోర్ సెక్యూరిటీ కోసం సిపి ప్లస్ 4MP స్మార్ట్ కెమెరా ధర రూ. 3,100 నుంచి తగ్గి రూ. 2,549 కి చేరింది. అలాగే సిపి ప్లస్ 3MP స్మార్ట్ వై-ఫై కెమెరా రూ. 2,183 కి, 2MP ఫుల్ హెచ్‌డి వై-ఫై కెమెరా రూ. 2,049 కి అందుబాటులో ఉన్నాయి. మరోవైపు క్యూబో స్మార్ట్ క్యామ్ 360 3MP కెమెరా రూ. 2,550 కి, క్యూబో స్మార్ట్ క్యామ్ 360 ప్రో 4MP మోడల్ రూ. 3,290 కి రీటైల్ అవుతున్నాయి.

(గమనిక: పిన్‌కోడ్, ఎంచుకునే పేమెంట్ కార్డ్,  స్టాక్ లభ్యతను బట్టి ఆఫర్ ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది).

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. రూ. 30 వేల మేర తగ్గిన శాంసంగ్ గెలాక్సీ S25+ ధర
  2. Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా రూ. 2,000 బడ్జెట్‌లోనే బెస్ట్ ఇయర్ బడ్స్
  3. iPhone 17: యాపిల్ లవర్స్‎కు ఊహించని షాక్.. ఆకాశాన్ని తాకనున్న ఐఫోన్ 17 ధరలు
  4. Flipkart Freedom Sale 2026:  ఫ్రీడమ్ సేల్ ధమాకా.. ఎల్‌జీ, శాంసంగ్, సోనీ స్మార్ట్ టీవీలపై బంపర్ ఆఫర్లు
  5. Amazon Freedom Sale 2026: అమెజాన్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. హోమ్ సెక్యూరిటీ సీసీటీవీ కెమెరాలపై భారీ ఆఫర్లు
  6. Freedom Sale 2026: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్‌లో ధమాకా డిస్కౌంట్లు.. సగం ధరకే బ్రాండెడ్ 55-ఇంచ్ 4K టీవీలు
  7. UPI: యూపీఐ వాడితే చార్జీలు పడతాయా? గందరగోళానికి తెరదించిన ఆర్థిక మంత్రి
  8. Motorola G37 Power 5G: మోటోరోలా బంపర్ ఆఫర్.. 7000mAh భారీ బ్యాటరీ ఫోన్‌పై ఏకంగా 47% డిస్కౌంట్
  9. iQOO Z11 : భారత్‌లోకి ఐకూ Z11 గ్రాండ్ ఎంట్రీ.. ఆగస్టు 20న లాంచ్ కాబోతున్న పవర్‌ఫుల్ 5G ఫోన్
  10. Google Pixel 11 Series Launch: ఆగస్టు 12న గూగుల్ మెగా ఈవెంట్.. నాలుగు మోడళ్లలో పిక్సెల్ 11 సిరీస్ లాంచ్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »