భారతదేశంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వంటి షార్ట్ వీడియోల వినియోగం గ్రామాల్లోనూ విపరీతంగా పెరిగిపోయిందని, పల్లెలకు, పట్నాలకు మధ్య ఉన్న వ్యత్యాసం దాదాపు తగ్గిపోయిందని ఈ సర్వే స్పష్టం చేసింది.
Instagram Reels : ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్లలో వీడియోలు చూడటం, సోషల్ మీడియా వాడటం అనేది కేవలం హైదరాబాద్, ముంబై, బెంగళూరు లాంటి మెట్రో సిటీలకే పరిమితం అని అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పూర్తిగా మారిపోయాయి. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా నిర్వహించిన ఒక సరికొత్త అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. భారతదేశంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వంటి షార్ట్ వీడియోల వినియోగం గ్రామాల్లోనూ విపరీతంగా పెరిగిపోయిందని, పల్లెలకు, పట్నాలకు మధ్య ఉన్న వ్యత్యాసం దాదాపు తగ్గిపోయిందని ఈ సర్వే స్పష్టం చేసింది.
మెటా-ఇప్సోస్ సర్వేలో వెల్లడైన అసలు నిజాలు
మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇప్సోస్ సహాయంతో మెటా ఈ సర్వేను నిర్వహించింది. ఇండియాలోని 23 నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన దాదాపు 4,000 కంటే ఎక్కువ మందిపై ఈ రీసెర్చ్ చేశారు. ఈ సర్వేలో తేలింది ఏంటంటే, మనదేశంలో సోషల్ మీడియా వాడుతున్న వారిలో ఏకంగా 97 శాతం మంది ప్రతిరోజూ మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్) ప్లాట్‌ఫామ్స్‌లో వీడియోలు చూస్తున్నారు. నగరాల్లో ఈ రేటు 98 శాతంగా ఉంటే, గ్రామాల్లో 94 శాతంగా ఉంది. దీన్నిబట్టి పల్లెటూరి జనాలు కూడా వీడియోలు చూడటంలో నగరవాసులతో పోటీ పడుతున్నారని అర్థమవుతోంది.
యువత, మహిళల్లో రీల్స్ క్రేజ్
ముఖ్యంగా జెన్ జీ (Gen Z), మహిళలు, అలాగే సమాజంలో మంచి ఆదాయం ఉన్న ప్రీమియం క్లాస్ ప్రజలు ప్రతిరోజూ వీడియోలు చూస్తున్నట్లు మెటా తెలిపింది. ఇందులో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ హవానే ఎక్కువగా నడుస్తోంది. యువతలో 89 శాతం మంది, మహిళల్లో 85 శాతం మంది ప్రతిరోజూ రీల్స్ చూస్తూ గడుపుతున్నారు. కేవలం టైమ్ పాస్ కోసమే కాకుండా కొత్త ట్రెండ్స్ తెలుసుకోవడానికి, క్రియేటర్లను ఫాలో అవ్వడానికి ఈ షార్ట్ వీడియోలు ప్రధాన వేదికగా మారాయి.
రీల్స్ ద్వారా షాపింగ్ విప్లవం
ఈ సర్వేలో బయటపడిన మరో పెద్ద షాకింగ్ విషయం ఏంటంటే, ఇన్‌స్టా రీల్స్ ఇప్పుడు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మాత్రమే కాకుండా, ఒక షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లా కూడా మారిపోతోంది. దీనిపై మెటా ఇండియా డైరెక్టర్ సౌగతో భౌమిక్ మాట్లాడుతూ.. రీల్స్ అనేది ఇప్పుడు క్రియేటర్స్, సంస్కృతి, వ్యాపారాల కలయికగా మారిపోయిందని చెప్పారు. బ్రాండ్స్ తమ వస్తువులను ప్రమోట్ చేసుకోవడానికి ఇదొక గోల్డెన్ ఛాన్స్ అని ఆయన అన్నారు. ప్రయాణికులు లేదా కస్టమర్లు రీల్స్ చూస్తూనే వస్తువులను ఇష్టపడుతున్నారని, వాటిని నమ్మి కొనుగోలు కూడా చేస్తున్నారని ఆయన వివరించారు.
భారతీయులు ఎక్కువగా చూసే కంటెంట్ ఇదే
మన దేశంలోని సోషల్ మీడియా లవర్స్ రీల్స్‌లో ఎలాంటి కంటెంట్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారో కూడా ఈ సర్వేలో తేలింది. బ్యూటీ అండ్ మేకప్, ఫ్యాషన్ ట్రెండ్స్, లైఫ్ స్టైల్, ఫిట్‌నెస్, కామెడీ, స్పోర్ట్స్ కేటగిరీలకు సంబంధించిన వీడియోలకు ఇండియాలో విపరీతమైన డిమాండ్ ఉంది. మిగిలిన షార్ట్ వీడియో యాప్స్‌తో పోలిస్తే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లోనే క్రియేటర్లకు 60 శాతం ఎక్కువ యూజర్ ఎంగేజ్‌మెంట్ లభిస్తోందని మెటా వెల్లడించింది.
కొనుగోళ్ల నిర్ణయాలను మారుస్తున్న రీల్స్
చిన్న చిన్న రీల్స్ చూసి కస్టమర్లు ఎంతలా ప్రభావితం అవుతున్నారంటే.. దాదాపు 81 శాతం మంది కొత్త ప్రొడక్ట్స్‌ను కేవలం రీల్స్ ద్వారానే గుర్తిస్తున్నారు. 66 శాతం మంది ఆ వస్తువులను కొనాలా వద్దా అని ఆలోచనలో పడుతుండగా, ఏకంగా 47 శాతం మంది రీల్స్ చూసిన తర్వాతే ఆ వస్తువును కొనేస్తున్నారు. ముఖ్యంగా ఈ-కామర్స్ షాపింగ్, ఆటోమొబైల్ (కార్లు, బైకులు), ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి రంగాల్లో రీల్స్ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తానికి ఇన్‌స్టా రీల్స్ భారతీయుల దైనందిన జీవితంలో ఒక ముఖ్య భాగమైపోయాయని ఈ రిపోర్ట్ తేల్చేసింది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999