రాబోయే మ్యాక్‌బుక్ ప్రో ఓఎల్ఈడీ టచ్ ప్యానెల్స్ తయారీకి సామ్సంగ్ డిస్ప్లేని మాత్రమే ఏకైక సప్లయర్‌గా యాపిల్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
Apple
Apple : ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన ఐకానిక్ మ్యాక్‌బుక్ ప్రో ల్యాప్‌టాప్‌ను సరికొత్త ఓఎల్ఈడీ టచ్‌స్క్రీన్‌తో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నయా ల్యాప్‌టాప్ 14 ఇంచులు, 16 ఇంచుల స్క్రీన్ సైజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు యాపిల్ మ్యాక్‌బుక్‌లలో టచ్ స్క్రీన్ సదుపాయం లేదు. గత కొన్నేళ్లుగా ప్రీమియం ల్యాప్‌టాప్ విభాగంలో మ్యాక్‌బుక్స్ సేల్స్ విపరీతంగా పెరగడం, విండోస్ టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్‌లకు ఆదరణ పెరుగుతుండటంతో యాపిల్ కూడా తన వ్యూహాన్ని మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
సప్లయర్‌గా సామ్సంగ్ డిస్ప్లే హవా
మీడియా నివేదికల ప్రకారం.. రాబోయే మ్యాక్‌బుక్ ప్రో ఓఎల్ఈడీ టచ్ ప్యానెల్స్ తయారీకి సామ్సంగ్ డిస్ప్లేని మాత్రమే ఏకైక సప్లయర్‌గా యాపిల్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. డెవలప్మెంట్ ప్రారంభ దశ నుంచే సామ్‌సంగ్‌ను యాపిల్ భాగస్వామిగా చేసుకున్నప్పటికీ, ఒప్పందంపై ఇంకా అధికారికంగా సంతకం జరగాల్సి ఉంది. ఈ డిస్ప్లేల తయారీలో ఆక్సైడ్ థిన్-ఫిల్మ్ (TFT) టెక్నాలజీ, RGB OLED స్ట్రక్చర్, అడ్వాన్స్డ్ ఇన్-డిస్ప్లే టచ్ సొల్యూషన్స్‌ను ఉపయోగించనున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
స్ట్రాటజీ చేంజ్.. ఐప్యాడ్ వర్సెస్ మ్యాక్‌బుక్
ప్రస్తుత మ్యాక్‌బుక్ ప్రో మోడల్స్, ఐప్యాడ్ ప్రో ఓఎల్ఈడీ డిస్ప్లేలకు ఎల్జీ కంపెనీయే ప్రధాన డిస్ప్లే సప్లయర్‌గా ఉంది. అయితే రాబోయే టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ విషయంలో ఎల్జీ పేరు పరిశీలనలో లేకపోవడం గమనార్హం. గతంలో యాపిల్ కంపెనీ ఐప్యాడ్, మ్యాక్‌బుక్ డివైజ్ ల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని మెయింటెన్ చేసేది. టచ్‌స్క్రీన్ కేవలం ఐప్యాడ్లకే సరైనదని, ల్యాప్‌టాప్‌లకు కీబోర్డ్, ట్రాక్‌ప్యాడ్ మాత్రమే బెటర్ అని భావించేది. కానీ ఇప్పుడు సరికొత్త మ్యాక్‌బుక్ ఆల్ట్రా పేరుతో తన మొదటి టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతుండటం పెద్ద మార్పుగా భావించవచ్చు.
Vivo T5x 5G vs OnePlus Nord CE6 Lite vs Poco M8 5G : ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ ఆప్షన్?
శక్తివంతమైన చిప్సెట్, ఆల్ట్రా బ్రాండింగ్
ఇటీవలే భారత్‌లో సరికొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడల్‌ను లాంచ్ చేసిన యాపిల్, త్వరలోనే తీసుకురాబోయే ఈ టచ్‌స్క్రీన్ వర్షన్లో అత్యంత పవర్ఫుల్ నెక్స్ట్-జెన్ యాపిల్ చిప్‌సెట్‌ను వాడనుంది. కంపెనీ లైనప్‌లోనే ఇది అత్యంత ప్రీమియం ల్యాప్‌టాప్ కానున్నందున దీనికి Ultra బ్రాండింగ్ ఇచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యాపిల్ చరిత్రలోనే ల్యాప్‌టాప్‌లో ఓఎల్ఈడీ ప్లస్ టచ్‌స్క్రీన్ రావడం ఇదే తొలిసారి కానుంది. అయితే, ఈ నయా మోడల్ లాంచ్ తేదీపై కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ప్రకటన
ప్రకటన