TRAI serious on True caller over 1600 and 140 Series Spam Tagging: ముఖ్యంగా 1600, 140 సిరీస్‌లతో ప్రారంభమయ్యే ఫోన్ నంబర్లను బ్లాక్ లిస్టులో పెట్టడం లేదా స్పామ్‌గా చూపించడంపై ట్రాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
TRAI vs Truecaller
TRAI serious on True caller over 1600 and 140 Series Spam Tagging: మన దేశంలో ఫోన్ కాల్స్ మేనేజ్మెంట్ యాప్స్ (ఉదాహరణకు ట్రూకాలర్ వంటివి), టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మధ్య గత కొన్ని నెలలుగా తీవ్రమైన వివాదం నడుస్తోంది. టెలిమార్కెటింగ్, ప్రభుత్వ కమ్యూనికేషన్ల కోసం ఉపయోగించే కొన్ని ప్రత్యేక ఫోన్ నంబర్ సిరీస్‌లను ఈ యాప్స్ స్పామ్ కేటగిరీలో చేర్చడమే ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా 1600, 140 సిరీస్‌లతో ప్రారంభమయ్యే ఫోన్ నంబర్లను బ్లాక్ లిస్టులో పెట్టడం లేదా స్పామ్‌గా చూపించడంపై ట్రాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నంబర్లను స్పామ్ జాబితాలో ఉంచకూడదని కాల్ మేనేజ్‌మెంట్ యాప్స్‌ను హెచ్చరించిన ట్రాయ్.. తాజాగా ఈ విషయంలో తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ కీలక ప్రకటన విడుదల చేసింది.
బ్యాంకింగ్, ప్రభుత్వ ఫోన్ల కోసమే ప్రత్యేకంగా 1600 సిరీస్..
ట్రాయ్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ.. 1600 సిరీస్ ఫోన్ నంబర్ల ప్రాముఖ్యతను స్పష్టం చేసింది. దేశంలోని బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగాలకు చెందిన సంస్థల అధికారిక సమాచార మార్పిడి కోసం ప్రత్యేకంగా 1600 సిరీస్ నంబర్లను కేటాయించినట్లు తెలిపింది. ఆర్‌బీఐ, సెబీ, ఐఆర్‌డీఏఐ, పీఎఫ్‌ఆర్‌డీఏ వంటి నియంత్రణ సంస్థల పరిధిలోకి వచ్చే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ నంబర్లనే వాడాలని స్పష్టం చేసింది. వీటితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పౌరులకు ముఖ్యమైన సమాచారం చేరవేయడానికి కూడా ఈ 1600 సిరీస్ నంబర్లనే కేటాయించారు. కాబట్టి, అత్యంత కీలకమైన ఈ ప్రభుత్వ, ఆర్థిక సేవల నంబర్లను ఎలాంటి కాల్ మేనేజ్‌మెంట్ యాప్స్ లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు బ్లాక్ చేయకూడదని, వాటిని స్పామ్ కేటగిరీలో పెట్టడానికి వీల్లేదని ట్రాయ్ ఖరాకండిగా చెప్పింది.
టెలి మార్కెటింగ్ కంపెనీల కోసం 140 సిరీస్ నంబర్లు..
మరోవైపు కేవలం టెలిమార్కెటింగ్ లేదా ప్రమోషనల్ కాల్స్ చేసే సంస్థల కోసం ట్రాయ్ 140 సిరీస్‌ను కేటాయించింది. అయితే, ఈ సిరీస్ నంబర్లను పొందాలంటే సదరు మార్కెటింగ్ కంపెనీలు కచ్చితంగా సంబంధిత టెలికాం సేవల సంస్థ వద్ద తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నంబర్ల విషయంలో కస్టమర్లకు ట్రాయ్ పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఒకవేళ ఏ సబ్‌స్క్రైబర్ అయినా ఈ 140 సిరీస్ నంబర్ల నుంచి వచ్చే ప్రమోషనల్ కాల్స్ వద్దనుకుంటే, వారు డూ నాట్ డిస్టర్బ్ (DND) రిజిస్ట్రీలో తమ ప్రాధాన్యతను నమోదు చేసుకోవడం ద్వారా ఈ నంబర్లను సులభంగా బ్లాక్ చేసుకోవచ్చని రెగ్యులేటర్ స్పష్టం చేసింది.
EPFO : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లో మారిన రూల్స్.. ఇకపై పాత పద్ధతి పనిచేయదు
కఠిన చర్యలకు సిద్ధమవుతున్న టెలికాం రెగ్యులేటర్..
నిబంధనలు ఉల్లంఘిస్తూ 140, 1600 సిరీస్ నంబర్లను తప్పుగా స్పామ్‌గా ట్యాగ్ చేస్తున్న కాల్ మేనేజ్‌మెంట్ యాప్స్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు ట్రాయ్ సిద్ధమవుతోంది. ఇందుకోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) నుంచి మరిన్ని చట్టపరమైన అధికారాలను కల్పించాలని కోరింది. ఇలాంటి తప్పుడు గుర్తింపుల వల్ల బ్యాంకులు, ప్రభుత్వాల నుంచి వచ్చే అత్యవసర సమాచారాన్ని ప్రజలు కోల్పోతున్నారని, ఇది చాలా తీవ్రమైన విషయమని ట్రాయ్ భావిస్తోంది.
ట్రాయ్ నిర్ణయాన్ని తప్పుపట్టిన ట్రూకాలర్ సీఈఓ..
ట్రాయ్ తీసుకుంటున్న ఈ తాజా చర్యలపై ప్రముఖ కాల్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ గట్టిగానే స్పందించింది. ట్రూకాలర్ సీఈఓ రిషిత్ ఝున్‌ఝున్‌వాలా ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది కూడా 140, 1600 సిరీస్ నంబర్లకు సంబంధించిన కమ్యూనిటీ రిపోర్టులను, స్పామ్ సమాచారాన్ని యాప్‌లో యూజర్లకు చూపించవద్దని ట్రాయ్ తమను ఆదేశించిందని ఆయన గుర్తుచేశారు. ఈ నిర్ణయాల వల్ల కస్టమర్లకు నిజమైన స్పామ్ కాల్స్ నుంచి రక్షణ లభించకుండా పోతుందని, వినియోగదారుల భద్రత దెబ్బతింటుందని ట్రూకాలర్ యాజమాన్యం తమ ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సంస్థలకు, ప్రైవేట్ యాప్స్‌కు మధ్య ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
IFA 2026: Lenovo Unveiled New IdeaPad, Yoga and ThinkBook Laptops
IFA 2026: Nvidia RTX Spark PCs, Local AI Tools Announced With October Launch Planned
Luna Band Now Available Globally: Check Price in India, Specifications and Features