వాట్సాప్ ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ ఫీచర్‌ను ప్రకటించినప్పటికీ, అప్పట్లో ఇది చాలా తక్కువ మంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది.
Photo Credit: Pixabay
WhatsApp lets users switch accounts within the app
WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఐఫోన్ యూజర్ల కోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఆండ్రాయిడ్ యూజర్లకు ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్న మల్టీ-అకౌంట్ ఫీచర్‌ను ఇప్పుడు ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్‌పై కూడా విస్తృతంగా విడుదల చేస్తోంది. దీనివల్ల ఐఫోన్ యూజర్లు వేరే మొబైల్స్ లేదా ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ వాడాల్సిన అవసరం లేకుండానే, ఒకే ఒక్క ఐఫోన్ లో రెండు వేర్వేరు వాట్సాప్ అకౌంట్లను అత్యంత సులభంగా నిర్వహించవచ్చు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు వేర్వేరు ప్రొఫైళ్లను మెయింటైన్ చేయడానికి ఈ ఫీచర్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.
నిజానికి వాట్సాప్ ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ ఫీచర్‌ను ప్రకటించినప్పటికీ, అప్పట్లో ఇది చాలా తక్కువ మంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ప్రముఖ ఫీచర్ ట్రాకర్ WABetaInfo తాజా నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వస్తోంది. వాట్సాప్ ఫర్ ఐఓఎస్ వెర్షన్ 26.22.76 ద్వారా ఈ విస్తృత రోల్ అవుట్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ అప్‌డేట్ దశలవారీగా విడుదల అవుతున్నందున, కొందరు ఐఫోన్ యూజర్లకు ఈ ఫీచర్ రావడానికి మరికొన్ని రోజులు సమయం పట్టవచ్చు.
ఈ సరికొత్త అప్‌డేట్ రాకముందు వరకు ఐఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్లు వాడటం యూజర్లకు ఒక పెద్ద టాస్క్‌లా ఉండేది. పర్సనల్ నంబర్‌కు నార్మల్ వాట్సాప్ యాప్ వాడితే, ఆఫీస్ నంబర్ కోసం వాట్సాప్ బిజినెస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. లేదంటే రెండు వేర్వేరు స్మార్ట్‌ఫోన్లను మెయింటైన్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఒకే అప్లికేషన్ లోపలే రెండు వేర్వేరు ప్రొఫైళ్లను భద్రంగా దాచుకోవచ్చు. ఒక అకౌంట్‌కు సంబంధించిన సమాచారం, చాట్స్, మీడియా ఫైల్స్ మరొక అకౌంట్‌తో అస్సలు మిక్స్ అవ్వవు. రెండూ పూర్తిగా విడివిడిగా సేఫ్‌గా ఉంటాయి.
New Smartphones : భారత మార్కెట్లో మొబైల్స్ జాతర.. ఈ వారంలో లాంచ్ అవుతున్న 4 సూపర్ స్మార్ట్‌ఫోన్లు
మీ ఐఫోన్‌లో రెండో వాట్సాప్ అకౌంట్‌ను సెట్ చేసుకోవడం చాలా సులభం. దీనికోసం వాట్సాప్ సెట్టింగ్స్‌లో ఉన్న అకౌంట్ మేనేజ్‌మెంట్ సెక్షన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మీకు యాడ్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీకున్న రెండో ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా లేదా QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా మీ అకౌంట్‌ను లింక్డ్ డివైజ్‌గా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ ప్రాసెస్ పూర్తయితే, మీరు మళ్లీ మళ్లీ లాగిన్ లేదా సైన్-ఇన్ అవ్వాల్సిన అవసరం లేకుండానే రెండు అకౌంట్లను ఆపరేట్ చేయవచ్చు.
సెటప్ పూర్తయిన తర్వాత ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్‌కు మారడం చాలా సింపుల్‌గా ఉంటుంది. వాట్సాప్ యాప్‌లో కింద కనిపించే You ట్యాబ్‌ను ఒకసారి నొక్కితే చాలు, యాప్‌కు లింక్ అయి ఉన్న అకౌంట్ల వివరాలన్నీ కనిపిస్తాయి. అంతేకాదు, ఆ You ట్యాబ్‌ను కాసేపు లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా మరింత వేగంగా ఒక ప్రొఫైల్ నుంచి ఇంకొక ప్రొఫైల్‌కు స్విచ్ అయిపోవచ్చు. ప్రస్తుతం ఐఓఎస్ లో గరిష్టంగా రెండు అకౌంట్లకు మాత్రమే వాట్సాప్ సపోర్ట్ ఇస్తోంది. ప్రతీ ప్రొఫైల్‌కు చాట్స్, నోటిఫికేషన్లు, అకౌంట్ ప్రిఫరెన్సెస్ అన్నీ పూర్తిగా సపరేట్‌గా ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Amazon Great Indian Festival 2026: Gaming Headset Deals Under Rs. 5,000
Amazon Great Indian Festival 2026 Sale: Best Gaming Monitors Under Rs. 20,000
Amazon Great Indian Festival 2026: Best Power Bank Deals