ఈ సరికొత్త ఎక్సోప్లానెట్ మన భూమికి సుమారు 25 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
Photo Credit: Space.com
Super Earth
Super Earth : అనంత విశ్వంలో భూమి కాకుండా మరెక్కడైనా జీవం ఉందా? గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారా? అనే ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో సైంటిస్టులు మరో కీలక మైలురాయిని అందుకున్నారు. అంతరిక్ష పరిశోధకులు సుదూర విశ్వంలో భూమిని పోలిన ఒక సరికొత్త ఖగోళ పిండాన్ని కనిపెట్టారు. అంతరిక్ష పరిభాషలో ఇటువంటి గ్రహాలను ఎక్సోప్లానెట్ అని పిలుస్తారు. స్పేస్.కామ్ నివేదికల ప్రకారం.. ఈ కొత్త గ్రహానికి GJ 3378b అని పేరు పెట్టారు. ఇది ఒక రాతి గ్రహం కావడం, ఇక్కడ జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉండటంతో శాస్త్రవేత్తల్లో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
ఈ సరికొత్త ఎక్సోప్లానెట్ మన భూమికి సుమారు 25 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంతరిక్ష కొలతల ప్రకారం ఈ దూరం చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే మనం ఉండే పాలపుంత గెలాక్సీనే దాదాపు 1 లక్ష కాంతి సంవత్సరాల మేర విస్తరించి ఉంది. అందువల్ల ఈ గ్రహాన్ని మనకు అత్యంత సమీపంలో ఉన్న పొరుగు గ్రహంగా భావిస్తున్నారు. GJ 3378b అనే ఈ గ్రహం అంతరిక్షంలోని కామెలోపార్డాలిస్ నక్షత్ర మండలంలో ఉన్న ఒక మసకపాటి ఎర్ర గుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. దీనిపై ఆయా దేశాల శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు సాగిస్తున్నారు.
ఈ వింత గ్రహాన్ని మొదట 2024 లో ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్తలు మౌనా కీయాలోని కెనడా-ఫ్రాన్స్-హవాయి టెలిస్కోప్ ద్వారా గుర్తించారు. అయితే ఆ సమయంలో దీని ద్రవ్యరాశి భూమి కంటే 5.26 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు లెక్కగట్టారు. దాంతో ఇది పూర్తిగా వాయువులతో నిండిన ఒక చిన్న మిని-నెప్చ్యూన్ గ్రహం అని భావించారు. కానీ ఇటీవల అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్తల బృందం రెండు వేర్వేరు అధునాతన టెలిస్కోప్‌లను ఉపయోగించి పాత అంచనాలను సరిచేసింది. ఈ తాజా పరిశోధనలో ఈ గ్రహం అసలు ద్రవ్యరాశి భూమి కంటే కేవలం 2.3 రెట్లు మాత్రమేనని తేలింది. అంటే ఇది వాయుగోళం కాదు, భూమి లాంటి గట్టి రాతి ఉపరితలం కలిగిన ఒక సూపర్-ఎర్త్ అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
iQOO Z11 Lite : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఐకూ బంపర్ ఆఫర్.. జూలై 24న భారత మార్కెట్లోకి ఐకూ Z11 లైట్ ఎంట్రీ
ఈ 'సూపర్ ఎర్త్' గ్రహం తన మాతృ నక్షత్రం చుట్టూ ఒక పూర్తి రౌండ్ కొట్టడానికి కేవలం 21 రోజుల సమయం మాత్రమే తీసుకుంటుంది. అంటే మన భూమిపై 21 రోజులు గడిస్తే.. ఆ గ్రహం మీద ఒక సంవత్సరం పూర్తయిపోతుందన్నమాట. అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం ఏంటంటే, ఈ గ్రహం తన నక్షత్రానికి హ్యాబిటబుల్ జోన్ లో ఉంది. అంటే ఇక్కడ నీరు ద్రవరూపంలో ఉండేందుకు, జీవం వృద్ధి చెందడానికి అవసరమైన ఉష్ణోగ్రతలు ఉండే ఛాన్స్ ఉంది. అయితే, ఈ గ్రహంపై దాని నక్షత్రం నుంచి నిరంతరం రేడియేషన్ పడుతూనే ఉన్నట్లు కూడా శాస్త్రవేత్తలు గమనించారు.
సాధారణంగా ఏదైనా గ్రహం తన నక్షత్రం ముందు నుంచి వెళ్తున్నప్పుడు, ఆ నక్షత్రం కాంతి కొద్దిగా తగ్గుతుంది. దాని ఆధారంగా గ్రహాలను గుర్తిస్తారు. కానీ ఈ 'GJ 3378b' గ్రహం అలా కాంతిని అడ్డుకోదు. మరి దీనిని ఎలా కనిపెట్టారంటే.. ఈ గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల దాని మాతృ నక్షత్రం కొద్దిగా తన స్థానం నుండి కదులుతుంది. ఈ చిన్నపాటి ఊగిసలాట వల్ల నక్షత్రం నుంచి వచ్చే కాంతి తరంగాల పొడవులో మార్పులు వస్తాయి. దీనినే సైన్స్ భాషలో డ్రాప్లర్ షిఫ్ట్ అని పిలుస్తారు. ఈ కాంతి తరంగాల స్పెక్ట్రాను కొలవడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ వింత గ్రహం ఉనికిని, దాని ఖచ్చితమైన బరువును కనిపెట్టగలిగారు. భవిష్యత్తులో విశ్వంలో జీవం ఉనికిని కనిపెట్టడంలో ఈ గ్రహం చాలా కీలక పాత్ర పోషించనుందని అంతరిక్ష నిపుణులు చెబుతున్నారు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999