Tata Sierra EV Launch: ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు డిజైన్ దాదాపుగా పాత సియెర్రా ఐసీఈ (పెట్రోల్/డీజిల్) వెర్షన్ లాగే ఉన్నప్పటికీ, టెక్నాలజీ పరంగా సరికొత్త అప్‌డేట్స్‌తో రానుంది.
TATA MOTORS
Tata Sierra EV Launch: భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో సింహభాగం వాటాను కలిగి ఉన్న ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, కస్టమర్లను ఆకట్టుకునేందుకు మరో పవర్‌ఫుల్ కారును సిద్ధం చేసింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న టాటా మోస్ట్ అవేటెడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాటా సియెర్రా ఈవీ ఈ జూన్ నెలాఖరులోనే మార్కెట్లో అధికారికంగా లాంచ్ కాబోతోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు డిజైన్ దాదాపుగా పాత సియెర్రా ఐసీఈ (పెట్రోల్/డీజిల్) వెర్షన్ లాగే ఉన్నప్పటికీ, టెక్నాలజీ పరంగా సరికొత్త అప్‌డేట్స్‌తో రానుంది.
ఈ సరికొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని టాటా మోటార్స్ అత్యంత ఆధునికమైన acti.ev+ ప్రత్యేక ఈవీ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించారు. ఒక ప్రముఖ మీడియా నివేదిక ప్రకారం.. ఈ కారు రియర్-వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ అనే రెండు వేరియంట్లలో లభించనుంది. వినియోగదారుల కోసం ఇందులో 65 kWh, 75 kWh సామర్థ్యం గల రెండు భారీ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను అందించనున్నారు. ఇందులో ఎక్కువ పవర్ ఉన్న 75 kWh బ్యాటరీని కేవలం హై-ఎండ్ AWD వేరియంట్లలో మాత్రమే అమర్చనున్నట్లు తెలుస్తోంది.
టాటా సియెర్రా ఈవీ లుక్ పరంగా పాత ఐసీఈ మోడల్ కంటే భిన్నంగా కనిపించనుంది. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేకంగా ఉండేలా ముందు భాగంలో క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, సరికొత్త డిజైన్‌తో కూడిన ఫ్రంట్ బంపర్‌ను ఇచ్చారు. అయితే కారు లోపలి భాగం మాత్రం పాత సియెర్రా మోడల్‌ను పోలి ఉంటుంది. ఈ కారు టాప్ వేరియంట్లలో ఏకంగా ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్‌ను అందించబోతున్నారు. ఇందులో 10.25 ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 ఇంచుల మెయిన్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా మరో 12.3 ఇంచుల డిస్‌ప్లే ఉండటం విశేషం.
Samsung : శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. ఫోన్ స్క్రీన్‌పైనే ఇంటర్నెట్ స్పీడ్ చూసుకునే సరికొత్త ఫీచర్!
ఈ ట్రిపుల్ స్క్రీన్ తో పాటు మిగిలిన బేస్ వేరియంట్లలో డ్యూయల్-స్క్రీన్ సెటప్ అందుబాటులో ఉంటుంది. కారులో ప్రయాణించే వారికి లగ్జరీ ఫీలింగ్ ఇచ్చేలా పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, వివిధ రకాల డ్రైవ్ మోడ్‌లు, అద్భుతమైన ప్రీమియం ఆడియో సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లను అమర్చారు. మార్కెట్ అంచనాల ప్రకారం ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర రూ. 18 లక్షల నుండి రూ. 25 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది మార్కెట్లోకి వస్తే ఎంజీ మోటార్స్ కి చెందిన ZS EV, మహీంద్రా BE 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
సియెర్రాతో పాటే టాటా మోటార్స్ తన పాపులర్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారు టాటా టియాగో ఈవీ సరికొత్త వెర్షన్‌ను కూడా మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త మోడల్ డిజైన్‌లో కొన్ని క్రేజీ మార్పులు చేయడంతో పాటు సరికొత్త ఫీచర్లను యాడ్ చేశారు. దీని ప్రారంభ ధర రూ.6.99 లక్షలుగా ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ.9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇందులో కస్టమర్ల కోసం 19.2 kWh, 24 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు లభిస్తాయి.
ఈ టియాగో ఈవీని మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకు టాటా కంపెనీ బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ అనే సరికొత్త ఫైనాన్సింగ్ ఆప్షన్‌ను కూడా ప్రకటించింది. ఈ స్కీమ్ కింద కస్టమర్లు బ్యాటరీ ధర మినహాయించి కేవలం రూ.4.69 లక్షలకే ఈ కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు. అయితే దీని కోసం కస్టమర్లు బ్యాటరీ రెంట్ల కింద ప్రతి కిలోమీటరుకు రూ.2.60 చొప్పున నెలవారీ రెంటల్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ కారు ప్రస్తుత డిజైన్ సాధారణ పెట్రోల్ టియాగో లాగే ఉన్నప్పటికీ, కొత్త వెర్షన్‌లో కొన్ని కాస్మెటిక్ మార్పులు కారుకు మరింత రిచ్ లుక్‌ను తీసుకువచ్చాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Amazon Bee Frontier, Bee Eclipse AI Devices Launched: Price, Specifications