చైలా లాంచ్ అయిన Redmi Turbo 4 స్మార్ట్ ఫోన్.. ధరతోపాటు స్పెసిఫికేషన్స్ మీకోసం
చైనాలో Redmi Turbo 4 ఫోన్ గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ ఫోన్ MediaTek Dimensity 8400-Ultra ప్రాసెసర్‌తో వస్తోన్న వస్తున్న మొదటి స్మార్ట్ ఫోన్‌గా గుర్తింపు పొందింది. అలాగే, 6,550mAh బ్యాటరీతో 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దుమ్ము, నీటి నియంత్రణ కోసం IP66, IP68, IP69 రేటింగ్‌లకు అనుగుణంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ హ్యాండ్‌సెట్‌కు 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్, 1.5K OLED డిస్‌ప్లేను అందించారు. ఇది Xiaomi HyperOS 2.0 స్కిన్‌తో Android 15లో రన్ అవుతోంది