UPI Privacy : గూగుల్ పే, ఫోన్ పే వాడుతున్నారా? సెప్టెంబర్ 4 నుంచి యూపీఐ పేమెంట్లలో మైండ్ బ్లోయింగ్ చేంజ్

కస్టమర్ల ప్రైవసీని కాపాడటానికి UPI యాప్‌లు, బ్యాంకులకు NPCI ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

UPI Privacy :  గూగుల్ పే, ఫోన్ పే వాడుతున్నారా? సెప్టెంబర్ 4 నుంచి యూపీఐ పేమెంట్లలో మైండ్ బ్లోయింగ్ చేంజ్

Photo Credit: Unsplash/ David Dvoracek

UPI

ముఖ్యాంశాలు
  • ఇక నుంచి UPI లో ఫోన్ నంబర్లు కనపడవు
  • కోట్ల మంది ప్రైవసీకి పటిష్టమైన కోట నిర్మిస్తున్న NPCI
  • యూపీఐ డిజిటల్ పేమెంట్లలో రక్షణ వ్యవస్థకు కొత్త రూపు!
ప్రకటన

UPI Privacy : దేశంలో డిజిటల్ పేమెంట్లు వాడుతున్న కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత వివరాలకు మరింత భద్రత కల్పించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) చట్టం కింద, అన్ని ప్రముఖ UPI యాప్‌లు (Google Pay, PhonePe, Paytm వంటివి), భాగస్వామ్య బ్యాంకులతో కలిసి అవసరమైన మార్పులు చేసేందుకు చర్చలు జరుపుతోంది. ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం పేమెంట్స్ చేసే సమయంలో యూజర్ల మొబైల్ నంబర్లు, బ్యాంక్ వివరాలు ఇతరులకు కనబడకుండా చేయడం, డేటా చోరీని అరికట్టడమే.

మొబైల్ నంబర్లకు మాస్కింగ్ 
మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. కస్టమర్ల ప్రైవసీని కాపాడటానికి UPI యాప్‌లు, బ్యాంకులకు NPCI ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా యూపీఐ వ్యవస్థలో లావాదేవీలు చేయడానికి, వెరిఫికేషన్ చేయడానికి ఫోన్ నంబర్ కీలకంగా మారింది. అయితే దీనివల్ల వ్యక్తిగత నంబర్లు ఇతరులకు తెలిసిపోతున్నాయి. దీనికి చెక్ పెడుతూ, ఇకపై కస్టమర్ ఇంటర్‌ఫేస్, కమ్యూనికేషన్‌లో యూపీఐ ఐడీ, ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్లను మాస్క్ చేయాలని ఆదేశించింది. కొత్త నియమం ప్రకారం ఎదుటి యూజర్‌కి మీ ఫోన్ నంబర్‌లోని చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి.

క్యూఆర్ కోడ్ పేమెంట్లలోనూ సేఫ్టీ 
దుకాణాల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేసిన తర్వాత కూడా, స్వీకరించే యాప్‌లలో వినియోగదారుల పూర్తి ఫోన్ నంబర్ కనిపించకుండా చర్యలు తీసుకోనున్నారు. ఈ మార్పులను తమ సిస్టమ్‌లలో అమలు చేయడానికి బ్యాంకులు, యూపీఐ యాప్‌లకు NPCI సెప్టెంబర్ 4వ తేదీని గడువుగా (డెడ్‌లైన్) నిర్ణయించింది. ఈ గడువు నాటికి అన్ని యాప్‌లు కస్టమర్ ఫేసింగ్ ఇంటర్‌ఫేస్‌ను పూర్తిగా ప్రైవసీ ఫ్రెండ్లీగా మార్చాల్సి ఉంటుంది.

Lyne Blaster Series  : మైక్ ఉచితం, లైటింగ్ అదుర్స్..రూ. 1,999 లకే లైన్ నుంచి మైండ్ బ్లోయింగ్ స్పీకర్
 

యూజర్‌నేమ్ ఆధారిత UPI ID లకు ప్రమోషన్ 
దీనితో పాటు, ఫోన్ నంబర్‌ను VPA (వర్చువల్ పేమెంట్ అడ్రస్) గా ఉపయోగించే పద్ధతిని తగ్గించాలని NPCI భావిస్తోంది. వినియోగదారులు తమ మొబైల్ నంబర్ స్థానంలో Username ఆధారిత UPI ID (ఉదాహరణకు: Rahul@upi) ని క్రియేట్ చేసుకుని, దాన్నే డిఫాల్ట్ ఆప్షన్‌గా ఉపయోగించే వెసులుబాటు కల్పించాలని యాప్‌లను కోరింది. ప్రస్తుతం కొత్తగా యూపీఐ రిజిస్టర్ చేసుకునే వారిలో ఎక్కువమంది ఫోన్ నంబర్‌నే ఐడీగా ఎంచుకుంటున్నారు. కానీ Username ఐడీలపై అవగాహన పెంచడం ద్వారా ప్రైవసీ సమస్యలను పూర్తిగా తొలగించవచ్చని భావిస్తున్నారు.

ప్రైవసీలో సరికొత్త అధ్యాయం 
యూపీఐ లావాదేవీలు సురక్షితమే అయినప్పటికీ, ఫోన్ నంబర్లు బహిర్గతం కావడం వల్ల స్పామ్ కాల్స్, ప్రైవసీ ఉల్లంఘనలు జరిగే అవకాశం ఉండేది. NPCI తీసుకొస్తున్న ఈ కొత్త మార్పుల వల్ల సాధారణ కస్టమర్‌లకు పూర్తి స్థాయి రక్షణ లభిస్తుంది. సెప్టెంబర్ 4 తర్వాత డిజిటల్ చెల్లింపులు మరింత సురక్షితంగా, విశ్వసనీయంగా మారనున్నాయి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »