ముఫ్తీ తాకీ ఉస్మాని తన ఫత్వాలో క్రిప్టో కరెన్సీల స్వభావాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
Photo Credit: Crypto Currency
Crypto Currency
Crypto Currency : గత కొన్నేళ్లుగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న పొరుగు దేశం పాకిస్తాన్‌లో క్రిప్టో కరెన్సీ మార్కెట్ చాలా వేగంగా విస్తరిస్తోంది. సంక్షోభంలో ఉన్న చాలా మంది యూత్ దీని వైపు ఆకర్షితులవుతున్నారు. అయితే అక్కడ క్రిప్టోల వాడకం పెరగడంపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ ముఫ్తీలలో ఒకరైన ముఫ్తీ మొహమ్మద్ తాకీ ఉస్మాని క్రిప్టో కరెన్సీపై సంచలన ఫత్వా జారీ చేశారు. ఇస్లామిక్ చట్టమైన షరియా ప్రకారం క్రిప్టో కరెన్సీల వాడకం.. వాటితో వ్యాపారం చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. దారుల్ ఉలూమ్ కరాచీ అధ్యక్షుడిగా ఉన్న ఉస్మాని, ఇస్లామిక్ సూత్రాల ప్రకారం డిజిటల్ కరెన్సీలను అసలైన సంపదగా గుర్తించలేమని తేల్చి చెప్పారు.
క్రిప్టో అనేది అంకెల రికార్డు మాత్రమే, అది ఆస్తి కాదు
ముఫ్తీ తాకీ ఉస్మాని తన ఫత్వాలో క్రిప్టో కరెన్సీల స్వభావాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కంప్యూటర్ స్క్రీన్ లేదా ఏదైనా అకౌంట్‌లో కనిపించే కొన్ని అంచనా సంఖ్యల రికార్డు తప్ప, క్రిప్టోలకు ఎలాంటి భౌతిక రూపం గానీ, నిజమైన విలువ గానీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అందువల్ల షరియా చట్టాల ప్రకారం క్రిప్టో కరెన్సీని నిజమైన ఆస్తిగా భావించలేమన్నారు. అది యూఎస్‌డీటీ అయినా లేదా మరే ఇతర క్రిప్టో టోకెన్ అయినా సరే.. వాటిని ఉపయోగించి ఎలాంటి వస్తువులను, సేవలను కొనుగోలు చేయడానికి ఇస్లాం అనుమతించదని ఆయన స్పష్టం చేశారు.
పుస్తకాలు కొన్న వ్యక్తికి ముఫ్తీ ఇచ్చిన షాకింగ్ సలహా
ఇస్లామిక్ చట్టాల ప్రకారం క్రిప్టోల ద్వారా జరిపే లావాదేవీలు చెల్లుతాయా లేదా అని ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ముఫ్తీ ఈ ఫత్వాను జారీ చేశారు. తాను క్రిప్టో కరెన్సీని ఉపయోగించి రెండు పుస్తకాలను కొనుగోలు చేశానని, అది సరైనదేనా అని సదరు వ్యక్తి ముఫ్తీని ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన ముఫ్తీ ఉస్మాని.. క్రిప్టో కరెన్సీ ద్వారా చేసిన ఆ కొనుగోలు చెల్లదని, కాబట్టి ఆ రెండు పుస్తకాలను వెంటనే విక్రేతకు తిరిగి ఇచ్చేయాలని సంచలన సలహా ఇచ్చారు. ఈ ఫత్వాతో పాకిస్తాన్‌లోని క్రిప్టో ఇన్వెస్టర్లలో పెద్ద చర్చ మొదలైంది.
Samsung : శాంసంగ్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. గెలాక్సీ S27 ప్రో ఫీచర్లలో భారీ కోత
డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో సంస్థతో పాకిస్తాన్ ప్రభుత్వం చేతులు కలపడంపై రగడ
ఒకవైపు దేశంలో ప్రముఖ ముఫ్తీలు క్రిప్టో కరెన్సీ వద్దు అంటుంటే.. మరోవైపు పాకిస్తాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం క్రిప్టోలతో సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన క్రిప్టో సంస్థ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనుబంధ సంస్థ అయిన ఎస్సీ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ తో పాక్ ప్రభుత్వం ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది. విదేశీ చెల్లింపులను సులభతరం చేయడం కోసం డాలర్‌తో ముడిపడి ఉన్న USD1 స్టేబుల్‌కాయిన్ ను ఉపయోగించేందుకు ఈ డీల్ కుదిరింది. కాగా, ట్రంప్ ఫ్యామిలీకి చెందిన ఈ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థ ద్వారా గత ఏడాది ఆయనకు 50 కోట్ల డాలర్లకు పైగా ఆదాయం వచ్చినట్లు ఇటీవల విడుదలైన ఫైనాన్షియల్ నివేదికలలో వెల్లడైంది.
సౌదీ అరేబియా అలర్ట్ రూట్
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీలపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కేవలం పాకిస్తాన్‌లోనే కాకుండా మన పొరుగు దేశాలైన చైనా, బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ వంటి పలు దేశాలలో క్రిప్టో కరెన్సీ లావాదేవీలు, ట్రేడింగ్, మైనింగ్ సేవలను ఇప్పటికే పూర్తిగా చట్టవిరుద్ధంగా ప్రకటించారు. అయితే, ముస్లిం దేశాలకు కేంద్రంగా ఉన్న సౌదీ అరేబియా మాత్రం దీనిపై భిన్నంగా స్పందించింది. సౌదీకి చెందిన ప్రముఖ ముఫ్తీలు క్రిప్టో ట్రేడింగ్‌పై ఎలాంటి నిషేధాలు లేదా ఫత్వాలు ప్రకటించలేదు. క్రిప్టోలపై కఠినమైన బ్యాన్ విధించే పద్ధతికి స్వస్తి పలికి, సౌదీ అరేబియా అధికారులు ఈ డిజిటల్ కరెన్సీ మార్కెట్‌ను చాలా నిశితంగా గమనిస్తూ, అప్రమత్తమైన వ్యూహాన్ని అవలంబిస్తున్నారు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Vivo Pad FE Reportedly Surfaces on TDRA, TUV Certifications; Charging Specifications Revealed
OpenAI Lawsuit Says Employee Who Left for Apple Took Files About Unreleased Device