Elon Musk : నెల రోజుల్లోనే ఎలాన్ మస్క్ ఆస్తి మటాష్.. ఏకంగా 600 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి

జూన్ నెలలో స్పేస్ ఎక్స్ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత మస్క్ నెట్ వర్త్ ఒకానొక దశలో ఏకంగా 1.33 ట్రిలియన్ (లక్ష కోట్ల) డాలర్లకు చేరి రికార్డు సృష్టించింది.

Elon Musk  : నెల రోజుల్లోనే ఎలాన్ మస్క్ ఆస్తి మటాష్.. ఏకంగా 600 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి

SpaceX

ముఖ్యాంశాలు
  • ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే ఎరుగని విధ్వంసం
  • ఒక్క నెలలోనే రూ. 50 లక్షల కోట్లకు పైగా కోల్పోయిన మస్క్
  • దలాల్ స్ట్రీట్ నుంచి వాల్ స్ట్రీట్ వరకు ఎలాన్ మస్క్ పతనంపైనే చర్చ
ప్రకటన

Elon Musk  : ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్‌కు గత నెల రోజుల కాలం తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం టెస్లా, రాకెట్ సంస్థ స్పేస్ ఎక్స్  షేర్లలో చోటుచేసుకున్న ఊహించని పతనం కారణంగా మస్క్ నికర ఆస్తి విలువ గత నెల రోజుల్లోనే ఏకంగా 600 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 50 లక్షల కోట్లకు పైగా) మేర పడిపోయింది. ఈ రెండు ప్రధాన కంపెనీల్లో ఎలాన్ మస్క్‌కు భారీ స్థాయిలో వాటాలు ఉన్నాయి.

స్పేస్ ఎక్స్ ఐపీఓ హంగామా 
జూన్ నెలలో స్పేస్ ఎక్స్ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత మస్క్ నెట్ వర్త్ ఒకానొక దశలో ఏకంగా 1.33 ట్రిలియన్ (లక్ష కోట్ల) డాలర్లకు చేరి రికార్డు సృష్టించింది. అయితే, ఆ తర్వాత వారం వ్యవధిలోనే స్పేస్ ఎక్స్ షేరు భారీ క్షీణతను చవిచూసింది. స్పేస్ ఎక్స్ ప్రతి షేరును 135 డాలర్ల ఐపీఓ ధరతో మార్కెట్లోకి తెచ్చి జూన్‌లో దాదాపు 75 బిలియన్ డాలర్లను సమకూర్చుకున్నారు. లిస్టింగ్ తర్వాత ఒకానొక దశలో ఈ షేరు 225 డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరి, సంస్థ మార్కెట్ విలువను అమెజాన్, మైక్రోసాఫ్ట్ కంటే ఎత్తుకు తీసుకెళ్లింది. కానీ ప్రస్తుతం ఐపీఓ ధర కంటే 20 శాతం కిందకు దిగజారి, గరిష్ఠ స్థాయి నుంచి ఏకంగా 1.2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌ను కోల్పోయింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ 1.5 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. గతేడాది ఈ సంస్థ రూ. 4.9 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూడటంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది.

iQOO Z11  : చైనాలో ఒకలా, ఇండియాలో ఇంకోలా.. ఐకూ Z11 కొత్త లుక్ అదిరింది భయ్యా

టెస్లా నష్టాలు.. తగ్గని ఎలాన్ మస్క్ క్రేజ్ 
మరొకవైపు ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా కూడా మస్క్ సంపదను దెబ్బతీసింది. ఇటీవల కంపెనీ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించినప్పటి నుంచి టెస్లా షేరు దాదాపు 20 శాతం క్షీణించింది. ఇటీవల కాలంలో మస్క్ తన దృష్టిని ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానమస్ డ్రైవింగ్, రోబోటిక్స్ వైపు మళ్లించినప్పటికీ ఇన్వెస్టర్లు మాత్రం ఊరట చెందడం లేదు.

ఈ పరిణామాలన్నింటి ఫలితంగా ఎలాన్ మస్క్ ప్రస్తుత నికర ఆస్తి విలువ దాదాపు 684 బిలియన్ డాలర్లకు పడిపోయింది. సంపదలో ఇంత భారీ కోత పడినప్పటికీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కేబినెట్‌లో పనిచేసిన అనుభవం ఉన్న ఎలాన్ మస్క్, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా తన మొదటి స్థానాన్ని ఇప్పటికీ పటిష్ఠంగానే నిలబెట్టుకోవడం విశేషం.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »