షావోమి ఈ సరికొత్త మిజియా స్మార్ట్ ప్రెజర్ కుక్కర్ 2 ప్రో మోడల్‌ను ప్రస్తుతం చైనా మార్కెట్లో విడుదల చేసింది.
Photo Credit: Xiaomi
Xiaomi
Xiaomi : ప్రముఖ గ్లోబల్ టెక్ బ్రాండ్ షావోమి కేవలం మొబైల్ ఫోన్లు మాత్రమే కాకుండా హోమ్ అప్లయన్సెస్ విభాగంలోనూ వినూత్న ప్రొడక్ట్లను తీసుకువస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగానే తమ సరికొత్త స్మార్ట్ హోమ్ గ్యాడ్జెట్ మిజియా స్మార్ట్ ప్రెజర్ కుక్కర్ 2 ప్రోను అధికారికంగా లాంచ్ చేసింది. వంట చేసే ప్రక్రియను మరింత సులభతరం, సురక్షితం చేయడానికి ఈ కుక్కర్‌లో ఎన్నో రకాల అడ్వాన్స్‌డ్ ఫీచర్లను, సరికొత్త కనెక్టివిటీ ఆప్షన్లను కంపెనీ జోడించింది. షావోమి ఈ సరికొత్త మిజియా స్మార్ట్ ప్రెజర్ కుక్కర్ 2 ప్రో మోడల్‌ను ప్రస్తుతం చైనా మార్కెట్లో విడుదల చేసింది. అక్కడ దీని ధరను 899 యువాన్లుగా నిర్ణయించారు. అంటే మన భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.12,500 గా ఉంటుంది. ఈ స్మార్ట్ కుక్కర్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ JD.com ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచారు.
ఈ స్మార్ట్ ప్రెజర్ కుక్కర్ 5 లీటర్ల భారీ కెపాసిటీతో వస్తుంది, ఇది ఒక మీడియం లేదా పెద్ద కుటుంబానికి చాలా చక్కగా సరిపోతుంది. ఇందులో వేగంగా వంట వండటానికి వీలుగా 2200W పవర్‌ఫుల్ ఇండక్షన్ హీటింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది కుక్కర్ చుట్టూ సమానంగా వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కుక్కర్ గరిష్టంగా 112kPa ప్రెజర్‌ను ఉత్పత్తి చేయగలదు, దీనివల్ల కుక్కర్ లోపలి ఉష్ణోగ్రత 120 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటుంది. ఫలితంగా సాధారణ కుక్కర్లతో పోలిస్తే ఇందులో చాలా తక్కువ సమయంలోనే వంట పూర్తవుతుందని కంపెనీ చెబుతోంది.
ఈ కుక్కర్ కొనుగోలు చేసే వినియోగదారుల కోసం కంపెనీ రెండు రకాల ప్రత్యేకమైన ఇన్నర్ పాట్లను అందిస్తోంది. అందులో ఒకటి అత్యంత నాణ్యమైన 304 స్టెయిన్‌లెస్ స్టీల్ పాట్ కాగా, రెండవది ఫ్లోరిన్ రహిత సిరామిక్ కోటెడ్ పాట్. ఈ సిరామిక్ పాట్ క్లాస్-II నాన్-స్టిక్ స్టాండర్డ్స్‌తో వస్తుంది, దీనివల్ల అన్నం లేదా ఇతర పదార్థాలు అడుగు అంటవు. ఈ రెండు విభిన్న పాత్రల సహాయంతో యూజర్లు ఒకే సమయంలో రెండు వేర్వేరు వంటకాలను చాలా సులభంగా వండుకోవచ్చు.
Maruti e Vitara : మారుతి సుజుకి ఈ-విటారా ప్రియులకు షాక్.. పెరిగిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధరలు
సాధారణంగా మనం వాడే సాంప్రదాయ ప్రెజర్ కుక్కర్లు వంట పూర్తయిన తర్వాత లోపల ఉన్న గ్యాస్ లేదా ప్రెజర్ తగ్గడానికి చాలా సమయం తీసుకుంటాయి. ప్రెజర్ తగ్గకుండా మూత తీయడం ప్రమాదకరం కాబట్టి మనం ఎదురుచూడక తప్పదు. కానీ షావోమి కుక్కర్ ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం చూపింది. ఇందులో ఉన్న క్విక్ డిప్రెజరైజేషన్ ఫీచర్ కారనంగా వంట పూర్తికాగానే కేవలం 88 సెకన్లలోనే (ఒకటిన్నర నిమిషం లోపే) లోపలి ప్రెజర్ అంతా ఖాళీ అయిపోతుంది. అంటే వంట పూర్తయిన 3 నిమిషాల లోపే మీరు కుక్కర్ మూతను సురక్షితంగా ఓపెన్ చేయవచ్చు.
స్మార్ట్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ కుక్కర్‌లో ప్రీమియం లుక్ ఇచ్చే టెంపర్డ్ గ్లాస్ కంట్రోల్ ప్యానెల్, ఒక డిస్‌ప్లే స్క్రీన్‌ను అమర్చారు. ఇది 10 రకాల విభిన్న కుకింగ్ మోడ్‌లతో వస్తుంది. అంతేకాకుండా, ఇది షావోమికి చెందిన సరికొత్త హైపర్‌ఓఎస్, మిజియా యాప్‌తో కనెక్ట్ అవుతుంది. దీని సహాయంతో వినియోగదారులు ఏకంగా 24 గంటల ముందే వంట ప్రక్రియను షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇందులో XiaoAI వాయిస్ కమాండ్ సపోర్ట్ కూడా ఉంది. భద్రత కోసం ఇందులో ఓవర్‌ప్రెజర్ ప్రొటెక్షన్, టెంపరేచర్ లిమిటర్, ఆటోమేటిక్ లిడ్ లాక్ వంటి ఏకంగా 18 రకాల కఠినమైన సేఫ్టీ ప్రమాణాలను పాటించారు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999