కొత్తగా వచ్చిన షావోమి 17టి బేస్ వేరియంట్ (12GB రామ్ + 256GB స్టోరేజ్) ధర రూ. 59,999 గా ఉంది. దీని 512GB మోడల్ ధర రూ. 64,999. ఇది బ్లాక్, బ్లూ, వైలెట్ రంగుల్లో దొరుకుతుంది.
Xiaomi 17T runs on a MediaTek Dimensity 8500-Ultra SoC
Smartphone Comparison : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రీమియం మిడ్-రేంజ్ విభాగంలో పోటీ ఒక్కసారిగా హీటెక్కింది. షావోమి కంపెనీ తన సరికొత్త షావోమి 17టి మొబైల్‌ను లైకా కెమెరాలతో లాంచ్ చేయడంతో.. ఈ సెగ్మెంట్‌లో ఉన్న వివో X200T, శాంసంగ్ గెలాక్సీ A57 5G ఫోన్ల మధ్య త్రిముఖ పోరు మొదలైంది. ఈ మూడు ఫోన్లు కూడా 120Hz రీఫ్రెష్ రేట్ డిస్‌ప్లేలు, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాలతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అయితే వీటి ధరలు, ఫీచర్లు, పర్ఫార్మెన్స్ పరంగా ఏ ఫోన్ ఏ విషయంలో బెస్ట్ అనేది వివరంగా చూద్దాం.
ధరల పరంగా ఏది ఎంత ఉందంటే?
మొదటగా ధరల విషయానికి వస్తే.. కొత్తగా వచ్చిన షావోమి 17టి బేస్ వేరియంట్ (12GB రామ్ + 256GB స్టోరేజ్) ధర రూ. 59,999 గా ఉంది. దీని 512GB మోడల్ ధర రూ. 64,999. ఇది బ్లాక్, బ్లూ, వైలెట్ రంగుల్లో దొరుకుతుంది. వివో X200T ధర కూడా సేమ్ 12GB + 256GB మోడల్‌కు రూ. 59,999 కాగా, 512GB మోడల్ ధర రూ. 69,999 గా ఉంది. ఇది లైలాక్, బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. ఇక అన్నింటికంటే తక్కువ ధరలో శాంసంగ్ గెలాక్సీ A57 దొరుకుతోంది. దీని 8GB + 256GB బేస్ మోడల్ ధర రూ. 56,999 కాగా, 12GB + 256GB మోడల్ ధర రూ. 62,499 గా కంపెనీ నిర్ణయించింది.
డిస్‌ప్లే, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి?
డిస్‌ప్లేల పరంగా మూడు ఫోన్లు అద్భుతంగా ఉన్నాయి. షావోమి 17టి ఫోన్ 6.59-ఇంచుల 1.5K అమోలెడ్ స్క్రీన్, 3,500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. వివో X200T కొంచెం పెద్దదైన 6.67-ఇంచుల స్క్రీన్, ఏకంగా 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ A57 అత్యంత పెద్దదైన 6.7-ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్+ డిస్‌ప్లేతో వస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే మూడూ ఆండ్రాయిడ్ 16 పైనే పనిచేస్తాయి. కానీ, శాంసంగ్ ఫోన్ కొంటే ఏకంగా 6 తరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని కంపెనీ హామీ ఇవ్వడం ఒక పెద్ద ప్లస్ పాయింట్.
ప్రాసెసర్లు, బ్యాటరీ కెపాసిటీలు
పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే వివో X200T టాప్‌లో ఉంది. ఇందులో అత్యంత పవర్‌ఫుల్ 3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ చిప్‌సెట్ ఉంది. దీని తర్వాత షావోమి 17టి లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500-ఆల్ట్రా ప్రాసెసర్ ఉండగా, శాంసంగ్ ఫోన్ తన సొంత ఎగ్జినోస్ 1680 చిప్‌తో నడుస్తుంది. అయితే బ్యాటరీ విభాగంలో షావోమి 17టి కి తిరుగులేదు. ఇందులో ఏకంగా 6,500mAh భారీ బ్యాటరీతో పాటు 67W ఫాస్ట్ చార్జింగ్ ఇచ్చారు. వివోలో 6,200mAh బ్యాటరీతో 90W వైర్డ్, 40W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. శాంసంగ్ మాత్రం కేవలం 5,000mAh బ్యాటరీ, 45W చార్జింగ్‌తో కాస్త వెనుకబడింది.
కెమెరా మాయాజాలం, బరువు
ఫొటోగ్రఫీ లవర్స్ కోసం షావోమి, వివో కంపెనీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. షావోమి 17టి వెనుక వైపు లైకా బ్రాండింగ్ ఉన్న 50MP ప్రైమరీ, 50MP పెరిస్కోప్ టెలిఫోటో, 12MP అల్ట్రా-వైడ్ కెమెరాలను కలిగి ఉంది. అలాగే వివో X200T జైస్ (Zeiss) బ్రాండింగ్‌తో మూడు 50MP కెమెరాలను (ప్రైమరీ, అల్ట్రా-వైడ్, టెలిఫోటో) ఆఫర్ చేస్తోంది. శాంసంగ్ A57 లో 50MP ప్రైమరీ, 12MP అల్ట్రా-వైడ్, 5MP మాక్రో కెమెరా ఉన్నాయి. ఇక ఫోన్ బరువు చూస్తే.. శాంసంగ్ కేవలం 179 గ్రాములతో చాలా లైట్‌వెయిట్‌గా ఉంది. షావోమి 200 గ్రాములు, వివో 203 గ్రాముల బరువుతో ఉన్నాయి.
మీరు ఏ ఫోన్ కొనుగోలు చేయాలి?
ఈ మూడింటిలో ఏ ఫోన్ కొనాలనేది మీ వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది. మీకు అద్భుతమైన గేమింగ్ పర్ఫార్మెన్స్, చాలా ఎక్కువ సమయం వచ్చే భారీ బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటే.. కళ్ళు మూసుకుని షావోమి 17టి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అల్ట్రా-ప్రీమియం కెమెరా క్వాలిటీ, సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్, వైర్‌లెస్ చార్జింగ్ కావాలంటే వివో X200T బెస్ట్ ఛాయిస్ అవుతుంది. అలా కాకుండా, తక్కువ బరువు ఉండి.. ఆరేళ్ల పాటు ఎలాంటి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల టెన్షన్ లేకుండా లాంగ్ రన్ కోసం ఫోన్ కావాలనుకుంటే శాంసంగ్ గెలాక్సీ A57 మీకు కరెక్ట్ ఆప్షన్.
FAQ
1. షావోమి 17టి ఫోన్ ఏ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది?
షావోమి 17టి స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500-ఆల్ట్రా ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
2. ఈ మూడింటిలో ఏ ఫోన్‌కు అతిపెద్ద బ్యాటరీ ఉంది?
షావోమి 17టి కి అత్యంత పెద్ద బ్యాటరీ ఉంది. ఇందులో ఏకంగా 6,500mAh సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు.
3. షావోమి 17టి ఏయే రంగుల్లో అందుబాటులో ఉంది?
ఈ ఫోన్ భారత మార్కెట్లో బ్లాక్, బ్లూ, వైలెట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
4. ఈ మూడు ఫోన్లలో అన్నింటికంటే తక్కువ ధర కలిగిన ఫోన్ ఏది?
శాంసంగ్ గెలాక్సీ A57 5G అన్నింటికంటే తక్కువ ధరను కలిగి ఉంది. దీని బేస్ వేరియంట్ ధర రూ.56,999గా ఉంది.
ప్రకటన
ప్రకటన
Bybit Lists Western Union’s USDPT Stablecoin for Trading and Transfers
Instagram Reels Influencing Nearly Half of Purchase Decisions in India, Meta Study Claims
OnePlus Turbo 6X, OnePlus Turbo 6X Pro Colour Options, Price Range, Key Specifications Teased