E85 Ethanol Fuel : ఢిల్లీలో మొట్టమొదటి E85 ఫ్యూయల్ స్టేషన్ ప్రారంభం.. లీటర్ పెట్రోల్‌పై ఏకంగా రూ.20 ఆదా

కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణతో పాటు వాహనదారుల ఖర్చులను తగ్గించేందుకు ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్‌ను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. గ

E85 Ethanol Fuel : ఢిల్లీలో మొట్టమొదటి E85 ఫ్యూయల్ స్టేషన్ ప్రారంభం.. లీటర్ పెట్రోల్‌పై ఏకంగా రూ.20 ఆదా

Photo Credit: X/@HardeepSPuri

E85 फ्यूल में 85 प्रतिशत इथेनॉल होता है।

ముఖ్యాంశాలు
  • ఢిల్లీలో మొట్టమొదటి E85 ఫ్యూయల్ స్టేషన్ ప్రారంభం
  • రూ.82.12 లీటర్ ధర.. సరికొత్త రికార్డు సృష్టిస్తున్న హై-ఇథనాల్ బ్లెండ్
  • పెట్రోల్ రేట్లకు కేంద్ర ప్రభుత్వం భారీ బ్రేక్
ప్రకటన

E85 Ethanol Fuel : భారతదేశ ఆటోమొబైల్, ఇంధన రంగంలో ప్రస్తుతం E85 ఫ్యూయల్ గురించి ఒక రేంజ్ లో చర్చ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణతో పాటు వాహనదారుల ఖర్చులను తగ్గించేందుకు ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్‌ను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఇందులో భాగంగానే జూన్ 5 న కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరి దేశ రాజధాని ఢిల్లీలోని పూసా రోడ్ ఇండియన్ ఆయిల్ బంకులో మొట్టమొదటి E85 ఫ్యూయల్ డిస్పెన్సింగ్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ ఓపెనింగ్‌తో దేశంలో హై-ఇథనాల్ ఇంధన యుగం అధికారికంగా కొత్త శిఖరాలకు చేరినట్లయింది.

సాధారణ పెట్రోల్ కంటే చాలా చౌక 
ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన ఈ E85 పెట్రోల్ ధర లీటరుకు కేవలం రూ.82.12గా ఉంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న సాధారణ E20 పెట్రోల్ ధర కంటే దాదాపు రూ.20 వరకు తక్కువ కావడం విశేషం. ఇంత భారీగా రేటు తగ్గడంతో వాహనదారులు ఎంతో సంతోషిస్తున్నారు. అయితే, పెట్రోల్ బంకుల్లో సాధారణ వాహనదారులు కంగారు పడకుండా ఉండేందుకు, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసేందుకు ఈ E85 ఇంధన పైపులకు విడిగా ప్రత్యేకమైన బ్రాండింగ్, లేబులింగ్ బోర్డులను ఏర్పాటు చేయనున్నారు.

E20 వాహనదారులకు అలెర్ట్.. ఈ ఇంధనం మీకోసం కాదు
ఈ సరికొత్త E85 ఇంధనం మార్కెట్లోకి రాగానే వాహనదారుల మనసులో ఒక పెద్ద ప్రశ్న మొదలైంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న E20 స్టాండర్డ్ వాహనాల్లో ఈ సరికొత్త ఇంధనాన్ని వాడొచ్చా లేదా? దీనికి నిపుణుల సమాధానం ఖచ్చితంగా వాడకూడదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం తయారైన కార్లు, బైకులు కేవలం 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) పై మాత్రమే నడిచేలా డిజైన్ చేయబడ్డాయి. కానీ, ఈ సరికొత్త E85 ఇంధనంలో ఏకంగా 85 శాతం వరకు ఇథనాల్ ఉంటుంది. ఇది పూర్తిగా భిన్నమైన కెమికల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది కాబట్టి, పాత లేదా సాధారణ E20 వాహనాల్లో E85 ఇంధనం అస్సలు పని చేయదు.

Google Maps Hack : హైవే ప్రయాణాల్లో టోల్ ట్యాక్స్ బాదుడుకు బ్రేక్.. గూగుల్ మ్యాప్స్‌లో అదిరిపోయే ట్రిక్

పొరపాటున E85 పోస్తే ఇంజన్ పూర్తిగా ఖతమ్
ఒకవేళ తక్కువ ధరకు వస్తుంది కదా అని ఆశపడి ఎవరైనా తమ సాధారణ E20 కారు లేదా బైకులో E85 ఇంధనాన్ని పోస్తే చాలా ఘోరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల వాహనం ఇంజన్ పర్ఫార్మెన్స్ పూర్తిగా పడిపోవడమే కాకుండా, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ మొత్తం దెబ్బతింటుంది. ఇథనాల్‌కు ఉండే కెమికల్ గుణం వల్ల సాధారణ ఇంజన్లలోని ఫ్యూయల్ పైపులు, రబ్బర్ సీల్స్ చాలా వేగంగా కరిగిపోతాయి. దీనివల్ల వాహనం అస్సలు స్టార్ట్ అవ్వదు. లాంగ్ రన్‌లో ఇంజన్ టోటల్‌గా పాడైపోయి వేల రూపాయల నష్టం వస్తుంది. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ పనితీరు వేరుగా ఉంటుంది కాబట్టి దీనికి ప్రత్యేకమైన క్యాలిబ్రేషన్, మెటీరియల్స్ అవసరమవుతాయి.

E85 ఇంధనం కేవలం ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకే సొంతం
మరి ఈ సరికొత్త E85 ఇంధనాన్ని ఎవరు వాడాలి అంటే.. దీనికోసం మార్కెట్లోకి ప్రత్యేకంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు(FFV) రావలసి ఉంది. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు, బైకులు ఇథనాల్ ఏ శాతాన్ని అయినా తట్టుకునేలా ప్రత్యేకమైన మెటీరియల్‌తో తయారు చేయబడతాయి. ఇవి E20 నుంచి మొదలుకొని E85 వరకు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 100 శాతం ఇథనాల్ (E100)ను కూడా ఈజీగా తట్టుకుంటాయి. వీటిలో వాడే ఇథనాల్-రెసిస్టెంట్ విడిభాగాలు, స్పెషల్ ఇంజన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఫ్యూయల్ మ్యాపింగ్ సాఫ్ట్‌వేర్.. బండిలో ఏ రకమైన ఇంధనం పోసినా దానికి తగినట్లుగా ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయిపోతాయి.

కొత్త కారు కొనేవారు ఏం చేయాలి?
ప్రభుత్వం హై-ఇథనాల్ ఇంధనాలపై ప్రకటనలు గుప్పిస్తుండటంతో.. ఇప్పుడు నార్మల్ పెట్రోల్ కార్లు కొనడం సేఫేనా అనే సందేహం జనాల్లో ఉంది. ప్రస్తుతం దేశంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల సంఖ్య చాలా తక్కువగా ఉంది కాబట్టి, సాధారణ పెట్రోల్ లేదా E20 కార్ల అమ్మకాలు ఇప్పుడప్పుడే ఆగిపోవు. కాకపోతే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కార్ల తయారీ కంపెనీలన్నీ త్వరలోనే ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లను మార్కెట్లోకి విస్తృతంగా తీసుకురానున్నాయి. అప్పటివరకు సాధారణ వాహనదారులు పెట్రోల్ బంకులకు వెళ్లినప్పుడు రేటు తక్కువగా ఉందని పొరపాటున కూడా E85 వైపు వెళ్లకుండా, తమ బండికి సర్టిఫైడ్ అయిన సాధారణ పెట్రోల్ లేదా E20 ఇంధనాన్ని మాత్రమే వాడటం సురక్షితం.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Human Fridge : ఎండదెబ్బకు జపాన్ మాస్టర్ ప్లాన్.. మనుషులను కూల్ చేసే హ్యూమన్ ఫ్రిడ్జ్ వచ్చేసింది
  2. Oppo F35 Series : పండుగ సేల్స్ ముందే ఒప్పో బిగ్ ప్లాన్..  వచ్చే నెలలోనే మార్కెట్లోకి  రెండు పవర్ ఫుల్ ఫోన్లు
  3. Boltt Evo 4G : ఐఫోన్ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు బోల్ట్ ఫోన్ రెడీ.. ఫస్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్
  4. EV Sales : ఈవీ మార్కెట్లో సరికొత్త రికార్డులు.. జులైలో ఏకంగా 81.6 శాతం పెరిగిన కార్ల విక్రయాలు
  5. Telegram : ఐఫోన్ యూజర్లకు మైండ్ బ్లాంకింగ్ షాక్.. యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ అవుట్
  6. Elon Musk : నెల రోజుల్లోనే ఎలాన్ మస్క్ ఆస్తి మటాష్.. ఏకంగా 600 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి
  7. iQOO Z11  : చైనాలో ఒకలా, ఇండియాలో ఇంకోలా.. ఐకూ Z11 కొత్త లుక్ అదిరింది భయ్యా
  8. WhatsApp Tricks : ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుందా ?.. ఈ చిన్న వాట్సాప్ సెట్టింగ్ మారితే మీ ప్రాబ్లమ్ సాల్వ్
  9. Flipkart Freedom Sale : ఆగస్ట్ 15కు బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో 65 ఇంచుల 4K స్మార్ట్ టీవీలపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు
  10. OnePlus N6x vs Vivo T5 Lite 5G vs Tecno Spark 50 5G : రూ. 20 వేల బడ్జెట్‌లో ఏది బెస్ట్?
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »