చాలా మంది వీక్ పాస్‌వర్డ్‌లు పెట్టడం లేదా పాత సెక్యూరిటీ సెట్టింగ్స్ వాడటం వల్ల ఇతరులు ఈజీగా వైఫై హ్యాక్ చేసి కనెక్ట్ అయిపోతుంటారు. అయితే కొన్ని సింపుల్ స్టెప్స్ ద్వారా మీ వైఫైకి ఎవరెవరు కనెక్ట్ అయ్యారో ఈజీగా కనిపెట్టవచ్చు.
Photo Credit: Pixabay/ methodshop
Wi-Fi
Wi-Fi : ప్రస్తుత డిజిటల్ కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో వైఫై కనెక్షన్ అనేది సర్వసాధారణం అయిపోయింది. అయితే మీ ఇంటి వైఫై ఇంటర్నెట్ స్పీడ్ మునుపటి కంటే అకస్మాత్తుగా తగ్గిపోయినా, లేదా రోజువారీ డేటా ప్లాన్ చాలా త్వరగా ఖాళీ అయిపోతున్నా మీరు అలర్ట్ అవ్వాల్సిందే. మీ అనుమతి లేకుండా ఎవరో అపరిచిత వ్యక్తి లేదా పక్కింటి వారు మీ నెట్‌వర్క్‌ను దొంగతనంగా వాడుతున్నారని దీని అర్థం కావచ్చు. చాలా మంది వీక్ పాస్‌వర్డ్‌లు పెట్టడం లేదా పాత సెక్యూరిటీ సెట్టింగ్స్ వాడటం వల్ల ఇతరులు ఈజీగా వైఫై హ్యాక్ చేసి కనెక్ట్ అయిపోతుంటారు. అయితే కొన్ని సింపుల్ స్టెప్స్ ద్వారా మీ వైఫైకి ఎవరెవరు కనెక్ట్ అయ్యారో ఈజీగా కనిపెట్టవచ్చు.
రౌటర్ అడ్మిన్ పేజీ ద్వారా లైవ్ చెకింగ్
మీ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయిన డివైజ్‌లను తెలుసుకోవడానికి అత్యంత సులువైన మార్గం రౌటర్ అడ్మిన్ పేజీని పరిశీలించడం. ఇందుకోసం ముందుగా మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌ను వైఫైకి కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత బ్రౌజర్ ఓపెన్ చేసి రౌటర్ ఐపీ అడ్రస్‌ను ఎంటర్ చేయాలి. సాధారణంగా అన్ని కంపెనీల రౌటర్లకు 192.168.0.1 లేదా 192.168.1.1 అనే ఐపీ అడ్రస్ ఉంటుంది. ఈ పేజీ ఓపెన్ అయ్యాక మీ రౌటర్ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. లోపలికి వెళ్లాక కనెక్టెడ్ డివైజెస్, డివైజ్ లిస్ట్, డీహెచ్‌సీపీ క్లయింట్స్ లేదా వైర్‌లెస్ క్లయింట్స్ అనే ఆప్షన్లపై క్లిక్ చేస్తే మీ వైఫై వాడుతున్న అన్ని డివైజ్‌ల జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది.
Budget Smartphones : ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 20 వర్సెస్ మోటో జి37 వర్సెస్ రియల్‌మీ పి4 లైట్.. తక్కువ ధరలో బెస్ట్ ఏది?
మీ డివైజ్‌లను గుర్తించడం ఎలా?
రౌటర్ స్క్రీన్‌పై కనిపించే లిస్ట్‌లో మీ ఇంట్లో ఉండే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, సీసీటీవీ కెమెరాలు, ఇతర గ్యాడ్జెట్ల పేర్లు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ఈ జాబితాలో మీకు తెలియని లేదా మీరు ఎప్పుడూ చూడని ఏదైనా కొత్త డివైజ్ పేరు కనిపిస్తే.. అది ఖచ్చితంగా దొంగ కనెక్షన్ అని అనుమానించవచ్చు. దీనిని మరింత పక్కాగా నిర్ధారించుకోవడానికి, మీ ఇంట్లోని డివైజ్‌ల వైఫైని ఒక్కొక్కటిగా ఆఫ్ చేస్తూ రౌటర్ లిస్ట్‌ను రీఫ్రెష్ చేయాలి. అలా చేయడం ద్వారా ఏ పేరు ఏ డివైజ్‌కు సంబంధించిందో మీకు క్లియర్ అవగాహన వచ్చేస్తుంది. చివరికి మిగిలిపోయేదే ఆ అపరిచిత దొంగ డివైజ్ అని గ్రహించాలి.
దొంగ దొరికితే వెంటనే చేయాల్సిన పనులు
ఒకవేళ మీ వైఫై నెట్‌వర్క్‌లో ఏదైనా అపరిచిత డివైజ్ ఉన్నట్లు గుర్తిస్తే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కొన్ని కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలి. మొదటగా మీ వైఫై పాస్‌వర్డ్‌ను మార్చేసి, ఎవరూ ఊహించని విధంగా స్ట్రాంగ్ పాస్‌వర్డ్ సెట్ చేయాలి. రౌటర్ సెక్యూరిటీ మోడ్‌లో పాత పద్ధతులను కాకుండా అత్యంత సురక్షితమైన డబ్ల్యూపీఏ2 లేదా డబ్ల్యూపీఏ3 మోడ్‌ను మాత్రమే ఎంచుకోవాలి. అలాగే చాలా మంది రౌటర్ అడ్మిన్ పేజీ పాస్‌వర్డ్‌ను admin అనే డిఫాల్ట్‌గా ఉంచేస్తారు, దానిని కూడా మార్చాలి. రౌటర్‌లో ఉండే డబ్ల్యూపీఎస్ ఫీచర్‌ను ఆఫ్ చేయడం ద్వారా హ్యాకింగ్ ముప్పు తప్పుతుంది. చివరగా ఆ దొంగ డివైజ్‌ను రౌటర్ సెట్టింగ్స్ లోనే బ్లాక్ చేయాలి.
మొబైల్ యాప్స్ ద్వారా నిఘా
ప్రస్తుత రోజుల్లో టీపీ-లింక్ , డీ-లింక్, ఆసుస్, నెట్‌గేర్ వంటి ప్రముఖ బ్రాండ్ల రౌటర్ల కోసం కంపెనీలు ప్రత్యేకమైన మొబైల్ యాప్స్‌ను అందిస్తున్నాయి. ఈ యాప్స్ ద్వారా రౌటర్ అడ్మిన్ పేజీతో పనిలేకుండా డైరెక్ట్‌గా ఫోన్ లోనే కనెక్టెడ్ డివైజ్‌ల సమాచారాన్ని సులభంగా చూడవచ్చు. ఒకవేళ మీ రౌటర్ పాతదైతే గనుక.. గూగుల్ ప్లే స్టోర్ లో లభించే ఫింగ్ వంటి నెట్‌వర్క్ స్కానర్ యాప్స్ సహాయంతో మీ వైఫై పరిధిలో ఉన్న డివైజ్‌లను క్షణాల్లో స్కాన్ చేసి గుర్తించవచ్చు.
వైఫైని ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచే చిట్కాలు
కేవలం ఒకసారి గట్టి పాస్‌వర్డ్ పెట్టి వదిలేస్తే సరిపోదు. సైబర్ నిపుణుల సూచనల ప్రకారం.. ప్రతి మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి వైఫై పాస్‌వర్డ్‌ను మారుస్తూ ఉండాలి. అలాగే రౌటర్ సాఫ్ట్‌వేర్ ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం ద్వారా కొత్త రకమైన హ్యాకింగ్ వైరస్ల నుంచి రక్షణ లభిస్తుంది. ఒకవేళ మీ ఇంటికి బంధువులు, స్నేహితులు ఎక్కువగా వస్తుంటే.. మీ మెయిన్ వైఫై పాస్‌వర్డ్ వారికి చెప్పకుండా, రౌటర్‌లో ఉండే గెస్ట్ నెట్‌వర్క్ ఫీచర్‌ను ఆన్ చేసి వారికి వేరే కనెక్షన్ ఇవ్వడం చాలా సురక్షితమైన పద్ధతి. కారణం లేకుండా నెట్ స్లో అయితే వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోండి.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy S25 Gets New Galaxy AI Features From Galaxy S26 With New One UI 8.5 Update
Ubisoft Shuts Down 2 More Studios, Lays Off Up to 380 Employees in Latest Round of Cost Cuts