Pure Petrol: ఇథనాల్ లేని ప్యూర్ పెట్రోల్ కావాలా? ఈ యాప్‌తో దగ్గరలోని బంక్‌ను క్షణాల్లో కనిపెట్టేయండి

మీ ఇంటి వద్ద నుంచే స్మార్ట్‌ఫోన్ ద్వారా ప్యూర్ పెట్రోల్ లభించే స్థలాలను తెలుసుకునేందుకు E0 Finder: Ethanol Free Fuel యాప్ ఎంతో ఉపయోగపడుతుంది.

Pure Petrol: ఇథనాల్ లేని ప్యూర్ పెట్రోల్ కావాలా? ఈ యాప్‌తో దగ్గరలోని బంక్‌ను క్షణాల్లో కనిపెట్టేయండి

Photo Credit: Pexels/Jibin Yesudasan

E20 Petrol

ముఖ్యాంశాలు
  • వాహనదారులకు బంపర్ ఆఫర్
  • ఇంజన్ పాడవకుండా కాపాడే ప్యూర్ పెట్రోల్ సీక్రెట్ లొకేషన్స్ మీ చేతిలోనే
  • ఆయిల్ కంపెనీల రహస్యం అవుట్
ప్రకటన

Pure Petrol: ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్‌లో E20 పెట్రోల్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల వాహనాల మైలేజ్ గణనీయంగా తగ్గుతోందని, అంతేకాకుండా ఇంజన్‌లోని పలు భాగాలు త్వరగా పాడవుతున్నాయని వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చాలామంది ఇథనాల్ లేని ప్యూర్ పెట్రోల్ కోసం వెతుకులాట ప్రారంభించారు. అయితే సాధారణ రోజుల్లో ఏ పెట్రోల్ బంక్‌లో ప్యూర్ పెట్రోల్ లభిస్తుందో తెలుసుకోవడం అంత సులభం కాదు. ఈ సమస్యకు పరిష్కారంగా ఇప్పుడు ఒక ప్రత్యేక మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చింది.

ఏమిటీ E0 Finder: Ethanol Free Fuel యాప్?
మీ ఇంటి వద్ద నుంచే స్మార్ట్‌ఫోన్ ద్వారా ప్యూర్ పెట్రోల్ లభించే స్థలాలను తెలుసుకునేందుకు E0 Finder: Ethanol Free Fuel యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను పూర్తి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ వాడటానికి ఎలాంటి లాగిన్, సైన్ ఇన్ లేదా ఓటీపీ అవసరం లేదు. ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వంటి ప్రముఖ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల పబ్లిక్ డేటాను సేకరించి, యూజర్లకు అర్థమయ్యేలా ఇంటరాక్టివ్ మ్యాప్ రూపంలో ఈ యాప్ సమాచారాన్ని అందిస్తుంది. XP100, Power 100, Speed 100 వంటి ఇథనాల్-ఫ్రీ గ్రేడ్ పెట్రోల్‌తో పాటు E20, E85, E100 ఇంధనాలు ఎక్కడ దొరుకుతాయో కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు.

Amazon Great Freedom Sale: స్మార్ట్ ఏఐ ఫీచర్లు, అద్భుత డిస్‌ప్లే.. గ్రేట్ ఫ్రీడమ్ సేల్లో ప్రీమియం OLED టీవీలపై లక్షల్లో డిస్కౌంట్

E0 Finder యాప్ ఎలా పనిచేస్తుంది?
* లైవ్ మ్యాప్, కలర్ కోడింగ్: యాప్ ఓపెన్ చేయగానే మీ చుట్టుపక్కల ఉండే పెట్రోల్ బంకుల లైవ్ మ్యాప్ కనిపిస్తుంది. ఇంధన గ్రేడ్‌ను బట్టి విభిన్న రంగుల్లో బంకులను చూపిస్తుంది.
* నియర్ మీ  ఆప్షన్: మీకు అత్యంత సమీపంలో ఉన్న ఇథనాల్-ఫ్రీ లేదా ఫ్లెక్స్-ఫ్యూయల్ పంపులను వెతకడానికి 'Near Me' పై క్లిక్ చేయాలి.
* ఫిల్టర్ సౌకర్యం: E0, XP100, Power 100, Speed 100, E85, E100 వంటి వివిధ ఇంధన గ్రేడ్ల ఆధారంగా బంకులను ఫిల్టర్ చేసుకోవచ్చు.
* ధరలు, పూర్తి వివరాలు: ఒక బంక్‌పై క్లిక్ చేస్తే దాని బ్రాండ్, అక్కడ అందుబాటులో ఉన్న ప్రొడక్ట్, లీటర్ ధర, చివరిసారి డేటా ఎప్పుడు వెరిఫై అయిందో తెలుస్తుంది. దీనివల్ల బంక్‌కి వెళ్లే ముందే ఎంత ఖర్చవుతుందో ఒక అంచనాకు రావచ్చు.
* డైరెక్ట్ కాలింగ్, నావిగేషన్: యాప్ నుంచే నేరుగా సదరు పెట్రోల్ బంక్‌కి కాల్ చేసి ఫ్యూయల్ లభ్యతను సరిచూసుకోవచ్చు, అలాగే రూట్ మ్యాప్ నావిగేషన్ కూడా పొందవచ్చు. అంతేకాకుండా, ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే యాప్‌లోనే రిపోర్ట్ చేసే వెసులుబాటు కూడా ఉంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Vivo S2 vs iQOO Neo 10 vs OnePlus Nord 6 : ఈ మూడింట్లో ఏది కొనడం బెస్ట్ ?
  2. Realme 16x 5G: ఈ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. టెక్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న రియల్‌మీ కొత్త ఫోన్
  3. Airtel: ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఊహించని షాక్.. ఆ పాపులర్ ప్లాన్స్ క్లోజ్
  4. Pure Petrol: ఇథనాల్ లేని ప్యూర్ పెట్రోల్ కావాలా? ఈ యాప్‌తో దగ్గరలోని బంక్‌ను క్షణాల్లో కనిపెట్టేయండి
  5. Amazon Great Freedom Sale: అమెజాన్ సేల్‌లో ఐకూ Z11 Lite పై భారీ ఆఫర్లు.. 6500mAh బ్యాటరీ ఫోన్‌పై అదనపు తగ్గింపు
  6. Amazon Great Freedom Sale: స్మార్ట్ ఏఐ ఫీచర్లు, అద్భుత డిస్‌ప్లే.. గ్రేట్ ఫ్రీడమ్ సేల్లో ప్రీమియం OLED టీవీలపై లక్షల్లో డిస్కౌంట్
  7. Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. శామ్‌సంగ్, ఏసర్, లెనోవో ట్యాబ్‌లపై ఆఫర్ల వర్షం
  8. Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై ఊహించని రేంజ్‌లో ధరల తగ్గింపు
  9. Samsung Galaxy A36 vs Redmi Note 17 vs Vivo T5x : రూ.25 వేలలో ఏ ఫోన్ కొనాలి?
  10. Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. రూ. 5 వేల బడ్జెట్‌లో 5 అద్భుతమైన స్మార్ట్‌వాచ్‌లు
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »