Google : మనం మాట్లాడుతుండగానే అవతలి భాషలోకి మార్చేస్తుంది.. జెమిని 3.5 సరికొత్త అస్త్రం

ఈ సరికొత్త జెమిని 3.5 లైవ్ ట్రాన్స్‌లేట్ ఫీచర్ ద్వారా మనం మాట్లాడే మాటల టోన్, పేసింగ్, పిచ్ ఏమాత్రం మారకుండా అవతలి భాషలోకి అనువాదం అవుతుంది.

Google : మనం మాట్లాడుతుండగానే అవతలి భాషలోకి మార్చేస్తుంది.. జెమిని 3.5 సరికొత్త అస్త్రం

Photo Credit: Google

Gemini 3.5 Live Translate में

ముఖ్యాంశాలు
  • ప్రపంచంలోని భాషల సరిహద్దులను చెరిపేయడానికి వచ్చిన గూగుల్ జెమిని 3.5
  • ట్రాన్స్‌లేషన్ రంగంలో మునుపెన్నడూ చూడని మహా అద్భుతం
  • మనుషుల అవసరం లేకుండానే లైవ్ స్పీచ్ అనువాదం
ప్రకటన

Google : ప్రముఖ గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ టెక్నాలజీ ప్రపంచంలో మరో సరికొత్త మైలురాయిని అధిగమించింది. రియల్ టైమ్ స్పీచ్-టు-స్పీచ్ అనువాదం చేయడం కోసం సరికొత్త ఆడియో మోడల్ జెమిని 3.5 లైవ్ ట్రాన్స్‌లేట్‎ను అధికారికంగా పరిచయం చేసింది. గత రెండు దశాబ్దాలుగా గూగుల్ మెషిన్ లెర్నింగ్ రంగంలో చేసిన పరిశోధనలు, కృషి ఆధారంగా ఈ సరికొత్త వ్యవస్థను రూపొందించారు. దీనివల్ల వేర్వేరు భాషలు మాట్లాడే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణలు ఎంతో సహజంగా, ఎక్కడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగనున్నాయి.

ఒరిజినల్ వాయిస్ ఫీలింగ్‌తో లైవ్ అనువాదం
సాధారణంగా పాత ట్రాన్స్‌లేషన్ సిస్టమ్స్ మనం మాట్లాడేటప్పుడు ఒక రోబోట్ లాంటి గొంతుతో సమాధానం ఇస్తుంటాయి. కానీ ఈ సరికొత్త జెమిని 3.5 లైవ్ ట్రాన్స్‌లేట్ ఫీచర్ ద్వారా మనం మాట్లాడే మాటల టోన్, పేసింగ్, పిచ్ ఏమాత్రం మారకుండా అవతలి భాషలోకి అనువాదం అవుతుంది. అంటే మనం ఏ భావోద్వేగంతో మాట్లాడుతున్నామో, అదే ఫీలింగ్ అవతలి వ్యక్తికి వినిపిస్తుంది. ప్రస్తుతం గూగుల్‌కు చెందిన అన్ని ప్రొడక్ట్స్‌లో కలిపి నెలకు దాదాపు ఒక ట్రిలియన్ కంటే ఎక్కువ పదాలను ఈ ట్రాన్స్‌లేషన్ సిస్టమ్ ప్రాసెస్ చేస్తోందని కంపెనీ వెల్లడించింది.

జెమిని 3.5 లైవ్ ట్రాన్స్‌లేట్ ఎప్పటి నుంచి లభిస్తుంది?
గూగుల్ ఈ సరికొత్త జెమిని 3.5 లైవ్ ట్రాన్స్‌లేట్ ఫీచర్‌ను వివిధ దశల్లో తన వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం డెవలపర్ల కోసం జెమిని లైవ్ ఏపీఐ, గూగుల్ ఏఐ స్టూడియోల ద్వారా పబ్లిక్ ప్రివ్యూ రూపంలో ఇది లభిస్తోంది. ఇక గూగుల్ మీట్ వినియోగదారుల విషయానికి వస్తే.. ఈ జూన్ నెల నుంచి కొంతమంది ఎంపిక చేసిన వర్క్‌స్పేస్ ఎంటర్‌ప్రైజ్ కస్టమర్ల కోసం ప్రైవేట్ ప్రివ్యూ ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివరికల్లా దీనిని పెద్ద ఎత్తున అందరికీ రోల్ అవుట్ చేయనున్నారు. ఆ తర్వాత ఆండ్రాయిడ్, ఐఓఎస్ వేదికలపై గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్ ద్వారా గ్లోబల్ కస్టమర్లందరికీ ఇది అందుబాటులోకి రానుంది. అలాగే ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఇయర్‌పీస్ ఆధారిత అనువాద అనుభవాన్ని ఇచ్చే లిజనింగ్ మోడ్ కూడా లభించనుంది.

 

Vivo : ఫ్లిప్‌కార్ట్‌లో వీవో ఎక్స్300 ప్రోపై బంపర్ డిస్కౌంట్.. వేల రూపాయలు ఆదా చేసుకునే గోల్డెన్ ఛాన్స్

వాక్యం పూర్తి కాకముందే ఇన్స్టంట్ ట్రాన్స్‌లేషన్
జెమిని 3.5 లైవ్ ట్రాన్స్‌లేట్ అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఇది సాధారణ ట్రాన్స్‌లేటర్ల లాగా అవతలి వ్యక్తి మాట్లాడటం ఆపే వరకు లేదా ఒక వాక్యం పూర్తిగా పూర్తయ్యే వరకు వేచి ఉండదు. దీనిని కంటిన్యూయస్ స్ట్రీమింగ్ ట్రాన్స్‌లేషన్ టెక్నాలజీతో రూపొందించారు. అంటే ఒక వ్యక్తి మాట్లాడుతుండగానే, సమాంతరంగా బ్యాక్‌గ్రౌండ్‌లో కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే లైవ్ ఆడియో అనువాదాన్ని ఇది జనరేట్ చేస్తుంది. దీనివల్ల ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో ఎలాంటి విరామం లేకుండా చకచకా సంభాషణలు సాగించవచ్చు.

భాషను మార్చాల్సిన అవసరం లేదు 
ఈ సరికొత్త ఏఐ మోడల్ ఏకంగా 70కి పైగా అంతర్జాతీయ, ప్రాంతీయ భాషలను స్వయంగా గుర్తించగలదు. మనం యాప్‌లో ఎలాంటి మ్యాన్యువల్ లాంగ్వేజ్ సెట్టింగ్స్ మార్చాల్సిన అవసరం లేకుండానే, అవతలి వ్యక్తి ఏ భాషలో మాట్లాడుతున్నాడో జెమిని ఏఐ ఆటోమేటిక్‌గా కనిపెట్టేస్తుంది. క్వాలిటీ, స్పీడ్ విషయంలో పక్కా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ, ఎలాంటి అవాంతరాలు లేని క్లియర్ ఆడియో అవుట్‌పుట్‌ను ఇది అందిస్తుంది. చివరకు చుట్టూ ఎంత పెద్దగా శబ్దాలు (నాయిస్) వస్తున్నా సరే, వాటన్నింటినీ తట్టుకుని పవర్‌ఫుల్‌గా పర్ఫార్మ్ చేయడం దీని ప్రత్యేకత. భవిష్యత్తులో గ్లోబల్ కమ్యూనికేషన్‌ను ఈ ఫీచర్ పూర్తిగా మార్చేయనుంది.

#తాజా కథనాలు
  1. Data Center : చైనా సరికొత్త రికార్డు.. సముద్ర గర్భంలో ప్రపంచంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ డేటా సెంటర్
  2. Realme : ఒక్కసారి చార్జ్ చేస్తే 3 రోజులు పక్కా.. ఏకంగా 8000mAh భారీ బ్యాటరీతో రియల్‌మి P4R 5G లాంచ్
  3. Google : మనం మాట్లాడుతుండగానే అవతలి భాషలోకి మార్చేస్తుంది.. జెమిని 3.5 సరికొత్త అస్త్రం
  4. Meta Reliance : భారత్‌లో మెటా బిగ్ ప్లాన్.. రిలయన్స్‌తో కలిసి సరికొత్త ఏఐ డేటా సెంటర్ స్థాపన
  5. Wi-Fi : మీ ఇంటి వైఫై స్లో అయిపోయిందా? మీ వైఫైకి ఎవరెవరు కనెక్ట్ అయ్యారో ఇలా కనిపెట్టండి!
  6. Budget Smartphones : ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 20 వర్సెస్ మోటో జి37 వర్సెస్ రియల్‌మీ పి4 లైట్.. తక్కువ ధరలో బెస్ట్ ఏది?
  7. Vivo : ఫ్లిప్‌కార్ట్‌లో వీవో ఎక్స్300 ప్రోపై బంపర్ డిస్కౌంట్.. వేల రూపాయలు ఆదా చేసుకునే గోల్డెన్ ఛాన్స్
  8. IRCTC : రైలు ప్రయాణికులకు అదిరిపోయే ట్రిక్.. మీ మొబైల్ లోనే ఖాళీ బర్త్‌ల వివరాలు
  9. Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో పెను సంచలనం.. మెటా ఏఐ సిస్టమ్ లోపంతో 20 వేల అకౌంట్లు హ్యాక్!
  10. E85 Ethanol Fuel : ఢిల్లీలో మొట్టమొదటి E85 ఫ్యూయల్ స్టేషన్ ప్రారంభం.. లీటర్ పెట్రోల్‌పై ఏకంగా రూ.20 ఆదా
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »