6G Revolution : 5G స్పీడే తట్టుకోలేకపోతున్నాం.. అప్పుడే 6G నా.. భారత్ స్పీడ్ చూస్తే పక్క దేశాల మైండ్ బ్లాంక్

ప్రపంచ స్థాయిలో 6G టెక్నాలజీ అభివృద్ధిలో భారత్‌ను ముందంజలో ఉంచడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది.

6G Revolution : 5G స్పీడే తట్టుకోలేకపోతున్నాం.. అప్పుడే 6G నా.. భారత్ స్పీడ్ చూస్తే పక్క దేశాల మైండ్ బ్లాంక్

Photo Credit: Pixabay

6G Revolution

ముఖ్యాంశాలు
  • ప్రపంచ టెలికాం రంగాన్ని శాసించబోతున్న భారత్
  • 6G నెట్‌వర్క్‌తో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధం
  • సినిమా డౌన్‌లోడ్ బటన్ నొక్కేలోపే పూర్తి
ప్రకటన

6G Revolution : భారతదేశంలో టెలికాం టెక్నాలజీని నెక్ట్స్ లెవల్‎కు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. 5G సేవలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న తరుణంలోనే, తదుపరి తరం 6G టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా మంగళవారం రోజున భారత్ 6G అలయన్స్ పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రపంచ స్థాయిలో 6G టెక్నాలజీ అభివృద్ధిలో భారత్‌ను ముందంజలో ఉంచడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది.

విజ్ఞాన్ భవన్‌లో దిగ్గజాల భేటీ 
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఈ ప్రాధాన్యత కలిగిన సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, టెలికాం కార్యదర్శి అమిత్ అగర్వాల్‌తో పాటు టెలికాం పరిశ్రమ ప్రతినిధులు, స్టార్టప్‌లు, ప్రముఖ విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ 6G అలయన్స్ పరిధిలోని ఏడు కీలక వర్కింగ్ గ్రూప్‌ల ప్రగతిని మంత్రి నిశితంగా పరిశీలించారు. స్పెక్ట్రమ్, 6G టెక్నాలజీ, డివైజ్ తయారీ, అప్లికేషన్లు, సస్టైనబిలిటీ, అవుట్‌రీచ్, 6G యూజ్ కేసెస్ వంటి విభాగాలు ఇందులో ఉన్నాయి.

పేటెంట్లలో సరికొత్త రికార్డు.. వేల సంఖ్యలో అప్లికేషన్లు 
సమీక్షలో వెల్లడైన వివరాల ప్రకారం.. భారత్ 6G అలయన్స్‌కు చెందిన సభ్య సంస్థలు టెక్నాలజీ రంగంలో అద్భుతమైన పురోగతి సాధించాయి. ఇప్పటివరకు 5G, 6G టెక్నాలజీకి సంబంధించి ఏకంగా 7,700 కంటే ఎక్కువ పేటెంట్లను దాఖలు చేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో కేవలం భారతదేశంలోనే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో దాఖలు చేసిన 4,400 కంటే ఎక్కువ విదేశీ పేటెంట్ దరఖాస్తులు కూడా ఉండటం విశేషం. ఇది ప్రపంచ వేదికపై భారతీయ సాంకేతిక శక్తిని చాటిచెబుతోంది.

అంతర్జాతీయ స్థాయిలో పెరిగిన భారత ప్రాతినిధ్యం 
గ్లోబల్ టెలికాం ప్రమాణాలను నిర్ణయించే అంతర్జాతీయ సంస్థ 3GPP లో భారతదేశ భాగస్వామ్యం గత కొన్ని సంవత్సరాలుగా గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2020లో 3GPP లో భారతీయ ప్రదేశాల ప్రాతినిధ్యం లేదా ప్రతినిధుల సంఖ్య 717 మాత్రమే ఉండగా, 2025 నాటికి ఆ సంఖ్య ఏకంగా 1,787 కు చేరింది. ఇదే సమయంలో భారతీయ సాంకేతిక నిపుణుల కాంట్రిబ్యూషన్ 196 నుంచి భారీగా పెరిగి 2,943 కి చేరుకుంది.

Samsung Galaxy Z Fold 6 5G : శామ్‌సంగ్ ఫోన్‌పై భారీ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో Z ఫోల్డ్ 6 పై ఏకంగా రూ. 19,000 తగ్గింపు

 2030 నాటికి  గ్లోబల్ లీడర్‌గా భారత్
ఈ సమావేశంలో టెలికాం స్టాండర్డ్స్ డెవలప్‌మెంట్ సొసైటీ, ఇండియా (TSDSI) ప్రతినిధులు కూడా పాల్గొని 6G  స్టాండర్డ్స్ పై తాము చేస్తున్న పనులను వివరించారు. భారతదేశంలో రూపుదిద్దుకుంటున్న టెక్నాలజీలు, 6G యూజ్ కేసెస్ గ్లోబల్ స్టాండర్డ్స్‌లో భాగమయ్యేలా చూడటంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 2030 నాటికి 6G టెక్నాలజీ రూపకల్పన, అమలు ప్రక్రియలో ప్రపంచంలోనే అత్యుత్తమ దేశాల సరసన భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టడమే తమ ప్రధాన ధ్యేయమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »