Google Maps Hack : హైవే ప్రయాణాల్లో టోల్ ట్యాక్స్ బాదుడుకు బ్రేక్.. గూగుల్ మ్యాప్స్‌లో అదిరిపోయే ట్రిక్

Google Maps में मौजूद Avoid Tolls फीचर की मदद से आप टोल रोड से बचते हुए रूट खोज सकते हैं। जानिए इसे ऑन करने का आसान तरीका।

Google Maps Hack : హైవే ప్రయాణాల్లో టోల్ ట్యాక్స్ బాదుడుకు బ్రేక్.. గూగుల్ మ్యాప్స్‌లో అదిరిపోయే ట్రిక్

Photo Credit: Unsplash/ socialincome

Google Maps

ముఖ్యాంశాలు
  • హైవే ప్రయాణాల్లో టోల్ ట్యాక్స్ బాదుడుకు బ్రేక్
  • టోల్ ఫీజు కట్టకుండానే గమ్యస్థానానికి చేరండి.
  • గూగుల్ మ్యాప్స్‌లో అదిరిపోయే ట్రిక్!
ప్రకటన

Google Maps Hack : సొంత వాహనాల్లో లాంగ్ జర్నీలు లేదా హైవేలపై ప్రయాణం చేసేవారికి టోల్ ట్యాక్స్ అనేది పెద్ద తలనొప్పిగా మారింది. పెట్రోల్, డీజిల్ ఖర్చుల కంటే కూడా కొన్నిసార్లు ఈ టోల్ ప్లాజాల వద్ద కట్టే ఫీజే మన ట్రావెల్ బడ్జెట్‌ను భారీగా పెంచేస్తుంది. చాలామంది సమయం ఆదా అవుతుందని నేషనల్ హైవేలను ఎంచుకుంటారు కానీ, అక్కడ పడే వాతకు జేబులు ఖాళీ అవ్వాల్సిందే. ఒకవేళ మీకు గమ్యస్థానానికి చేరుకోవడానికి కాస్త సమయం ఉన్నా పర్లేదు, డబ్బులు ఆదా అవ్వడమే ముఖ్యం అనుకుంటే గూగుల్ మ్యాప్స్‎లో ఒక అద్భుతమైన ఫీచర్ దాగి ఉంది. దీని సహాయంతో ఒక్క రూపాయి కూడా టోల్ కట్టకుండా ఫ్రీగా వెళ్లే దారులను మనం సులభంగా కనుగొనవచ్చు.

గూగుల్ మ్యాప్స్‌లో టోల్ లేని దారిని ఎలా సెట్ చేసుకోవాలి?
ఈ స్మార్ట్ ఫీచర్‌ను ఉపయోగించుకోవడం చాలా సులభం. దీనికోసం మీరు ఎలాంటి అదనపు యాప్స్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీ మొబైల్‌లో ఉన్న గూగుల్ మ్యాప్స్ యాప్ ద్వారానే ఈ సెట్టింగ్ మార్చుకోవచ్చు.
* మొదటగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ యాప్‌ను ఓపెన్ చేయండి.
* పైన ఉండే సెర్చ్ బార్‌లో మీరు వెళ్లాలనుకుంటున్న ఊరు లేదా లొకేషన్ పేరును టైప్ చేయండి.
* లొకేషన్ వచ్చిన తర్వాత కింద కనిపించే  డైరెక్షన్స్  ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* ఆ తర్వాత మీరు కార్ లో వెళ్తున్నారా లేదా బైక్ పై వెళ్తున్నారా అనే వెహికల్ మోడ్‌ను సెలెక్ట్ చేసుకోండి.
* ఇప్పుడు స్క్రీన్ పైభాగంలో కుడి వైపున కనిపించే త్రీ డాట్స్ పై టాప్ చేయండి.
* అక్కడ వచ్చే మెనూలో రూట్ ఆప్షన్స్ లేదా ఆప్షన్స్ లోకి వెళ్లాలి.
* అందులో మీకు అవాయిడ్ టోల్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని ఆన్ చేయండి.
* అంతే, క్షణాల్లో గూగుల్ మ్యాప్స్ మీ రూట్‌ను రీఫ్రెష్ చేసి, మార్గంలో ఎక్కడా టోల్ ప్లాజాలు లేని సరికొత్త దారిని మీకు చూపిస్తుంది.

Amazon : బ్యాంక్ కార్డు ఉంటే అదనపు డిస్కౌంట్.. ఈ సేల్‌లో అస్సలు మిస్ అవ్వకూడని టాప్ డీల్స్ ఇవే

కార్, బైక్.. అన్ని వాహనాలకూ ఈ ఫీచర్ వర్తిస్తుంది
ఈ ఆప్షన్ కేవలం కార్లకే కాకుండా బైక్ రైడర్లకు, ఇతర కమర్షియల్ వాహనదారులకు కూడా సమానంగా పనిచేస్తుంది. కొత్త నగరాలకు వెళ్లేటప్పుడు లేదా సుదీర్ఘమైన రోడ్ ట్రిప్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ ట్రిక్ ఉపయోగించడం వల్ల వందల నుంచి వేల రూపాయల వరకు టోల్ ఫీజును ఆదా చేసుకోవచ్చు. ప్రయాణ ఖర్చులను తగ్గించుకోవడానికి ఇదొక స్మార్ట్ ఐడియా అని చెప్పవచ్చు.

టోల్ ఫ్రీ రూట్ ఎల్లప్పుడూ బెస్టేనా?
అయితే ఇక్కడ వాహనదారులు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. టోల్ లేని దారులు ఎల్లప్పుడూ మెరుగ్గా ఉంటాయని చెప్పలేం. ఎందుకంటే టోల్ రోడ్లు సాధారణంగా సింగిల్ లైన్ లేదా పాత రోడ్ల గుండా వెళ్తుంటాయి. దీనివల్ల కొన్నిసార్లు ప్రయాణ దూరం పెరగడమే కాకుండా, విపరీతమైన ట్రాఫిక్ కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే హైవేలతో పోలిస్తే రోడ్లు అంతగా బాగుండకపోవచ్చు. కాబట్టి ప్రయాణం ప్రారంభించే ముందే గూగుల్ మ్యాప్స్‌లో టోల్ రూట్, టోల్ లేని రూట్ రెండింటికీ చూపిస్తున్న దూరం, పట్టే సమయాన్ని ఒకసారి సరిపోల్చుకుని ఏది బెస్ట్ అనిపిస్తే ఆ దారిలో వెళ్లడం మంచిది.

ఈ చిన్న జాగ్రత్తలు తప్పనిసరి
గూగుల్ మ్యాప్స్ మనకు టోల్ ప్లాజాలు లేని దారులను చూపించడానికి గరిష్టంగా ప్రయత్నిస్తుంది. కానీ కొన్ని గ్రామీణ ప్రాంతాలలో లేదా అడవుల గుండా వెళ్లే దారులలో ప్రత్యామ్నాయ రోడ్లు లేకపోవడం వల్ల వేరే దారి లేక మళ్లీ టోల్ రోడ్డుకే మ్యాప్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ప్రయాణం మొదలుపెట్టే ముందే పూర్తి రూట్ మ్యాప్‌ను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు సాగడం ఉత్తమం.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Human Fridge : ఎండదెబ్బకు జపాన్ మాస్టర్ ప్లాన్.. మనుషులను కూల్ చేసే హ్యూమన్ ఫ్రిడ్జ్ వచ్చేసింది
  2. Oppo F35 Series : పండుగ సేల్స్ ముందే ఒప్పో బిగ్ ప్లాన్..  వచ్చే నెలలోనే మార్కెట్లోకి  రెండు పవర్ ఫుల్ ఫోన్లు
  3. Boltt Evo 4G : ఐఫోన్ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు బోల్ట్ ఫోన్ రెడీ.. ఫస్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్
  4. EV Sales : ఈవీ మార్కెట్లో సరికొత్త రికార్డులు.. జులైలో ఏకంగా 81.6 శాతం పెరిగిన కార్ల విక్రయాలు
  5. Telegram : ఐఫోన్ యూజర్లకు మైండ్ బ్లాంకింగ్ షాక్.. యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ అవుట్
  6. Elon Musk : నెల రోజుల్లోనే ఎలాన్ మస్క్ ఆస్తి మటాష్.. ఏకంగా 600 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి
  7. iQOO Z11  : చైనాలో ఒకలా, ఇండియాలో ఇంకోలా.. ఐకూ Z11 కొత్త లుక్ అదిరింది భయ్యా
  8. WhatsApp Tricks : ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుందా ?.. ఈ చిన్న వాట్సాప్ సెట్టింగ్ మారితే మీ ప్రాబ్లమ్ సాల్వ్
  9. Flipkart Freedom Sale : ఆగస్ట్ 15కు బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో 65 ఇంచుల 4K స్మార్ట్ టీవీలపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు
  10. OnePlus N6x vs Vivo T5 Lite 5G vs Tecno Spark 50 5G : రూ. 20 వేల బడ్జెట్‌లో ఏది బెస్ట్?
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »