పైన్ ల్యాబ్స్ గురువారం అధికారికంగా పైన్ ల్యాబ్స్ పేమెంట్ ప్రోటోకాల్(P3P)ను భారత్‌లో లాంచ్ చేసింది.
Photo Credit: Unsplash/ David Dvoracek
Pine Labs
UPI : భారతదేశంలో యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపుల వాడకం రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. అయితే, రాబోయే రోజుల్లో రానున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ల ద్వారా జరిగే ఆటోమేటిక్ షాపింగ్ లేదా లావాదేవీలకు ప్రస్తుత యూపీఐ సిస్టమ్ పూర్తిగా అనుకూలంగా లేదు. ఎందుకంటే ప్రస్తుత సిస్టమ్ మనుషుల ప్రమేయంతో నడుస్తుంది. ఈ సవాలుకు చెక్ పెడుతూ ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం పైన్ ల్యాబ్స్ సరికొత్త పేమెంట్ ప్రోటోకాల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ సరికొత్త సిస్టమ్ ద్వారా ఏఐ ఏజెంట్లు వినియోగదారులు నిర్దేశించిన పరిమితుల లోపల తమంతట తామే ఆటోమేటిక్‌గా చెల్లింపులను పూర్తి చేయగలరని కంపెనీ ప్రకటించింది.
ప్రస్తుత యూపీఐ సిస్టమ్ లిమిట్స్ పరిమితులు
పైన్ ల్యాబ్స్ గురువారం అధికారికంగా పైన్ ల్యాబ్స్ పేమెంట్ ప్రోటోకాల్(P3P)ను భారత్‌లో లాంచ్ చేసింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న యూపీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా మనుషులు చేసే లావాదేవీల కోసమే రూపొందించబడింది. ఇందులో ప్రతి ఒక్క చిన్న పేమెంట్‌కు కూడా వినియోగదారుడు స్వయంగా ఎంపిన్ లేదా ఇతర బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, భవిష్యత్తులో రాబోయే ఏజెంటిక్ కామర్స్ లో ఈ పద్ధతి పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఏఐ సిస్టమ్స్ ఆన్‌లైన్ లో స్వయంగా వస్తువులను వెతకడం, వివిధ సైట్లలో ధరలను పోల్చడం, ఆర్డర్లను పూర్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
ఎంపిన్ లేకుండానే ఆటోమేటిక్ లావాదేవీలు
పైన్ ల్యాబ్స్ కొత్తగా తెచ్చిన ఈ P3P ప్రోటోకాల్, యూపీఐ ప్రస్తుత మ్యాండేట్-ఆధారిత ఆర్కిటెక్చర్‌ను మరింత అప్‌గ్రేడ్ చేస్తుంది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న వన్ టైమ్ మ్యాండేట్స్ (OTM), రిజర్వ్ పే, సింగిల్ బ్లాక్ మల్టిపుల్ డెబిట్ వంటి టెక్నికల్ ఫ్రేమ్‌వర్క్‌లపై ఆధారపడి పనిచేస్తుంది. ఈ సిస్టమ్ ద్వారా వినియోగదారుడు మొదటగా కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే ఏఐ ఏజెంట్‌కు డిజిటల్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ ఏఐ ఏజెంట్ యూజర్ సెట్ చేసిన బడ్జెట్ లిమిట్ లోపల ప్రతిసారీ ఎలాంటి ఎంపిన్ అడగకుండానే ఆటోమేటిక్‌గా పేమెంట్లను విజయవంతంగా పూర్తి చేస్తుంది.
Samsung : శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. ఫోన్ స్క్రీన్‌పైనే ఇంటర్నెట్ స్పీడ్ చూసుకునే సరికొత్త ఫీచర్!
గ్రాంటెక్స్ భాగస్వామ్యంతో పటిష్టమైన భద్రత
ఈ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోటోకాల్‌ను కస్టమర్లకు అత్యంత సురక్షితమైనదిగా, నమ్మదగినదిగా మార్చడం కోసం పైన్ ల్యాబ్స్ సంస్థ గ్రాంటెక్స్ అనే ప్రముఖ భద్రతా ప్లాట్‌ఫారమ్‌తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా గ్రాంటెక్స్ సంస్థ వినియోగదారులు, ఏఐ ఏజెంట్ల ఐడెంటిటీని నిరంతరం వెరిఫై చేస్తుంది. అలాగే యూజర్లు సెట్ చేసిన ఖర్చుల పరిమితిని పర్యవేక్షించడం, ఆర్బీఐ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడడం, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ డిజిటల్ రికార్డును భద్రపరచడం వంటి పనులను చూసుకుంటుంది. దీనితో పాటు ఇందులో HTTP 402 స్టాండర్డ్‌ను ఉపయోగించడం వల్ల రెండు వేర్వేరు ఏఐ సిస్టమ్స్ మధ్య పేమెంట్ సమాచారం చాలా సేఫ్‌గా షేర్ అవుతుంది.
భారీగా పెరగనున్న ఆటోమేటిక్ పేమెంట్స్ మార్కెట్
రాబోయే కొద్ది సంవత్సరాలలో ఏఐ ఆధారిత షాపింగ్, ఆటోమేటిక్ డిజిటల్ చెల్లింపుల మార్కెట్ ఊహించని రేంజ్ లో దూసుకుపోతుందని పైన్ ల్యాబ్స్ గట్టిగా విశ్వసిస్తోంది. ఒక గ్లోబల్ ఇండస్ట్రీ నివేదిక ప్రకారం.. రాబోయే 2033 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏజెంటిక్ కామర్స్ మార్కెట్ విలువ ఏకంగా 65.47 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. భారతదేశంలో ఇప్పటికే ఉన్న విస్తృతమైన యూపీఐ నెట్‌వర్క్, గ్రామీణ ప్రాంతాల వరకు ఉన్న డిజిటల్ యాక్సెస్ కారణంగా.. ఈ సరికొత్త ఏఐ ఆటోమేటిక్ పేమెంట్ టెక్నాలజీని డెవలప్ చేయడంలో, విస్తరించడంలో మన దేశం ప్రపంచంలోనే కీలక పాత్ర పోషించబోతోంది.
ప్రకటన
ప్రకటన
Nothing Inks MoUs With IIT Roorkee, IISc to Boost Deep-Tech Innovation in India
Redmi K90 Ultra to Launch With Snapdragon 8 Elite Chip and Built-in Cooling Fan, Tipster Claims