భారత మార్కెట్లో కస్టమర్లను ఆకట్టుకునేలా ఈ ఫోన్ ప్రారంభ ధరను కూపన్ ఆఫర్లతో కలిపి రూ.22,999గా నిర్ణయించారు.
Photo Credit: Samsung
Samsung Galaxy M47 5G
Samsung : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్ భారతీయ మొబైల్ మార్కెట్లోకి తన మోస్ట్ అవేటెడ్ ఎం-సిరీస్ కొత్త మోడల్ శామ్‌సంగ్ గెలాక్సీ M47 5Gను అధికారికంగా లాంచ్ చేసింది. మధ్యతరగతి వినియోగదారులను టార్గెట్ చేస్తూ.. అద్భుతమైన ఫీచర్లు, భారీ బ్యాటరీ బ్యాకప్‌తో ఈ ఫోన్‌ను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. ఈ సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ పవర్‌ఫుల్ ప్రైమరీ కెమెరాతో పాటు, హ్యాండ్లింగ్ చాలా స్మూత్‌గా ఉండేలా అధునాతన ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను అమర్చారు. భారత మార్కెట్లో కస్టమర్లను ఆకట్టుకునేలా ఈ ఫోన్ ప్రారంభ ధరను కూపన్ ఆఫర్లతో కలిపి రూ.22,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ రోగ్ రెడ్, బ్లేజ్ బ్లూ వంటి రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని అధికారిక అమ్మకాలు రాబోయే జూలై 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. శామ్‌సంగ్ అఫీషియల్ వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో జరగబోయే ప్రైమ్ డే సేల్ మొదటి రోజు నుండే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచనున్నారు.
ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు యూజర్లకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. ఇందులో 1080×2340 పిక్సెల్స్ రెజల్యూషన్ కలిగిన 6.7 ఇంచుల భారీ sAMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది స్మూత్ గేమింగ్, స్క్రోలింగ్ కోసం 120Hz రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా ఇందులో 1400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. స్క్రీన్‌కు మరింత రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ ఉంది. దీనివల్ల సాధారణ స్క్రీన్‌లతో పోలిస్తే 4 రెట్లు ఎక్కువ స్క్రాచ్ రెసిస్టెన్స్ లభిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ధూళి, నీటి నుంచి తట్టుకునేలా ప్రత్యేకమైన ఐపీ రేటింగ్‌తో వస్తుంది.
UPI : ఇకపై నోటితో చెబితే చాలు యూపీఐ పేమెంట్స్ సక్సెస్.. రిమోట్ లాగా వాడేయొచ్చు
పర్ఫార్మెన్స్ పరంగా ఇందులో 4nm టెక్నాలజీతో పనిచేసే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 5G చిప్‌సెట్‌ను వాడారు. దీనికి తోడు అడ్రినో 710 గ్రాఫిక్స్ కార్డ్ (GPU) ఉంది. ఈ ఫోన్ 6GB / 8GB LPDDR5X రామ్, 128GB / 256GB UFS 3.1 స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో స్టోరేజ్‌ను ఏకంగా 2TB వరకు పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5 పై రన్ అవుతుంది. ఈ ఫోన్ కొన్న కస్టమర్లకు ఏకంగా 6 ఏళ్ల పాటు మేజర్ ఓఎస్ అప్‌గ్రేడ్స్, 6 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని శామ్‌సంగ్ హామీ ఇవ్వడం విశేషం.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. గెలాక్సీ M47 5G వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో f/1.8 అపెర్చర్, ఓఐఎస్ (OIS-ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్ ఉన్న 50MP మెయిన్ కెమెరా, 5MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు వైపు f/2.2 అపెర్చర్‌తో కూడిన 12 మెగాపిక్సెల్ హెచ్‌డీఆర్ కెమెరాను అమర్చారు. ఛార్జింగ్ టెన్షన్ లేకుండా ఉండటం కోసం ఇందులో ఏకంగా 6000mAh కెపాసిటీ గల మెగా బ్యాటరీని ఇచ్చారు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. కనెక్టివిటీ కోసం 5G, 4G VoLTE, వై-ఫై, బ్లూటూత్ 5.3, ఎన్‌ఎఫ్‌సీ (NFC), యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటి సదుపాయాలు కల్పించారు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999