మార్చి 27న Infinix Note 50X 5G భారత్‌లో లాంఛ్.. డిజైన్ అధికారిక ప్రకటన
త్వరలోనే Infinix Note 50X 5G మన దేశంలోకి రాబోతోంది. తాజాగా, కంపెనీ లాంచ్ తేదీని ప్రకటించింది. అలాగే, రాబోయే హ్యాండ్‌సెట్ డిజైన్‌ను కూడా వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ లైవ్‌లో వచ్చిన మైక్రోసైట్ ఈ-కామర్స్ సైట్‌లో దీని లభ్యతను ధృవీకరించింది. లాంచ్‌కు ముందు రోజుల్లో ఈ స్మార్ట్ ఫోన్ గురించి మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలోనే Infinix ఇండోనేషియాలో బేస్ Note 50, Note 50 ప్రో, Note 50 ప్రో+ లను ఆవిష్కరించింది. భారత్‌లో ఈ వేరియంట్‌ల లాంఛ్‌పై ఇంకా స్పష్టత లేదు.