Solar Panels : నీటి సంక్షోభానికి ఆస్ట్రేలియా చెక్.. డ్యామ్‌లపై తేలియాడే సోలార్ ప్యానెళ్లతో విద్యుత్ విప్లవం

ఆస్ట్రేలియాలోని డ్యామ్‌లు, జలాశయాల నుంచి తీవ్రమైన ఎండల కారణంగా ప్రతి ఏటా దాదాపు 1,400 గీగా లీటర్ల నీరు ఆవిరి రూపంలో గాల్లో కలిసిపోతోందని నివేదికలు చెబుతున్నాయి.

Solar Panels : నీటి సంక్షోభానికి ఆస్ట్రేలియా చెక్.. డ్యామ్‌లపై తేలియాడే సోలార్ ప్యానెళ్లతో విద్యుత్ విప్లవం

Photo Credit: Pexels/Abdulaziz hasan

Solar Panels

ముఖ్యాంశాలు
  • ప్రపంచ ఇంధన రంగంలో సరికొత్త అద్భుతం
  • నీటి ఎద్దడికి చెక్ పెడుతూ ఆస్ట్రేలియా మెగా ప్లాన్
  • డ్యామ్‌లపై తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్లు
ప్రకటన

Solar Panels : భూగోళంపై దాదాపు 71 శాతం భాగం నీటితో నిండి ఉన్నప్పటికీ.. అందులో కేవలం 2.5 నుంచి 3 శాతం మాత్రమే తాగడానికి అనుకూలమైన తీపి నీరు. మిగిలిన 97 శాతం నీరు ఉప్పగా ఉండి దేనికీ పనికిరాదు. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. నీటిని ఎలా పొదుపు చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి. ఇదే తరుణంలో ఆస్ట్రేలియా కూడా తీవ్రమైన జల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ దేశంలో లభ్యమయ్యే నీటిలో దాదాపు 70 శాతం కేవలం వ్యవసాయ రంగానికే ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో నీటి వృధాను అరికట్టడంతో పాటు పర్యావరణహిత విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు  ఫ్లోటింగ్ ఫోటోవోల్టాయిక్స్ అంటే నీటిపై తేలియాడే సోలార్ ప్యానెళ్ల సాంకేతికతను తెరపైకి తెచ్చారు.

నీరు ఆవిరి కాకుండా అడ్డుకునే సోలార్ గొడుగులు
ఆస్ట్రేలియాలోని డ్యామ్‌లు, జలాశయాల నుంచి తీవ్రమైన ఎండల కారణంగా ప్రతి ఏటా దాదాపు 1,400 గీగా లీటర్ల నీరు ఆవిరి రూపంలో గాల్లో కలిసిపోతోందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నష్టాన్ని నివారించడానికి నీటి వనరులపై ఈ తేలియాడే సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి నీటి ఉపరితలంపై ఒక కప్పులా పనిచేస్తూ, సూర్యరశ్మి నేరుగా నీటిపై పడకుండా అడ్డుకుంటాయి. ఈ ప్యానెళ్లను తయారు చేసిన కంపెనీల సమాచారం ప్రకారం.. ఇవి నీరు ఆవిరి కావడాన్ని సగానికి పైగా తగ్గిస్తాయి. ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ కోసం ఆస్ట్రేలియన్ రినోవబుల్ ఎనర్జీ ఏజెన్సీ ఏకంగా 8.5 మిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని పెట్టింది. ముఖ్యంగా వ్యవసాయ సాగునీటి కాలువలు, చెరువుల వద్ద వీటిని విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారు.

పర్యావరణ పరిరక్షణతో పాటు వందలాది ఇళ్లకు ఉచిత కరెంట్
ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని సౌత్ విక్టోరియా పరిధిలో ఉన్న వార్నంబూల్ బ్రయర్లీ బేసిన్ వద్ద వానన్ వాటర్ కంపెనీ దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్ సిస్టమ్‌ను నడుపుతోంది. ఇక్కడ అమర్చిన 1,260 ప్రత్యేక ప్యానెళ్లు నేరుగా వచ్చే సూర్యకాంతినే కాకుండా, నీటి ఉపరితలం నుంచి పరావర్తనం (రిఫ్లెక్ట్) చెంది వచ్చే కాంతిని కూడా గ్రహించి ఏటా 6,00,000 కిలోవాట్-గంటల కంటే ఎక్కువ స్వచ్ఛమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. దీనివల్ల వాతావరణంలోకి విడుదలయ్యే దాదాపు 600 టన్నుల గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలు తగ్గుతున్నాయి. ఇదే విధంగా  గిప్స్‌లాండ్ వాటర్ సంస్థ కూడా 644 తేలియాడే ప్యానెళ్లను ఏర్పాటు చేసి, ప్రతిరోజూ దాదాపు 90 ఇళ్లకు సరిపడా ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది.

AI Data Centers : ప్రపంచ టెక్ రంగాన్ని వణికిస్తున్న గ్లోబల్ వార్మింగ్.. ఏఐ డేటా సెంటర్లను ముంచెత్తుతున్న హీట్‌వేవ్స్

ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్యానెళ్ల ప్రత్యేకత ఏంటి?
సాధారణంగా నీరు ఆవిరి కాకుండా ఉండేందుకు నీటిపై ప్లాస్టిక్ షీట్లు లేదా ఇతర రసాయనాలను వాడితే నీటి నాణ్యత దెబ్బతింటుంది. కానీ, ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్యానెళ్లు నీటి వనరులను పూర్తిగా కప్పివేయవు. కేవలం అవసరమైన మేరకే ఉపరితలాన్ని ఆక్రమిస్తాయి. దీనివల్ల నీటిలోకి గాలి, వెలుతురు సరిగ్గా అందుతాయి. ఫలితంగా నీటిలో చెడు నాచు (అల్గే) పేరుకుపోయే ప్రమాదం ఉండదు. నీరు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటుంది. నీటి పొదుపుతో పాటు కాలుష్య రహిత విద్యుత్ ఇస్తుండటంతో ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఈ సరికొత్త టెక్నాలజీని చాలా వేగంగా విస్తరిస్తున్నారు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »