షావోమి భారతీయ వినియోగదారుల కోసం సరికొత్త షావోమి టీవీ FX మినీ ఎల్‌ఈడీ సిరీస్‌ను గురువారం అధికారికంగా లాంచ్ చేసింది.
Photo Credit: Xiaomi
Xiaomi TV FX Mini LED Series includes 43-inch, 55-inch, 65-inch, and 75-inch options
Xiaomi TV : ప్రముఖ టెక్ దిగ్గజం షావోమి భారతీయ వినియోగదారుల కోసం సరికొత్త షావోమి టీవీ FX మినీ ఎల్‌ఈడీ సిరీస్‌ను గురువారం అధికారికంగా లాంచ్ చేసింది. హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను సరికొత్త స్థాయికి తీసుకెళ్లేలా ఈ లైనప్‌ను డిజైన్ చేశారు. ఇందులో కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా 43 ఇంచులు, 55 ఇంచులు, 65 ఇంచులు, 75 ఇంచుల స్క్రీన్ సైజులలో ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చారు. అధునాతన క్వాంటం డాట్ (QD) మినీ ఎల్‌ఈడీ డిస్‌ప్లే టెక్నాలజీ, ఇన్-బిల్ట్ అమెజాన్ ఫైర్ టీవీ సపోర్ట్ వంటి ప్రీమియం ఫీచర్లు ఈ టీవీల సొంతం.
భారత మార్కెట్లో ఈ టీవీల సాధారణ ధరలను చూసుకుంటే.. 43 ఇంచుల మోడల్ ధర రూ.32,999గా ఉంది. అలాగే 55 ఇంచుల వేరియంట్ రూ.44,999, 65 ఇంచుల వేరియంట్ రూ.64,999, టాప్-ఎండ్ 75 ఇంచుల మోడల్ రూ.84,999 ధరకు లభిస్తాయి. అయితే, కస్టమర్ల కోసం షావోమి పరిమిత కాలం పాటు అదిరిపోయే ఇంట్రోడక్టరీ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద 43 ఇంచుల మోడల్‌ను రూ.29,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే మిగిలిన 55, 65, 75 ఇంచుల మోడళ్లు వరుసగా రూ.39,999, రూ.59,999, రూ.79,999లకే లభిస్తాయి. అంటే కస్టమర్లకు రూ.3,000 నుంచి రూ.5,000 వరకు లాభం చేకూరనుంది. జూన్ 11 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, షావోమి అఫీషియల్ స్టోర్లలో వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
ఈ స్మార్ట్ టీవీ సిరీస్‌లో 4K అల్ట్రా హెచ్‌డీ (3,840×2,160 పిక్సెల్స్) డిస్‌ప్లేను అందించారు. ఇది 178 డిగ్రీల వైడ్ వీవింగ్ యాంగిల్‌ను కలిగి ఉంటుంది. మెరుగైన కాంట్రాస్ట్, బ్రైట్‌నెస్ కంట్రోల్ కోసం ఇందులో ఫుల్ అర్రే లోకల్ డిమ్మింగ్, మినీ ఎల్‌ఈడీ బ్యాక్‌లైటింగ్ టెక్నాలజీలను వాడారు. ఇవి 1.07 బిలియన్ కలర్స్‌ను సపోర్ట్ చేస్తాయి. ఇక గేమింగ్ ఇష్టపడే వారి కోసం 55, 65, 75 ఇంచుల మోడళ్లలో 120Hz డిఎల్‌జీ (DLG) గేమ్ మోడ్‌ను అందించారు. అయితే 43 ఇంచుల బేస్ మోడల్ మాత్రం 60Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్మూత్ విజువల్స్ కోసం మెమ్స్ టెక్నాలజీ, ఆటో లో లేటెన్సీ మోడ్, కళ్లకు రక్షణగా ఐ కేర్ మోడ్‌లు కూడా ఉన్నాయి.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ టీవీలు క్వాడ్-కోర్ కార్టెక్స్-A55 ప్రాసెసర్‌తో పాటు మాలి-G52 గ్రాఫిక్స్ కార్డ్‌తో రన్ అవుతాయి. ఇందులో 2GB రామ్, అప్లికేషన్లు, వీడియోల స్టోరేజ్ కోసం 32GB ఇంటర్నల్ మెమరీని ఇచ్చారు. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ సిరీస్ అమెజాన్ ఫైర్ టీవీ ప్లాట్‌ఫారమ్‌పై పనిచేస్తుంది. దీని ద్వారా యూజర్లు ఏకంగా 12,000 కంటే ఎక్కువ యాప్‌లను యాక్సెస్ చేయవచ్చు. ఇందులో అలెక్సా వాయిస్ అసిస్టెంట్, యాపిల్ ఎయిర్‌ప్లే 2, యూజర్ ప్రొఫైల్స్, పేరెంటల్ కంట్రోల్స్, క్విక్ సెట్టింగ్స్ మెనూ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.
సౌండ్ క్వాలిటీ విషయంలో కూడా షావోమి రాజీ పడలేదు. 43 ఇంచుల మోడల్‌లో 20W టూ-స్పీకర్ సిస్టమ్ ఉండగా.. మిగిలిన పెద్ద స్క్రీన్ మోడళ్లలో రెండు ఫుల్-రేంజ్ స్పీకర్లు, రెండు హై-ఫ్రీక్వెన్సీ డ్రైవర్లతో కూడిన ఫోర్-డ్రైవర్ ఆడియో సెటప్‌ను అందించారు. ఇవి డాల్బీ ఆడియో, డీటీఎస్:ఎక్స్, డీటీఎస్ వర్చువల్:ఎక్స్ టెక్నాలజీలను సపోర్ట్ చేస్తాయి. లుక్స్ పరంగా ఈ టీవీలు ప్రీమియం మెటల్ బెజెల్-లెస్ డిజైన్‌తో వస్తాయి. దీనివల్ల 43, 55 ఇంచుల మోడళ్లలో 97 శాతం, 65, 75 ఇంచుల మోడళ్లలో ఏకంగా 98 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో లభిస్తుంది.
ఈ స్మార్ట్ టీవీలలో కనెక్టివిటీ కోసం అన్ని రకాల ఆప్షన్లను ఇచ్చారు. ఇందులో డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, మూడు హెచ్‌డీఎమ్‌ఐ పోర్టులు (ఒకటి ఇ-ఆర్క్ సపోర్ట్‌తో), రెండు యూఎస్‌బీ 2.0 పోర్టులు, ఒక ఇథర్నెట్ పోర్ట్, ఏవీ ఇన్‌పుట్, ఆప్టికల్ ఆడియో పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఇక బరువు విషయానికి వస్తే.. స్టాండ్ లేకుండా 43 ఇంచుల మోడల్ 7.1 కేజీలు, 55 ఇంచుల మోడల్ 11.4 కేజీలు, 65 ఇంచుల మోడల్ 17 కేజీలు, పెద్దదైన 75 ఇంచుల మోడల్ 23.1 కేజీల బరువును కలిగి ఉంటాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999